కుక్కకు ఘన సన్మానం... ఏం చేసిందో తెలిస్తే మీరూ మెచ్చుకుంటారు

కుక్కకు ఘన సన్మానం... ఏం చేసిందో తెలిస్తే మీరూ మెచ్చుకుంటారు

హరికేన్ (Image : Twitter - U.S. Secret Service)

US Secret Service dog : అది సాదా సీదా కుక్క కాదు. ఏకంగా అమెరికా అధ్యక్షుణ్ని కాపాడేందుకు ప్రాణాలు పణంగా పెట్టింది. అందుకే దానికి "ఆర్డర్ ఆఫ్ మెరిట్" అవార్డుతో సన్మానం చేయబోతున్నారు.

  • Share this:
హరికేన్... పేరుకు తగ్గట్టే... ఆ కుక్క... హరికేన్‌లా దూసుకెళ్లింది. 2014లో ఓ దుండగుడు... వైట్‌హౌస్‌ ఫెన్స్ దూకి లోపలికి ప్రవేశించాడు. అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామాను చంపాలన్నది అతని టార్గెట్. అతని రాకను వెంటనే పసిగట్టిన హరికేన్... అతనిపై ఒక్కసారిగా ఉరికింది. పులిలా మీదపడి... చెలరేగిపోయింది. ఆ కుక్కతో పోరాడటం అతని వల్ల కాలేదు. నేలపై పడ్డాడు. వెంటనే అతన్ని పట్టుకొని బరబరా ఈడ్చుకుపోయింది. అప్పటికే అలర్టైన వైట్ హౌస్ సెక్యూరిటీ అధికారులు... ఆ దుండగుణ్ని అరెస్టు చేశారు. అప్పటివరకూ అతనితో కుక్క పోరాడిన విధానాన్ని సీసీటీవీ ఫుటేజ్‌లో చూసి... దాని ధైర్యసాహసాల్ని మెచ్చుకున్నారు. దుండగుడు వచ్చిన సమయంలో... బరాక్ ఒబామా వైట్ హౌస్‌లోనే ఉన్నారు. ఆయనకు ఎలాంటి హానీ జరగలేదు.


బెల్జియం మాలినోయిస్ జాతికి చెందినది ఈ హరికేన్ కుక్క. దుండగుడు చేసిన దాడిలో... గాయాలపాలైన హరికేన్... రెండేళ్ల తర్వాత... 2016లో అమెరికా సీక్రెట్ సర్వీస్ నుంచీ రిటైరైంది. ఈ జాగిలానికి ఇప్పుడు బ్రిటన్‌లోని వెటెరినరీ చారిటీ సంస్థ PSDA... ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డును ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో... లండన్‌లో ప్రత్యేక సెరెమనీ నిర్వహించి... కుక్కకు సన్మానం చేయబోతున్నారు. ఈ అవార్డు "ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్‌" అవార్డుకి సమానమైనది.
Published by:Krishna Kumar N
First published: