హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

కిడ్నీలో రాళ్ల నొప్పితో ఆసుపత్రికి వెళ్లి...ముగ్గురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ...

కిడ్నీలో రాళ్ల నొప్పితో ఆసుపత్రికి వెళ్లి...ముగ్గురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ...

ఆసుపత్రిలో శిశువులు (Twitter)

ఆసుపత్రిలో శిశువులు (Twitter)

అనుమానంతో డాక్టర్లు స్కానింగ్ నిర్వహించగా, ఆమెకు వచ్చే నొప్పులు కిడ్నీలో రాళ్లవల్ల కాదని, అవి ప్రసవం నొప్పులని తేల్చారు. తాను నిండు గర్భిణి అని అన్న సంగతి తెలియగానే ఆమె షాక్ కు గురైంది.

  కిడ్నీలో రాళ్ల బాధ తట్టుకోలేక ఆసుపత్రికి వెళ్లిన ఓ మహిళ, అక్కడే ముగ్గురు పండంటి శిశువులకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే అమెరికాలోని సౌత్ డకోటాకు చెందిన డానెట్టా గ్లిట్జ్ అనే మహిళ ఈ నెల 10వ తేదీన వెన్ను భాగంలో నొప్పి విపరీతంగా ఉందని, కిడ్నీలో రాళ్ల కారణంగానే నొప్పి అయిఉంటుందని భావించి ఆసుపత్రిలో చేరింది. అయితే అనుమానంతో డాక్టర్లు స్కానింగ్ నిర్వహించగా, ఆమెకు వచ్చే నొప్పులు కిడ్నీలో రాళ్లవల్ల కాదని, అవి ప్రసవం నొప్పులని తేల్చారు. తాను నిండు గర్భిణి అని అన్న సంగతి తెలియగానే ఆమె షాక్ కు గురైంది. వెంటనే ఆమెను ఆసుపత్రిలోని సిజెరియన్ వార్డుకు తరలించి అక్కడే ఆమెకు ఆపరేషన్ చేయగా, ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు పండంటి శిశువులకు ఆ మహిళ జన్మనిచ్చింది.

  నాలుగు నిమిషాల తేడాతో ముగ్గురు శిశువులు జన్మించారు. తల్లి, పిల్లలు ఆరోగ్యంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాను గర్భిణి అన్న విషయం 9 నెలలు నిండే వరకు తనకు తెలియలేదని ఆమె చెప్పడంతో డాక్టర్లను సైతం విస్మయానికి గురయ్యారు. కాగా ఆమహిళ ఇప్పటికే ఇద్దరు పిల్లలకు తల్లి అవడం విశేషం.

  Published by:Krishna Adithya
  First published:

  Tags: VIRAL NEWS

  ఉత్తమ కథలు