హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Shocking: ఇలాంటి సీన్ ‘నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్’.. ఆమె ఎందుకంత షాకైందో ఈ వీడియోలో చూడండి..

Shocking: ఇలాంటి సీన్ ‘నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్’.. ఆమె ఎందుకంత షాకైందో ఈ వీడియోలో చూడండి..

వీడియోలోని దృశ్యం

వీడియోలోని దృశ్యం

ఎలుక ఏకంగా పార్లమెంట్‌లో దూరి పొలిటీషియన్లను పరుగులు పెట్టిస్తే ఎలా ఉంటుంది. వినడానికే వింతగా ఉంది కదూ. స్పెయిన్‌లో అదే జరిగింది. ఒక్క ఎలుక పార్లమెంట్‌లో నాయకులను కంగారుతో పరుగులు పెట్టించింది.

స్పెయిన్: ఎలుకలు ఉన్నచోట ఉండవు. ఎవరికీ దొరకవు. పట్టుకునే లోపు తుర్రుమని ఏ కన్నంలోకి దూరిపోతాయి. ఒక్క ఎలుక చాలు మనిషిని కంగారు పెట్టి పరిగెత్తించడానికి. కాళ్ల కింద నుంచి ఎక్కడ దూరి ఎటుపోతుందోనని ఎలుకల బెడద వల్ల ఇబ్బందిపడేవారు భయపడుతుంటారు. అలాంటి ఎలుక ఏకంగా పార్లమెంట్‌లో దూరి పొలిటీషియన్లను పరుగులు పెట్టిస్తే ఎలా ఉంటుంది. వినడానికే వింతగా ఉంది కదూ. స్పెయిన్‌లో అదే జరిగింది. ఒక్క ఎలుక పార్లమెంట్‌లో నాయకులను కంగారుతో పరుగులు పెట్టించింది. అది పార్లమెంట్‌ లోపలికి ఎలా వెళ్లిందో.. ఏంటో గానీ ఆ దృశ్యాలు మాత్రం ఇంటర్నెట్‌లో ఇప్పుడు వైరల్‌గా మారాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే.. స్పెయిన్‌లోని అండలూసియా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. నాయకులంతా సీరియస్‌గా సమస్యలపై చర్చిస్తున్నారు. ఓటింగ్ ప్రక్రియలో భాగంగా.. రీజనల్ స్పీకర్ మర్తా బస్కెట్ మాట్లాడుతుండగా.. పార్లమెంట్‌లోకి ఒక ఎలుక దూరడాన్ని ఆమె గమనించింది. ఒక్కసారిగా ఆమె మాట్లాడటం ఆపి షాక్‌కు గురై నోటి మీద చేతులేసుకుంది. ఆమె రియాక్షన్‌తో ఏమైందా అని కిందకు చూసిన పార్లమెంట్ సభ్యులకు ఆ ఎలుక లోపలికి పరిగెత్తుతూ కనిపించింది.


ఇంకేముంది.. పార్లమెంట్ సమావేశాలు మూషికం దెబ్బకు ఫన్నీగా మారాయి. ఆ ఎలుకను చూసిన నేతలు ఆ మూషికం తమ సీటు కిందకు ఎక్కడ దూరుతుందోనని పరుగులు పెట్టారు. కొందరు ఏ సీటు కింద ఆ ఎలుక నక్కి ఉందో చూస్తూ నానా హడావుడి చేశారు. హాట్‌హాట్‌గా సాగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. ఆ ఎలుకను ఎట్టకేలకు పట్టుకున్నారు. అండలూసియా పార్లమెంట్ స్పెయిన్‌లోని ప్రధాన నగరమైన సెవిల్లెలో ఉంది. ఈ పార్లమెంట్‌కు 1982లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. ఈ పార్లమెంట్‌లో మొత్తం 109 మంది సభ్యులున్నారు.

First published:

Tags: International news, Rats, Spain, VIRAL NEWS, Viral Video

ఉత్తమ కథలు