Video : సెల్ఫీ ఫొటోషూట్ కోసం.. రైల్లో అందాల ఆరబోత...

జనరల్‌గా మనం ఇతరులు ఉన్నప్పుడు సెల్ఫీ తీసుకోవాలంటే ఒకింత ఇబ్బందిగా ఫీలవుతాం. అలాంటిది ఆమె మాత్రం కదిలే రైల్లో... అంత మంది ప్రయాణికులు ఉండగా... ఏకంగా సెల్ఫీ ఫొటోషూటే తీసుకుంది... అది కూడా అందాలూ ఆరబోస్తూ...

Krishna Kumar N | news18-telugu
Updated: August 21, 2019, 8:15 AM IST
Video : సెల్ఫీ ఫొటోషూట్ కోసం.. రైల్లో అందాల ఆరబోత...
రైల్లో సెల్ఫీ ఫొటోషూట్ (Image : Twitter - Ben Yahr)
Krishna Kumar N | news18-telugu
Updated: August 21, 2019, 8:15 AM IST
ట్విట్టర్ యూజర్ బెన్ యాహర్... ఓ మహిళకు సంబంధించిన వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆమె... కదిలే రైల్లో సెల్ఫీ ఫొటోషూట్ తీసుకుంటోంది. తన బ్యాగ్‌పై మొబైల్‌ సెట్ చేసి... కెమెరా ఆన్ చేసి... వేర్వేరు యాంగిల్స్‌లో సెల్ఫీలు తీసుకుంది. చుట్టూ అంత మంది ప్రయాణికులు ఉన్నా... ఆమె ఏమాత్రం మొహమాటం లేకుండా... సెల్ఫీలు తీసుకోవడం... బెన్ యాహర్‌కి ఆశ్చర్యం కలిగించింది. ఈ వీడియో వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటికే దీన్ని 87 లక్షల మంది చూశారు. 2లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. 36వేల మంది రీట్వీట్ చేశారు. చాలా మంది నెటిజన్లు ఆమె ధైర్యానికి మెచ్చుకుంటున్నారు. ఆమెలో చాలా కాన్ఫిడెన్స్ ఉందని అంటున్నారు.


ఇతరులు ఉండగా ఇలా చెయ్యాలంటే... చాలా కాన్ఫిడెన్స్ కావాలనీ, తానైతే అలా చెయ్యలేనని ఓ యూజర్ తెలిపారు.




ఆమెకు సోషల్ యాంగ్జైటీ లేదనీ, ఇతరుల పట్ల భయం లేదనీ మరో యూజర్ అభిప్రాయపడ్డారు.


మరో యూజర్ మాత్రం ఇదేం కాన్ఫిడెన్స్ కాదనీ, ఇలా అందరూ చేస్తారని అభిప్రాయపడ్డారు.


ఇంతకీ ఆమె ఎవరన్నదేగా మీ డౌట్. ఆమె పేరు జెస్సికా గార్జ్. ఆమె తీసిన సెల్ఫీలు మీరే చూడండి.


తన పట్ల నెటిజన్లు పాజిటివ్‌గా స్పందిస్తుండటంపై గార్జ్ ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. అందరికీ థాంక్స్ చెప్పింది. అందరూ పాజిటివ్‌గా ఉండాలని కోరింది.
First published: August 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...