హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Study : పురుషాంగం సైజు చిన్నగా ఉందా?కారణం అదేనంట!

Study : పురుషాంగం సైజు చిన్నగా ఉందా?కారణం అదేనంట!

Japan Study : లైంగిక అంశాల పట్ల చాలామంది ఆసక్తి చూపించడం సహజమే. అయితే వీటిపై మాట్లాడేందుకు చాలామంది సిగ్గుపడుతుంటారు. అయితే, లైంగికాంశాల్లో చాలామందికి ఎన్నో ప్రశ్నలు మిగిలి ఉంటాయి. ముఖ్యంగా పురుషాంగం పరిమాణంలో తేడాలతో చాలామంది మగవారు అపోహలు పడుతుంటారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  Japan Study : లైంగిక అంశాల పట్ల చాలామంది ఆసక్తి చూపించడం సహజమే. అయితే వీటిపై మాట్లాడేందుకు చాలామంది సిగ్గుపడుతుంటారు. అయితే, లైంగికాంశాల్లో చాలామందికి ఎన్నో ప్రశ్నలు మిగిలి ఉంటాయి. ముఖ్యంగా పురుషాంగం పరిమాణంలో తేడాలతో చాలామంది మగవారు అపోహలు పడుతుంటారు. సాధారణంగా పురుషుల్లో పురుషాంగం(Penis) వేర్వేరు పరిమాణాల్లో ఉంటుంది. అయితే పురుషాంగం పరిమాణం చిన్నదిగా ఉంటే వారు శృంగారానికి పనికిరారు అనే అనుమానం కూడా చాలా మందిలో ఉంది. పురుషాంగం సైజు పెంచకోవడానికి చాలా మంది చాలా వింత ప్రయత్నాలు చేసిన వారు కూడా ఉన్నారు. పురుషుల్లో ముక్కు సైజును బట్టే వారి పురుషాంగం పరిమాణం ఆధారపడి ఉంటుందని జపాన్​ శాస్త్రవేత్తలు చేసిన ఓ అధ్యయనంలో తేలింది. క్యోటో ప్రిఫెక్చురల్ యూనివర్శిటీ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు..ముక్కు పొడవు, పురుషాంగం పొడవు మధ్య లోతైన సంబంధం ఉందని కనుగొన్నారు.

  పురుష శరీర నిర్మాణ శాస్త్రానికి సంబంధించిన మెడికల్‌ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం క్యోటో ప్రిఫెక్చురల్ యూనివర్శిటీ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు 30-50ఏళ్ల లోపు వయస్సు ఉన్న దాదాపు 126 మంది పురుషుల శవాలను పరిశోధకులు పరిశీలించారు. వారు మరణించిన మూడు రోజుల్లోపు ఈ అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు వారి అంగపరిమాణంతో పాటూ ముక్కు పొడుగు, వెడల్పు, మనిషి పొడవు, వెడల్పు, బాడీ షేప్ ఇలా అన్నింటినీ పరిశీలించడం గమనార్హం. పురుషాంగాన్ని కొలిచే సమయంలో వారు కొన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. అచేతనావస్థలో ఉన్న శవాలు కావడంతో వాటి పురుషాంగాలను చేతితో లాగి కొలతలు తీసుకొన్నారు. ఈ అధ్యయనంలో చిన్న ముక్కు ఉన్నవారికి పురుషాంగ పరిమాణం చిన్నగానూ.. పెద్ద ముక్కు ఉన్నవారికి పెద్దగానూ కనిపించిందట. పొడవాటి ముక్కున్న వ్యక్తుల పురుషాంగం నిటారుగా ఉన్నపుడు కనీసం 5.3 అంగుళాల మేర ఉంటుందని.. అదే చిన్న ముక్కున్న పురుషుల్లో 4.1 అంగుళాల మాత్రమే ఉన్నట్టు తెలిపారు. ముక్కు, పురుషాంగం పరిమాణం మధ్య అనుబంధాన్ని కనుగొన్నారు కానీ, వారు ఎందుకు అనే కారణం మాత్రం కనుగొనలేకపోయారు. ఈ అంశంపై మరింత విస్తృతంగా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని జపాన్‌ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

  Diabetes patients : షుగర్ ఉన్నవాళ్లు రక్తదానం చేయవచ్చా? ఇది ఎంతవరకు సురక్షితం!  అయితే రోమన్ సామ్రాజ్యంలో పురుషుల పురుషాంగానికి సంబంధించి ప్రజల్లో ఓ నమ్మకం ఉండేదని ప్రచారంలో ఉంది. ఒక వ్యక్తి ముక్కు పరిమాణం ఎంత ఉంటే.. వారి అంగ పరిమాణం కూడా అంతే ఉంటుందని అక్కడి వారు నమ్యమేవారట. అందుకు తగినట్లుగానే శిక్షలు కూడా ఉండేవట. ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే ముందు వారి ముక్కు కోసేసేవారట. అయితే అది వారి నమ్మకం అని మాత్రమే అనుకున్నారు కానీ ఇప్పుడు అదే నిజం అని తేలింది.

  Published by:Venkaiah Naidu
  First published:

  Tags: Japan

  ఉత్తమ కథలు