అబుదాబి యువరాజు గొప్ప మనసు.. ఆ చిన్నారి ఇంటికెళ్లి..

రాజు షేక్ హ్యాండ్ మిస్సవడంతో.. ఆ బాలిక చాలా బాధపడింది. వీడియోలో ఆమె ఎక్స్‌ప్రెషన్ చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. అయితే ఇదే వీడియో రాజు మహమ్మద్ బిన్ దాకా వెళ్లడంతో.. ఆ బాలికను ఆయన ఆశ్చర్యానందంలో ముంచెత్తారు.

news18-telugu
Updated: December 4, 2019, 8:36 AM IST
అబుదాబి యువరాజు గొప్ప మనసు.. ఆ చిన్నారి ఇంటికెళ్లి..
చిన్నారితో అబుదాబీ యువరాజు మహమ్మద్ బిన్
  • Share this:
అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ తన గొప్ప మనసు చాటుకున్నాడు. గత వారం అక్కడి అధ్యక్ష భవనంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు యువరాజు వెళ్లగా.. ఆయనకు స్వాగతం పలికేందుకు పదుల సంఖ్యలో చిన్నారులు అక్కడికి వెళ్లారు. చేతిలో యూఏఈ జెండా పెట్టుకుని వరుసగా నిలుచుని ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజు చిరునవ్వుతో చిన్నారులకు షేక్ హ్యాండ్ ఇస్తూ ముందుకు కదిలారు. అదే వరుసలో ఉన్న అయేషా కూడా ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వాలనుకుంది. కానీ కొద్దిలో ఆమెకు ఆ ఛాన్స్ మిస్ అయింది.దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రాజు షేక్ హ్యాండ్ మిస్సవడంతో.. ఆ బాలిక చాలా బాధపడింది. వీడియోలో ఆమె ఎక్స్‌ప్రెషన్ చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. అయితే ఇదే వీడియో రాజు మహమ్మద్ బిన్ దాకా వెళ్లడంతో.. ఆ బాలికను ఆయన ఆశ్చర్యానందంలో ముంచెత్తారు. బాలికకు సమాచారం ఇవ్వకుండా.. నేరుగా ఆమె ఇంటికే వెళ్లి ఆశ్చర్యపరిచాడు. ఆమె నుదుటిపై ముద్దు పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి సంతోషపరిచాడు. చిన్నారి పట్ల యువరాజు వ్యవహరించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.Published by: Srinivas Mittapalli
First published: December 4, 2019, 8:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading