ఐదేళ్లపుడు కిడ్నాప్.. 11 ఏళ్ల తర్వాత ఇంటికి.. థ్యాంక్స్ టూ గూగుల్ మ్యాప్స్..!

ఐదేళ్ల వయసులో కిడ్నాప్ అయ్యాడు. కన్నవాళ్లకు దూరమై రెండేళ్ల పాటు బిచ్చమెత్తుకున్నాడు. ఆ తర్వాత అనాథాశ్రమంలోకి వెళ్లి చదువుకున్నాడు. చివరికి 17 ఏళ్లలో తిరిగి తల్లిదండ్రులను చేరుకున్నాడు.. ఏంటీ కథ..!

news18
Updated: October 16, 2020, 1:18 PM IST
ఐదేళ్లపుడు కిడ్నాప్.. 11 ఏళ్ల తర్వాత ఇంటికి.. థ్యాంక్స్ టూ గూగుల్ మ్యాప్స్..!
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: October 16, 2020, 1:18 PM IST
  • Share this:
చిన్నతనంలో తప్పిపోయిన పిల్లలెందరో స్వచ్చంధ సంస్థలు, పోలీసుల సహాయంతో తమ తల్లిదండ్రులను చేరుకునే ఘటనలను అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. చిన్నపుడెపుడో ఇంటి నుంచి పారిపోయి.. పెద్దైన తర్వాత అనుకుని పరిస్థితుల్లో అయినవాళ్లను కలుస్తుంటారు. అయితే, అటువంటి ఘటనే జరిగింది తాజాగా, అయితే ఇక్కడ ఐదేళ్ల వయసులో తప్పిపోయిన బాలుడు పోలీసుల సహాయంతో కాకుండా గూగుల్ మ్యాప్ సహాయంతో 11 ఏళ్ల తర్వాత తన తల్లిదండ్రుల జాడను తెలుసుకున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ సంఘటన ఇండోనేషియాలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే సెంట్రల్ జావా ప్రావిన్స్ లోని స్రాగెన్కు చెందిన ఎర్వాన్ వాహు అంజస్వొరో అనే 17 ఏళ్ల టీనేజీ కుర్రాడు ఐదేళ్ల వయసులో కిడ్నాప్ కు గురయ్యాడు. తాను ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు తన ఇంటికి సమీపంలో ఉన్న వీడియో గేమ్ దుకాణానికి వెళ్లి, ఇంటికి తిరిగి వస్తుండగా తన ఇంట్లో దిగబెడతానని నమ్మించి ఒక బిక్షగాడు బాలున్ని కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత ఆ బాలున్ని తన ఆధీనంలోనే ఉంచుకొని రెండు సంవత్సరాల పాటు వీధిలో బలవంతంగా బిక్షాటన చేయించాడు. ఒక రోజు వీధిలో బాలుడితో భిక్షాటన చేయిస్తుండగా పోలీసు సైరన్ మోగడంతో కిడ్నాపర్ పారిపోయాడు. దీంతో ఎర్వాన్ తన కిడ్నాపర్ బందిఖానా నుండి విముక్తి పొందాడు.

ఆ తరువాత బాలుడు అనాథాశ్రమానికి తరలించబడ్డాడు. సుమారు తొమ్మిదేళ్లు పాటు అనాథాశ్రమంలోనే నివసించాడు. 17 ఏళ్ల వయసొచ్చాక ఎర్వాన్ తన చిన్నతనంలో తన అమ్మమ్మ తరచుగా తీసుకెళ్లే గోంగ్గాంగ్ మార్కెట్ ను గుర్తు చేసుకున్నాడు. దీంతో గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి మార్కెట్ కోసం శోధించాడు. గూగుల్ మ్యాప్ సహాయంతో, గోంగ్గాంగ్ సాంప్రదాయ మార్కెట్లో ఉన్న తన అమ్మమ్మతో కలిసి వెళ్లిన దుకాణాన్ని ట్రాక్ చేశాడు. విషయాన్ని అనాథాశ్రమ అధికారులకు వివరించాడు. వారు ఆ దుకాణ యజమానిని సంప్రదించి ఎర్వాన్ కుటుంబం గురించి ఆరా తీయగా ఆ దుకాణ యజమాని తన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోటోలను చూపించాడు. ఐదేళ్ల వయసులో అపహరణకు గురైనప్పటికీ తన కుటుంబ సభ్యుల ఫోటోలను గుర్తించగలిగాడు ఎర్వాన్.

ఇది ఎర్వాన్ కుటుంబం అని నిర్ధారించబడిన తర్వాత, ఎర్విన్ని తన తల్లిదండ్రులకు అప్పగించారు అనాథాశ్రమ అధికారులు. దీంతో తప్పిపోయాడనుకున్న తమ కొడుకు 11 సంవత్సరాల తర్వాత తిరిగి రావడంతో పట్టరాని సంతోషం వ్యక్తం చేశారు ఎర్వాన్ తల్లిదండ్రులు.

ఎర్వాన్ తండ్రి, సుపర్నో మాట్లాడుతూ ‘‘11 సంవత్సరాల నిరీక్షణ తర్వాత నా కుమారుడు తిరిగి మా దరికి చేరడం ఎంతో సంతోషంగా ఉంది. ఐదేళ్ల వయసులో తప్పిపోయిన మా కుమారున్ని వెతికి వెతికి చివరికి ఆశలను వదులుకున్నాం. తను ఇక మాకు తిరిగి దక్కుతాడని ఊహించలేదు. ఇన్నేళ్లుగా ఎర్వాన్ ను చూసుకున్న వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా”అని అన్నారు.
Published by: Srinivas Munigala
First published: October 16, 2020, 1:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading