90 కి.మీ వేగంతో వెళ్తున్న కారులో...గాఢనిద్రలోకి జారుకున్న డ్రైవర్...ఏం జరిగిందంటే...?

కారు అలా తనంతట తానే వెళ్లిపోవడానికి కారణం సదరు కారును ఆటోపైలట్ మోడ్ లో ఉండటమే కారణంగా తెలుస్తోంది. టెస్లాకంపెనీకి చెందిన ఈ కారులో ఆటో పైలట్ మోడ్ ద్వారా టార్గెట్ లొకేషన్ సెట్ చేసుకుంటే చాలు. వేగంగా మీరు చేరుకునే లొకేషన్‌కు వెళ్లి పోతుంది.

news18-telugu
Updated: September 11, 2019, 6:41 PM IST
90 కి.మీ వేగంతో వెళ్తున్న కారులో...గాఢనిద్రలోకి జారుకున్న డ్రైవర్...ఏం జరిగిందంటే...?
కారులో నిద్రిస్తున్న డ్రైవర్ (Image: Youtube)
  • Share this:
డ్రైవర్ గాఢనిద్రలో జారుకున్నా కారు మాత్రం 90 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తోంది. ఈ విడ్డూరాన్ని ఎవరైనా కళ్లతో చూస్తే గుండె ఆగిపోవడం ఖాయం. కానీ తాజాగా అమెరికాలోని మాసాచుసేట్స్ కు చెందిన ఓ కారులో డ్రైవర్ ఎంచక్కా స్టీరింగ్ పై తలవాల్చి గాఢనిద్రలో జోగుతుంటే, పక్కనే ఉన్న పాసింజర్ సైతం గురకపెడుతూ నిద్రపోతున్నాడు. అంతేనా కారు మాత్రం జోరుగా 90 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. మరోవైపు ఈ తంతంగం అంతా డకోటా ర్యాండెల్ అనే వ్యక్తి కారును వెండిస్తూ రికార్డు చేశాడు. అంతే కాదు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.

అయితే కారు అలా తనంతట తానే వెళ్లిపోవడానికి కారణం సదరు కారును ఆటోపైలట్ మోడ్ లో ఉండటమే కారణంగా తెలుస్తోంది. టెస్లాకంపెనీకి చెందిన ఈ కారులో ఆటో పైలట్ మోడ్ ద్వారా టార్గెట్ లొకేషన్ సెట్ చేసుకుంటే చాలు. వేగంగా మీరు చేరుకునే లొకేషన్‌కు వెళ్లి పోతుంది. సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ ద్వారా అభివృద్ధి చేసిన ఈ కార్లు ఇంకా మార్కెట్లోకి విడుదల కాలేదు. అయితే కంపెనీ ప్రయోగాత్మకంగా కొన్నికార్లను రోడ్డుపై ప్రోటోటైప్ లుగా నడుపుతోంది.

First published: September 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading