భారత్‌తో అనుకోకుండా యుద్ధం జరగొచ్చు : పాక్ విదేశాంగ మంత్రి

జెనీవాలో... ఐక్యరాజ్యసమితి మావ హక్కుల సంఘం మీటింగ్‌కి వెళ్లిన సందర్భంగా... ఖురేషీ... జరగబోయే పరిణామాల్ని భారత్, పాకిస్థాన్ అర్థం చేసుకుంటాయని తాను నమ్ముతున్నట్లు తెలిపారు.

Krishna Kumar N | news18-telugu
Updated: September 13, 2019, 8:29 AM IST
భారత్‌తో అనుకోకుండా యుద్ధం జరగొచ్చు : పాక్ విదేశాంగ మంత్రి
ఖురేషీ (File)
  • Share this:
జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితుల వల్ల భారత్‌, పాకిస్థాన్ మధ్య అనుకోకుండా యుద్ధం జరిగే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ. జెనీవాలో... ఐక్యరాజ్యసమితి మావ హక్కుల సంఘం మీటింగ్‌కి వెళ్లిన సందర్భంగా... ఆయన... జరగబోయే పరిణామాల్ని భారత్, పాకిస్థాన్ అర్థం చేసుకుంటాయని తాను నమ్ముతున్నట్లు తెలిపారు. అనుకోకుండా జరిగే యుద్ధాన్ని మాత్రం కొట్టిపారేయలేం అని అన్నారాయన. పరిస్థితి తీవ్ర రూపు దాల్చితే ఏమైనా జరగొచ్చన్నారు. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం హై కమిషనర్ మిషెల్లే బషెలెట్... జమ్మూకాశ్మీర్‌లో పర్యటించాలనుకుంటున్నట్లు ఖురేషీ వివరించారు. జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితులపై అంతర్జాతీయ దర్యాప్తు జరగాలని ఖురేషీ... మంగళవారం కోరారు. తాను బషెలెట్‌తో మాట్లాడానన్న ఖురేషీ... జమ్మూకాశ్మీర్‌కి సంబంధించి... భారత్, పాకిస్థాన్‌లో ఉన్న ప్రాంతాల్ని సందర్శించాల్సిందిగా ఆమెను కోరారని వివరించారు.

బషెలెట్ రెండు ప్రాంతాల్లో పర్యటించి, ఆమెకు అభ్యంతరకరంగా ఉన్నవాటిపై రిపోర్ట్ ఇస్తారనీ, తద్వారా అక్కడ ఏం జరుగుతోందో ఈ ప్రపంచానికి తెలుస్తుందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య చర్చలు జరిగే అవకాశాలు లేవన్నారు. ఈ వివాదంపై మధ్యవర్తిత్వం అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ఖురేషీ. అమెరికా మధ్యవర్తిత్వం వహించినా పర్వాలేదన్నారు.

ఖురేషీ వ్యాఖ్యల్ని భారత్ తప్పుపట్టింది. ప్రపంచ ఉగ్రవాదానికి అనుకూలంగా ఖురేషీ మాట్లాడుతున్నారని మండిపడింది. తమకు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మద్దతు ఉందని... పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి మొహమ్మద్ ఫైసర్ తెలిపారు. గతవారం సౌదీ రేబియా, UAE ప్రనిధిధులు పాకిస్థాన్‌లో పర్యటించారు. ఖురేషీతోనూ సమావేశం అయ్యారు.
Published by: Krishna Kumar N
First published: September 13, 2019, 8:27 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading