హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

ఇరాక్‌లో ఉన్న 25వేల మంది భారతీయులు సేఫ్..

ఇరాక్‌లో ఉన్న 25వేల మంది భారతీయులు సేఫ్..

(courtesy Iran Press/Handout via Reuters

(courtesy Iran Press/Handout via Reuters

Iran Iraq USA Conflict : జీవనోపాధి కోసం ఇరాక్ వెళ్లిన భారతీయులంతా క్షేమంగానే ఉన్నట్లు సమాచారం. ఆ దేశంలో దాదాపు 25 వేల మంది భారతీయులు ఉండగా, వారందరూ ఇరాన్ దాడులకు ఎలాంటి ప్రభావితం కాలేదని తెలిసింది.

  (డీపీ సతీష్, న్యూస్‌18 సౌత్ హెడ్)

  జీవనోపాధి కోసం ఇరాక్ వెళ్లిన భారతీయులంతా క్షేమంగానే ఉన్నట్లు సమాచారం. ఆ దేశంలో దాదాపు 25 వేల మంది భారతీయులు ఉండగా, వారందరూ ఇరాన్ దాడులకు ఎలాంటి ప్రభావితం కాలేదని తెలిసింది. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం ఆవహిస్తున్న తరుణంలో ఇరాన్, ఇరాక్ దేశాల్లో ఉంటున్న భారతీయుల యోగక్షేమాలపై ఆందోళన రేకెత్తింది. అదీకాక.. మంగళవారం రాత్రి ఇరానీ సేనలు ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. అయితే.. ఆ దాడుల్లో భారతీయులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆశాజనక సమాచారం అందింది. ఇండియాకు చెందిన ఐక్యరాజ్యసమితి దౌత్యవేత్త తెలిపిన వివరాల ప్రకారం.. ఆ దేశంలో చమురు క్షేత్రాల్లో, ఇతరత్రా పనులు చేసుకుంటున్న భారతీయులు క్షేమంగా ఉన్నారు.

  ‘ఇరాక్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఎక్కడ చూసినా ఉద్రిక్త వాతావరణమే. అయితే, భారత రాయబారి, ఇరాకీ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం భారతీయులంతా క్షేమంగా ఉన్నారు. అక్కడ పరిస్థితులను ఐక్యరాజ్యసమితి దగ్గర నుంచి గమనిస్తోంది’ అని దౌత్యవేత్త తెలిపారు. కాగా, ఇరాక్ రాజధాని బాగ్దాద్, బస్ర ప్రాంతాల్లో ఇండియాకు చెందిన అసంఘటిత కార్మికులు చాలా మంది ఉన్నారు. ఎర్బిల్‌లో భారతీయులు ఎక్కువగా ఉన్నారు. అయితే.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొత్తగా ఎవ్వరినీ ఈ దేశానికి పంపవద్దని అక్కడి భారత రాయబార కార్యాలయం తెలిపినట్లు సమాచారం.

  ఇదిలా ఉండగా, ఇరాన్ ఆర్మీ చీఫ్ సులేమాన్ హత్యకు అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన ఆ దేశం అనుకున్నట్లుగానే దాడులకు దిగింది. అమెరికా చేసిన దాడికి ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసింది. అసద్, ఎర్బిల్ బేస్‌లపై దాదాపు 12 క్షిపణులతో ఇరాన్ సైన్యం దాడులు చేసింది. అమెరికా మిత్ర దేశాలపైనా దాడులు చేస్తామని ఇరాన్ ప్రకటించింది. ఇది ఆరంభమేనని, మున్ముందు దాడులు తీవ్రతరం చేస్తామని ఆ దేశం మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించింది.

  Published by:Shravan Kumar Bommakanti
  First published:

  Tags: Iran, Iraq, USA

  ఉత్తమ కథలు