ABANDONED SPACEX ROCKET JUNK WILL CRASH INTO MOON IN MARCH PVN
SpaceX Rocket : అప్పుడు స్పేస్ లో మిస్సింగ్..ఇప్పుడు చందమామను ఢీకొట్టేందుకు వెళ్తోంది!
చందమామ(ప్రతీకాత్మక చిత్రం)
Chunk of a SpaceX rocket : ఏడేళ్ల క్రితం స్పేస్ లో కక్ష్య తప్పి జాడలేకుండా పోయిన స్పేస్ ఎక్స్ రాకెట్...ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు చంద్రుడిని ఢీ కొట్టేందుకు దూసుకెళ్తోంది. 2009లో నాసా కావాలనే ఒక రాకెట్‌ను చంద్రుడి మీదకు క్రాష్ లాంఛ్ చేసింది.
SpaceX Rocket Junk towards the Moon : ఏడేళ్ల క్రితం స్పేస్ లో కక్ష్య తప్పి జాడలేకుండా పోయిన స్పేస్ ఎక్స్ రాకెట్...ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు చంద్రుడిని ఢీ కొట్టేందుకు దూసుకెళ్తోంది. ఈ ఏడాది మార్చి-4న స్పేస్ ఎక్స్ రాకెట్.. చంద్రుడి మీద క్రాష్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని నాసా నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా పరిశోధనల కోసం రాకెట్లను, శాటిలైట్లను అంతరిక్షంలోకి లాంఛ్ చేయడం మనకు తెలిసిందే. అయితే ఈ రాకెట్ మాత్రం చంద్రుడ్ని ఢీ కొట్టే దూసుకెళ్తుండగా..స్పేస్ ఏజెన్సీలన్నీ ఈ పరిణామాన్ని ఆసక్తిగా పరిశీలించబోతున్నాయి
ఎలాన్ మస్క్‌కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ "స్పేస్ ఎక్స్(SpaceX)" 2015 ఫిబ్రవరిలో ఫాల్కన్ 9 బూస్టర్ రాకెట్ ను అంతరిక్షంలోకి పంపించిన విషయం తెలిసిందే. డీప్ స్పేస్ క్లైమేట్ అబ్జర్వేటరీ (DSCOVR)అని పిలువబడే నాసా ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి ఈ రాకెట్ ను ఫ్లోరిడా నుంచి ప్రయోగించింది స్పేస్ ఎక్స్. మొదటి దశలో ఈ ప్రయోగం విజయవంతమైనప్పటికీ.. రెండో దశలో విఫలం అయింది. మిషన్ పూర్తి చేసిన తర్వాత భూమికి తిరిగిరావడానికి తగినంత శక్తి లేకపోవడంతో... అంతరిక్షంలోని మిగిలిపోయిన లక్షలాది వ్యర్థభాగాల్లో ఫాల్కన్ 9 బూస్టర్ కూడా చేరింది. ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ఆశ్చర్యకరరీతిలో ఈ రాకెట్ చంద్రుడి వైపు కక్క్ష్యను మార్చుకుని దూసుకెళ్తోంది. ఈ రాకెట్ జనవరి 5న భూమికి దగ్గరగా ప్రయాణించిందని, మార్చి 4న చంద్రున్ని ఢీకొట్టే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్త
బిల్ గ్రే చెప్పారు. భూమికి సమీపంలో ఉన్న అంతరిక్ష వస్తువులను ఒక సాఫ్ట్వేర్ సహాయంతో ఆయన ట్రాక్ చేస్తుంటారు.
ఫాల్కన్ 9 బూస్టర్..4000 కిలోల లోహ పరికరం. దీనికి వెనుక భాగంలో రాకెట్ ఇంజన్ ఉంటుంది. ప్రస్తుతం ఇది గంటకు 9,000 కిలోమీటర్ల వేగంతో చంద్రుడి వైపు పయనిస్తోంది. 2009లో నాసా కావాలనే ఒక రాకెట్‌ను చంద్రుడి మీదకు క్రాష్ లాంఛ్ చేసింది. ఈ ఘర్షణకు సంబంధించిన సాక్ష్యాలను సెన్సార్ల ద్వారా సేకరించారు. వీటి ఆధారంగా చంద్రునిపై ఏర్పడ్డ బిలం గురించి అధ్యయనం చేస్తున్నారు. అయితే ఇప్పుడు పాల్కన్ విషయంలో అనుకోకుండా చంద్రుడి ఉపరితలంపైకి ఢీ కొడుతుండడం విశేషం. ఇది చంద్రుడిని ఢీ కొట్టడం ద్వారా జరిగే ప్రభావం అంతగా ఉండకపోవచ్చని స్పేస్ రీసెర్చర్లు భావిస్తున్నారు. అంతరిక్ష శిధిలాల వల్ల ప్రస్తుతం ఎలాంటి ప్రభావాలు కనిపించకపోయినప్పటికీ, భవిష్యత్‌లో వీటి పర్యావసనాలు ఎదుర్కోవాల్సి ఉండొచ్చని చెబుతున్నారు.
2015 నుంచి ఫాల్కన్-9 బూస్టర్ రాకెట్‌పై భూమి, చంద్రుడు, సూర్యునిలకు చెందిన వివిధ గురుత్వాకర్షణ బలాలు పనిచేశాయి. వీటివల్లే రాకెట్ మార్గం కొంతవరకు అస్తవ్యస్తంగా మారుతోంది. ఇప్పటికే అది నాశనమైంది. కేవలం గురుత్వాకర్షణ నియమాలను పాటిస్తోంది అని అమెరికాలోని హార్వర్డ్-స్మిత్సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ కు చెందిన ప్రొఫెసర్ మెక్ డోవెల్ తెలిపారు.
చంద్రయాన్-2 ఆర్బిటర్‌కు ముప్పు పొంచి ఉందా?
ప్రస్తుతం చంద్రుని చుట్టూ పరిభ్రమిస్తున్న భారతదేశానికి చెందిన చంద్రయాన్-2 ఆర్బిటర్ మరియు నాసా యొక్క లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ కూడా ముప్పును ఎదుర్కొంటుంది. ఫాల్కన్ 9 యొక్క శిధిలాలు చంద్రయాన్ -2 ఆర్బిటర్ మరియు నాసా యొక్క లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్లను ఢీకొనే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఖగోళ శాస్త్రవేత్త జోనాథన్ మెక్‌డోవెల్ మాట్లాడుతూ..గతంలో కూడా ఇలాంటి ప్రభావాలు సంభవించే అవకాశం ఉండిందని చెప్పారు. యుఎస్ మరియు చైనీస్ అంతరిక్ష కార్యక్రమాలు కక్ష్యలో ఎక్కువ వ్యర్థాలను వదిలివేస్తున్నందున భవిష్యత్తులో చంద్రునిపై అనుకోకుండా మరిన్ని క్రాష్‌లు ఉండవచ్చని నిపుణులు అంటున్నారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.