Home /News /international /

A YOUNG BOY FLIED ALONG WITH THE KITE IN SRI LANKA KITE FESTIVAL VRY

Kite Fest : పతంగితో పాటు గాల్లోకి ఎగరగలరా...? అయితే ఇక్కడ అదే జరిగింది..!

Kite Festival

Kite Festival

Kite Fest : శ్రీలంకలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. గాలిపటంతో పాటు ఓ వ్యక్తి గాల్లో ఎగిరిపోయాడు.. సుమారు ముప్పై అడుగుల ఎత్తుకు గాలిపటంతో పాటే ఉండిపోయాడు..అదేలా సాధ్యం అనుకుంటున్నారా...?

    ఒక్కొసారి కొన్ని సంఘటనలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి... దీంతో ఆ సంఘటనలు ఊహించిని స్థాయిలో వైరల్ అవుతాయి.. ఇలా శ్రీలంకలో జరిగిన ఓ సంఘటన వైరల్‌గా మారింది. గతంలో ఎప్పుడు చూడని సంఘటన చోటు చేసుకుంది.

    అది శ్రీలంకలోని పాయింట్‌ పెడ్రో ప్రాంతల,. భారీ గాలిపటాల పోటీ జరుగుతోంది.అయితే ఈ పోటిలో ఓ యువకుల బృందం పాల్గొంది. అందరికంటే పెద్ద గాలి పటాన్ని ఎగరవేయాలని ఉత్సహంతో పోటిలో పాల్గొన్నారు..దీంతో ఆ యువకుల బృందం ఆ గాలిపటాన్ని ఎగరేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. దాన్ని ఎగరవేసేందుకు యువకులు సమాయత్తమయ్యారు. అతిపెద్ద పతంగి కావడంతో గాలి కోసం వేచి చూస్తున్న సమయంలో వింత జరిగింది. సరిగ్గా పతంగి ఎగిరే సమయానికి దాని తాడును పట్టుకున్న ఓ యువకుడు గట్టిగా పట్టుకోన్నాడు. పతంగి ఎగిరిపోతున్నా దాన్ని విడిచే సహసం చేయలేదు.. దీంతో పతంగితోపాటు గాల్లోకి ఎగిరిపోయాడు. ఇలా ఆ యువకుడు 30 అడుగులు పైకి ఎగిరిపోయాడు. ఈ సంఘటన చూస్తున్న మిగతా యువకులు తాడును వదిలేయాలని కేకలు వేశారు. అయినా భయంతో తాడును విడవని ఆ యువకుడు చివరకు పతంగి 10 అడుగుల కిందకు వచ్చాక తాడును వదిలేసి కిందకు దూకాడు.. అయితే అదృష్టవశాత్తు కింద ఉన్న ఇసుకలో పడడంతో ఎలాంటీ గాయాలు కాకుండా బయటపడ్డాడు. కాగా రెండు రోజుల కింద జరిగిన ఈ సంఘటన వైరల్‌గా మారింది.

    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Srilanka, VIRAL NEWS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు