హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Hitler Watch : వేలంపాటలో హిట్లర్ వాచీ..ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా

Hitler Watch : వేలంపాటలో హిట్లర్ వాచీ..ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా

హిట్లర్ వాచీ

హిట్లర్ వాచీ

Hitler watch : రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడైన అడాల్ఫ్ హిట్లర్(Adolf Hitler)అంటే ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. ఒకప్పటి జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌ బంగారు వాచీ "ఆండ్రియాస్ హూబర్(Andreas Huber)వాచీ" అమెరికాలో జరిగిన వేలంలో 1.1 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది.

ఇంకా చదవండి ...

Hitler watch : రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడైన అడాల్ఫ్ హిట్లర్(Adolf Hitler)అంటే ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. ఒకప్పటి జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌ బంగారు వాచీ "ఆండ్రియాస్ హూబర్(Andreas Huber)వాచీ" అమెరికాలో జరిగిన వేలంలో 1.1 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. అలెగ్జాండర్ హిస్టారికల్ ఆక్షన్స్(Alexander Historical Auctions) సంస్థ అమెరికాలోని మేరల్యాండ్ రాష్ట్రంలోని చెసాపీక్ సిటీలో నిర్వహించిన వేలంలో ఏకంగా 1.1 మిలియన్ డాలర్లకు అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.8.71 కోట్లకు ఓ వ్యక్తి సొంతం చేసుకున్నాడు. గతంలో కూడా అలెగ్జాండర్ హిస్టారికల్ ఆక్షన్స్ సంస్థ నాజీ స్మారక చిహ్నాలను విక్రయించింది. ప్రస్తుతం వేలంలో అమ్ముడైన వాచీని(Hitler watch sells)నేషనలిస్ట్ సోషలిస్ట్ వర్కర్స్ పార్టీ మెంబర్లు 1933లో హిట్లర్‌ కు పుట్టినరోజు కానుకగా బహూకరించి ఉండొచ్చని క్యాటలాగ్‌లో రాశారు. అదే ఏడాది హిట్లర్ జర్మనీ ఛాన్సలర్ అయ్యారు. జర్మనీ నాజీలకు ఆరాధ్య చిహ్నమైన స్వస్తిక్ గుర్తు ప్రముఖంగా కనబడేలా దానిపై గద్ద బొమ్మను హిట్లర్ వాచీపై చిత్రించారు. అడాల్ఫ్ హిట్లర్ పేరులోని రెండు పదాల మొదటి అక్షరాలు వచ్చేలా "AH"అని వాచీ పైభాగంపై ఏర్పాటు చేశారు.

ఈ వాచీ రివర్సిబుల్... అంటే గడియారం ఉన్న భాగాన్ని పక్కకు తీసి తిప్పి పెట్టుకోవచ్చు. దీనితో ఇటు గడియారంలా కనిపిస్తుంది. దాన్ని తిప్పి పెట్టుకున్నప్పుడు స్వస్తిక్ గుర్తు, ఏహెచ్ అనే అక్షరాలు, గ్రద్ద బొమ్మ కనిపిస్తాయి. 1945 మే లో బవేరియాలో హిట్లర్ తలదాచుకున్న బెర్‌గాఫ్‌పై సుమారు 30 మంది ఫ్రెంచ్ సైనికులు దాడి చేసినప్పుడు, ఈ గడియారాన్ని సంగ్రహించి ఉంటారని వేలం సంస్థ అంచనా వేసింది. అప్పటి నుంచి ఈ వాచీ అనేక చేతులు మారి ఉండవచ్చునని వివరించింది. అయితే, ఈ వాచీని హిట్లర్ కచ్చితంగా ధరించారన్న దానికి ఆధారాలు తమ వద్ద లేవని వేలం పత్రాల్లో పేర్కొన్నారు. ఈ వాచీ 2 నుంచి 4 మిలియన్ డాలర్ల వరకు అమ్ముడవుతుందని వేలం సంస్థ అంచనా వేసింది. కానీ అంతకన్నా తక్కువకు అమ్ముడైంది.

Monkeypox : మంకీపాక్స్ లక్షణాలను హోమియోపతితో నయం చేయోచ్చు!

అయితే హిట్లర్ వాచీ వేలం వేయడంపై యూదు నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వాచీ అమ్మకాన్ని రద్దు చేయాలని కోరారు. వాచీ వేలాన్ని అసహ్యకరమైన చర్యగా అభివర్ణిస్తూ నాజీల వస్తువులను విక్రయించకూడదని కోరుతూ 34 మంది యూదు నేతలు ఒక లేఖను విడుదల చేశారు. నాజీ పార్టీ పనిచేసిన సిద్ధాంతాల ప్రచారానికి సాయపడుతున్నారా అని ప్రశ్నించారు. ఈ విమర్శలపై వేలం సంస్థ సమాధానమిచ్చింది. చరిత్రను సంరక్షించడమే తమ ఉద్దేశ్యమని వివరణ ఇచ్చింది. చరిత్ర మంచిదయినా, చెడ్డదయినా దాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది...చరిత్రను నాశనం చేస్తే అది జరిగింది అని తెలుసుకునే రుజువులు మాయమైపోతాయి అని ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మిండీ గ్రీన్‌స్టెయిన్ తెలిపారు. కాగా, అడాల్ఫ్ హిట్లర్ 1933-1945 మధ్య నాజీ జర్మనీకి నాయకత్వం వహించారు. హిట్లర్ పాలనలో సుమారు 1.10 కోట్ల మంది హత్యకు గురయ్యారని అంచనా. ఇందులో 60 లక్షల మందిని యూదులనే కారణంగా హత్య చేయబడ్డారని చరిత్ర తెలిపింది.

First published:

Tags: Watch