Loneliness Minister: జపాన్‌లో ఒంటరితనం శాఖ.. దానికో మంత్రి.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో ఒంటరితనం శాఖ (ప్రతీకాత్మక చిత్రం)

Loneliness Minister: ఇదేం శాఖ... ఒంటరితనం అనేది అంత పెద్ద సమస్యా... దానికి ఓ శాఖను ఏర్పాటుచెయ్యాలా... ఎందుకు అనే డౌట్ వస్తోంది కదూ... ఎందుకో తెలుసుకుందాం.

 • Share this:
  Loneliness Minister: జపాన్... ప్రపంచంలో అభివృద్ధిలో దూసుకుపోయే దేశాల్లో ఒకటి. రెండు అణుబాంబులను తట్టుకొని నిలబడిన దేశం... అంతేకాదు... నిత్యం భూకంపాలు, సునామీలు వచ్చే ప్రదేశం. అయినా అక్కడి వారు ధైర్యంగా జీవిస్తున్నారు. అందువల్ల జపాన్ ప్రజలు ధైర్యవంతులు... వారు సూసైడ్లు చేసుకోరు అనడానికి లేదు. జపాన్‌లో ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మీకు తెలుసా... అక్కడి ఫ్యుజీ పర్వతం పక్కన ఓ అడవి ఉంటుంది. పనిగట్టుకొని సూసైడ్ చేసుకోవడానికే ఆ అడవికి వెళ్తుంటారు చాలా మంది. అదో పెద్ద కథ. ప్రస్తుత విషయానికి వస్తే... జపాన్ టైమ్స్ ప్రకారం... ప్రధానమంత్రి యొషిహిడే సుగా... తన కేబినెట్‌లో ఒంటరితనం (Loneliness) శాఖను ఫిబ్రవరి ప్రారంభంలో ఏర్పాటు చేసి... దానికి ఓ మంత్రిని నియమించారు. ఐతే... ప్రపంచంలో ఇలాంటి శాఖ ఇది రెండోది. ఎందుకంటే... 2018లో బ్రిటన్ ప్రభుత్వం ఇలాంటి శాఖను ఏర్పాటుచేసింది.

  ప్రస్తుతం జపాన్‌లో సూసైడ్ రేటు బాగా పెరిగింది. కరోనా వచ్చాక చాలా మంది ఒంటరితనం భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి ఉన్నా.... జపాన్‌లో ఎక్కువగా ఉంది. ఈ ఒంటరితనం శాఖను తెత్సుషి సకమోటో నిర్వహిస్తున్నారు. దేశంలో శిశువుల జననం తగ్గిపోతుండంతో... ఆ విషయాన్ని కూడా సకమోటో పరిశీలిస్తున్నారు. దానికి ఆయన ఇన్‌చార్జిగా ఉన్నారు.

  జపాన్‌లో సూసైడ్లు చేసుకుంటున్న వారిలో మహిళలే ఎక్కువ. ఇప్పుడు సకమోటో... ఓ పెద్ద వ్యూహాన్ని రెడీ చేస్తున్నారు. దాని ద్వారా ఆత్మహత్యల్ని ఆపాలన్నది టార్గెట్. ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలు పెంచాలన్నది ఆయన వ్యూహం. ఎవరూ ఒంటరిగా ఉండకుండా చెయ్యాలని ఆయన అనుకుంటున్నారు. కానీ... సెల్‌ఫోన్లు, సోషల్ మీడియా అన్నీ ఉన్నా... జపాన్‌లో చాలా మంది... ఇలా డిప్రెషన్‌లోకి వెళ్లి... తర్వాత ఈ లోకం నుంచే వెళ్లిపోతున్నారు.

  చావుకి భయపడని జనం:
  చావడానికి ధైర్యం ఉంటుంది... బతకడానికి లేకుండాపోతోంది. జపాన్ ప్రజలకు ఆత్మహత్యలనేవి చరిత్ర నుంచే కామన్ అలవాటు. యుద్ధాల్లో శత్రువులు చంపేందుకు వస్తే... ఆ అవకాశం శత్రువులకు ఇవ్వకుండా సమురాయ్‌లు తామే ఆత్మహత్య చేసుకునేవారు. కాల క్రమంలో... ఈ చావులనేవి జపాన్ ప్రజలకు అలవాటయ్యాయి. అక్కడ చాలా ప్రదేశాలు చావుల కేంద్రాలుగా ఉంటాయి. అంటే ఆ కేంద్రాలు, ఊళ్లు, ప్రదేశాల దగ్గరకు వెళ్తే... అంతా ప్రశాంతంగా ఉండి... ఎటు చూసినా చావడమే మేలు అనిపించే వాతావరణం ఉంటుంది. అలాంటి చోట్లకు వెళ్తున్న యువతీ యువకులు... తిరిగి వెనక్కి రావట్లేదు.

  ఇది కూడా చదవండి: Zodiac signs: ఈ రాశుల వారిపై ఎల్లప్పుడూ లక్ష్మీ కటాక్షం... ఆకస్మిక ధనప్రాప్తి

  ఒంటరితనానికీ ఓ శాఖ అవసరమా అని మనకు అనిపించడం సహజం. కానీ జపాన్‌లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది కాబట్టే ఈ శాఖను ఏర్పాటు చేశారు. ఎవరైనా చనిపోవాలనే ఆలోచనకు వస్తే... ముందుగా... "ఒంటరితనాన్ని ఆపే కార్యాలయం" ("isolation/loneliness countermeasures office")కి ఓసారి రావాలని ప్రజలను కోరుతున్నారు. దీన్ని ఫిబ్రవరి 19న ఏర్పాటుచేశారు. అలా ఎవరైనా వస్తే వారికి కౌన్సెలింగ్ ఇస్తారు. ధైర్యం చెబుతారు. మరి అలాగైనా పరిస్థితి మెరుగవుతుందో లేదో....
  Published by:Krishna Kumar N
  First published: