అతను ‘అమ్మ’ అయ్యాడు... బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్‌జెండర్... పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పినా...

ఇద్దరు మగాళ్లకు పుట్టిన బిడ్డ... లింగమార్పిడి చేసుకున్న పిల్లలు పుట్టడం అసాధ్యమని తేల్చేసిన డాక్టర్లు... అయినా గర్భం దాల్చి, బిడ్డకు జన్మనిచ్చిన అతను... ఆ బిడ్డకు ఆరు నెలలు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 8, 2019, 4:21 PM IST
అతను ‘అమ్మ’ అయ్యాడు... బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్‌జెండర్... పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పినా...
బిడ్డతో విల్లే, స్టీఫెన్
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 8, 2019, 4:21 PM IST
అతను గర్భం దాల్చాడు. ఓ బిడ్డకు జన్మనిచ్చాడు. అవును నిజమే ఇది అమ్మగా మారిన అతని కథ. చిత్రంగా ఉన్నా ఈ విచిత్రమైన స్టోరీ అమెరికాలోని టెక్సాస్ నగరలో జరిగింది. విల్లే సిమ్సన్ అనే 28 ఏళ్ల యువకుడు... ఏడేళ్ల క్రితం లింగమార్పిడి చేసుకుని మహిళగా మారాడు. తన ప్రియుడు స్టీఫెన్ గేత్‌తో కలసి టెక్సాస్‌లో నివసిస్తున్నారు. ఇద్దరూ ఎన్నో ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. తన పండంటి సంసారానికి ప్రతీకగా ఓ బిడ్డకు జన్మనివ్వాలని భావించాడు విల్లే. అయితే లింగ మార్పిడి అయితే జరిగింది గానీ మహిళల్లో మాదిరి గర్భసంచి పురుషుల్లో ఉండదని, గర్భం దాల్చడం దాదాపు అసాధ్యమని తేల్చి చెప్పేశారు డాక్టర్లు. అయితే ఫిబ్రవరి 2018లో అతనికి నెలసరి రావడం ఆగిపోయింది. అనుమానం వచ్చి పరీక్షలు జరపగా... అతను గర్భం దాల్చినట్టు నిర్ధారణ అయ్యింది. టెస్టోస్టెరిన్ థెరపీ తీసుకోవడానికి ఇష్టపడని అతను... సహజంగా గర్భం దాల్చడంతో ఆనందంతో ఎగిరి గెంతేశారు.
Shocking: Transgender man gives birth to a Baby boy, after doctors said that impossible to get pregnancy అతను అమ్మయ్యాడు... బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్‌జెండర్... అతనికి పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పినా... ఇద్దరు మగాళ్లకు పుట్టిన బిడ్డ... లింగమార్పిడి చేసుకున్న పిల్లలు పుట్టడం అసాధ్యమని తేల్చేసిన డాక్టర్లు... అయినా గర్భం దాల్చి, బిడ్డకు జన్మనిచ్చిన అతను... ఆ బిడ్డకు ఆరు నెలలు...
కుమారుడితో తల్లి విల్లే...

తర్వాత కొద్ది రోజులకు శస్త్రచికిత్స ద్వారా అతని బ్రెస్ట్స్ తొలగించారు. సెప్టెంబర్ 2018లో ఎమర్జెన్సీ సెక్షన్స్ విస్లేకి ప్రసవం జరిగింది. కొంచెం కష్టమే అయినా చివరికి అతనికి పండంగి మగబిడ్డ పుట్టాడు. ఆ ఇద్దరు మగాళ్లకు పుట్టిన బిడ్డకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ వస్తోంది. విల్లే, స్టీఫెన్ జంట కూడా తమ బిడ్డను ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు. ‘‘గర్భంతో ఉన్నప్పుడు రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తుంటే... చాలామంది ఆశ్చర్యంగా చూసేవాళ్లు. నవ్వుకునేవాళ్లు. అయితే వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే నేను ఇక ఎప్పటికీ మగాడిని కాదు. మగాడిలా ఉండడం ఇష్టం లేకనే లింగమార్పిడి చేసుకున్నాను. మగాళ్లు పిల్లలను కడుపులో మోయలేదు. అందరూ నన్ను ‘అది’ అని పిలిచేవాళ్లు...’’ అని చెప్పుకొచ్చాడు విస్లే. విస్లే, స్టీఫెన్ జంటకు పుట్టిన అబ్బాయికి రోవన్ అని పేరు పెట్టారు. రోజూ రోవన్‌తో కలిసి ఫోటోలు దిగుతూ, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు ఈ జోడి. ఇద్దరు మగాళ్లకు పుట్టిన ఈ అబ్బాయికి భవిష్యత్తులో ఎలాంటి గుర్తింపు దక్కుతుందో అనే భయం లేకుండా ప్రశాంతంగా బిడ్డతో ఆడుకుంటున్నారీ తల్లీతండ్రీ.First published: March 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...