పాకిస్థానే నా ఇల్లు...అక్కడే పని చేసుకుంటా...అద్నాన్ సమీ కుమారుడి వివరణ...

టీనేజీలో ఉన్న సమయంలో తన తండ్రి కోరిక మేరకు భారత్ లో పెరిగానని, ప్రస్తుతం తన వయస్సు 26 సంవత్సరాలని, అందుకే తన కోరిక మేరకు పాకిస్థాన్ లో పనిచేస్తున్నానని తెలిపారు. నా ఇల్లు పాకిస్థానే అని ఈ సందర్భంగా అజాన్ ప్రకటించారు.

news18-telugu
Updated: September 3, 2019, 10:47 PM IST
పాకిస్థానే నా ఇల్లు...అక్కడే పని చేసుకుంటా...అద్నాన్ సమీ కుమారుడి వివరణ...
అద్నాన్ కుమారుడు అజాన్
  • Share this:
బాలీవుడ్ పాప్ స్టార్ అద్నాన్ సమీ కుమారుడు అజాన్ సమీ పాకిస్థానే తన ఇల్లు అని సంచలన ప్రకటన చేశాడు. ఓ టెలివిజన్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అజాన్ సమీ మాట్లాడుతూ తాను టీనేజీలో ఉన్న సమయంలో తన తండ్రి కోరిక మేరకు భారత్ లో పెరిగానని, ప్రస్తుతం తన వయస్సు 26 సంవత్సరాలని, అందుకే తన కోరిక మేరకు పాకిస్థాన్ లో పనిచేస్తున్నానని తెలిపారు. నా ఇల్లు పాకిస్థానే అని ఈ సందర్భంగా అజాన్ ప్రకటించారు. అలాగే తన తండ్రి అద్నాన్ సమీ అంటే ఎంతో ప్రేమ ఉందని, ఆయనతో ఉండటం ఎంతో ఇష్టమని పేర్కొంటూనే, తన ఇల్లు మాత్రం పాకిస్థానే అని పేర్కొన్నాడు. అలాగే కశ్మీర్ విషయమై ఇరు దేశాల మధ్య జరుగుతున్న ఉద్రిక్తతల పై తనను కొందరు స్పందించాలని కోరినప్పటికీ తాను మాత్రం మౌనంగానే ఉంటానని అజాన్ పేర్కొన్నాడు.  అయితే అజాన్ నిర్ణయం పై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.

First published: September 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు