హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Sri Lanka: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో కొత్త ట్విస్ట్.. సైన్యమే దేశాన్ని చేతుల్లోకి తీసుకోనుందా.. విస్తుపోయే నిజాలు ఇవే !

Sri Lanka: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో కొత్త ట్విస్ట్.. సైన్యమే దేశాన్ని చేతుల్లోకి తీసుకోనుందా.. విస్తుపోయే నిజాలు ఇవే !

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో కొత్త ట్విస్ట్..  సైన్యమే దేశాన్ని చేతుల్లోకి తీసుకోనుందా.. చదివితే విస్తుపోయే నిజాలు ఇవే !-

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో కొత్త ట్విస్ట్.. సైన్యమే దేశాన్ని చేతుల్లోకి తీసుకోనుందా.. చదివితే విస్తుపోయే నిజాలు ఇవే !-

శ్రీలంక(Sri Lanka) పార్లమెంట్ స్పీకర్ మహింద యాపా అబేయవర్ధనే అధ్యక్ష ఎన్నిక (Presidential election)ను జులై 20న నిర్వహించాలని నిర్ణయించారు. సభలోని మొత్తం 225 మంది సభ్యులు ఓటు వేయడానికి, పోటీ చేయడానికి అర్హులు. రాష్ట్రపతి పదవికి కనీసం అరడజను మంది పోటీలో ఉన్నారు.

ఇంకా చదవండి ...

(DP SATISH, News 18)

అందమైన టీ తోటలు, దట్టమైన అడవులు, కొబ్బరి తోటలు.. నిత్యం ఎప్పుడు విదేశీ పర్యాటకులతో కళకలాడుతూ ఉండే దేశం శ్రీలంక(Sri Lanka). అలాంటి దేశం నేడు ఆర్థిక పరిస్థితి దిగజారి అల్లకల్లోలంగా తయారైంది. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలై ధరలు పెరగడంతో ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారు. దీనికి తోడు రాజపక్స కుటుంబ రాజకీయ నిర్ణయాల వల్ల దేశం దివాలాతీసింది. అంతే  ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు పెల్లుబికాయి. ప్రధాని మహిందా రాజపక్స, దేశాధ్యక్షుడు గోటబయ రాజపక్స  రాజీనామాలు చేసే వరకు ప్రజలు వదిలిపెట్ట లేదు. రాస్తారోకోలు, నిరసనలతో దేశం అట్టుడికిపోయింది. దెబ్బకు మంత్రులు రాజీనామా చేశారు. ప్రజలు ఏకంగా దేశా ద్యక్షుడు నివాసంలోకి నిరసనకారులు చొచ్చుకుని వెళ్ళి తరిమికొట్టారు. దీంతో ఆయన మాల్దీవులకు పారిపోయాడు. అంతేకాకుండా గోటబయా రాజీనామా చేసేవరకు అధ్యక్ష భవనాన్ని వీడలేదు. ఇంద్ర భవనంలాంటి బంగ్లాలో నిరసనకారులు సంతోషంగా స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ సేద తీరారు.

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్ర పరిణామాలకు దారి తీసింది. రాజకీయ సమీకరణాలను సమూలంగా మార్చేసింది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు రేగడంతో ప్రధాని(Prime Minister), రాష్ట్రపతి తమ పదవులకు రాజీనామాలు చేయక తప్పలేదు. అక్కడి ప్రజలు అసహ్యించుకునే వ్యక్తి అధ్యక్షుడు గొటబయ రాజపక్స(Gotabaya Rajapaksa) బుధవారం ఉదయం దేశం వదిలి పారిపోయారు. నిరసనకారులు అసాధ్యమైన దానిని సాధించారు. కానీ వారి పోరాటం ఇంకా పూర్తి కాలేదు. తదుపరి రాష్ట్రపతి నిజాయితీపరుడైన వ్యక్తి కావాలని వారు కోరుకుంటున్నారు. తాత్కాలిక అధ్యక్షుడు, ప్రస్తుత ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే అధ్యక్ష పదవికి పోటీ చేయకూడదని చెబుతున్నారు.

జులై 20న రాష్ట్రపతి ఎన్నికలు!

శ్రీలంక పార్లమెంట్ స్పీకర్ మహింద యాపా అబేయవర్ధనే అధ్యక్ష ఎన్నిక(Presidential election)ను జులై 20న నిర్వహించాలని నిర్ణయించారు. సభలోని మొత్తం 225 మంది సభ్యులు ఓటు వేయడానికి, పోటీ చేయడానికి అర్హులు. రాష్ట్రపతి పదవికి కనీసం అరడజను మంది పోటీలో ఉన్నారు. రాజపక్స కుటుంబానికి చెందిన మెజారిటీ పార్టీ SLPP మద్దతుతో రణిల్ విక్రమసింఘే రేసులో ముందంజలో ఉన్నారు. అతని ప్రధాన పోటీదారు ప్రతిపక్ష నాయకుడు, SJBకి చెందిన ఒన్‌ టైమ్‌ డిప్యూటీ సాజిత్ ప్రేమదాస. లెక్కలు పరంగా చూస్తే రణిల్ గెలుపు సులువుగా కనిపిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. పార్లమెంటులో SLPPకి 145 మంది సభ్యులు ఉన్నారు. రాష్ట్రపతిగా విజయం సాధించాలంటే కనీసం 113 ఓట్లు పొందాలి. గెలుపొందిన అధ్యక్షుడు గొటబయ మిగిలిన పదవీకాలం (సుమారు 28 నెలలు) పదవిలో ఉంటారు. 2024 నవంబర్ వరకు గొటబయకు పదవీకాలం ఉంది. అయితే, 40 మందికి పైగా ఎస్‌ఎల్‌పీపీ ఎంపీలు తాము ఇకపై అధికార పార్టీలో భాగం కాదని, దానితో సంబంధం లేకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తామని ప్రకటించారు. అత్యున్నత పదవికి విక్రమసింఘే నామినేషన్ వేయడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఓటింగ్ రోజున చాలా మంది ఎంపీలు వెనక్కి తగ్గే అవకాశం లేకపోలేదు. నిరసనకారుల ఫాసిస్టుల గురించి వివరిస్తూ, ఎన్నికలను అడ్డుకోవద్దని విక్రమసింఘే హెచ్చరించారు. ఇది వారికి మరింత కోపం తెప్పించింది.

సాజిత్ ప్రేమదాసకు 55 మంది సపోర్ట్‌

మరోవైపు సాజిత్ ప్రేమదాసకు సొంత పార్టీకి చెందిన 55 మంది ఎంపీలు సపోర్ట్‌ చేస్తున్నారు. మైనారిటీ తమిళ, ముస్లిం ఎంపీల సహకారంతో ఆయనకు దాదాపు 80 ఓట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఎన్నికల్లో గెలవడానికి అతనికి ఇంకా 33 ఓట్లు అవసరం. SLPP నుంచి విడిపోయిన వర్గం అతనికి సపోర్ట్‌ చేయవచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఎన్నికల్లో ఎవరు గెలుపొందినా, వచ్చే ఎన్నికల వరకు రాష్ట్రపతి పదవిలో ఉండి పెద్దగా చేసేది ఏదీ ఉండదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఐదుసార్లు ప్రధానమంత్రి అయిన 73 ఏళ్ల విక్రమసింఘే దీన్ని పట్టించుకోకపోవచ్చు. కానీ ఇప్పటికీ 50 ఏళ్ల మధ్యలో ఉన్న ప్రేమదాసకు తన రాజకీయ జీవితం ఇలా ముగియడం ఇష్టం లేదు.

విక్రమసింఘే, ప్రేమదాసు కలయికలో అధికారాన్ని పంచుకోవడం ప్రస్తుతానికి అసాధ్యమనిపిస్తోంది. కాబట్టి, రాష్ట్రపతి పదవికి డార్క్ హార్స్ డల్లాస్ అల్లపెరుమ పేరు వినిపిస్తోంది.

వారితో రణిల్‌కు ఇబ్బందే..

ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెన్సీని రద్దు చేసేందుకు అల్లాపెరుమ అంగీకరిస్తే, 1978కి ముందు ఉన్న వెస్ట్‌మిన్‌స్టర్ వ్యవస్థలో PM రాష్ట్ర కార్యనిర్వాహక అధిపతిగా, రాష్ట్రపతి నామమాత్రపు అధిపతిగా ఉండే విధానాన్ని పునరుద్ధరిస్తే, ప్రేమదాస ప్రధానమంత్రిగా ఉండటానికి అంగీకరించవచ్చని వారు భావిస్తున్నారు.

1994లో తన మొదటి పార్లమెంటరీ ఎన్నికల్లో గెలుపొందడానికి ముందు అల్లాపెరుమ జర్నలిస్టు, అందరూ ఇష్టపడే వ్యక్తి. అతను మునుపటి రాజపక్సే సోదరుల ప్రభుత్వంలో విద్యుత్తు, క్రీడల కేబినెట్ మంత్రిగా పని చేశారు. అయినా వారి నుంచి ఆరోగ్యకరమైన దూరాన్ని పాటించారు. ఆ విధానం ఇప్పుడు ఆయనకు అనుకూలమైన పరిస్థితులను కల్పిస్తోంది. ప్రేమదాస, అల్లాపెరుమ కలయికకు మార్గం సుగమం అయితే.. విక్రమసింఘేకు కఠిన పరిస్థితులు తప్పవు. విక్రమసింఘేను అధికారానికి దూరంగా ఉంచడానికి అరగలయ కూడా అంగీకరించవచ్చు. ప్రేమదాసు తన 80 ఓట్లను, అల్లాపెరుమ మరో వైపు నుంచి కనీసం 33 ఓట్లను పోగు చేయాల్సి ఉంటుంది. వారు వారు రణిల్‌ను రాజపక్స అని ఎగతాళిగా సంబోదిస్తుండటం గమనార్హం.

ఇదీ చదవండి: Sexual Health: శృంగారం కోసం ఈ మందులు వాడుతున్నారా ? అంతే సంగతులు .. ఎలాంటి నష్టాలు ఉంటాయంటే..?


ప్రేమదాసతో విక్రమసింఘే మంతనాలు

కొంతమంది అంతర్గత సమాచారం ప్రకారం.. విక్రమసింఘే ఎగ్జిక్యూటివ్ పీఎం పదవికి హామీ ఇస్తూ ప్రేమదాసతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ విక్రమసింఘేను చట్టవిరుద్ధమైన ప్రధాని అంటూ ఆయనపై భారీ దాడికి దిగిన ప్రేమదాస అందుకు అంగీకరించే అవకాశం లేదు. హత్యకు గురైన ప్రెసిడెంట్ రణసింగ్ ప్రేమదాస ఏకైక కుమారుడు విక్రమసింఘేతో ఆయన పాత వివాదాలు లేకపోలేదు. అతను గతంలో పెద్ద పదవులను పదే పదే తిరస్కరించారు. 2019లో గోటబయకు వ్యతిరేకంగా సాజిత్ అధ్యక్ష పదవికి పోటీ చేసి విఫలమయ్యారు.

2023 ప్రారంభంలో రాష్ట్రపతి పదవికి, పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలు జరపాలని అరగలయ్య డిమాండ్ చేస్తున్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికల(Elections)కు వెళ్లడం తమకు ఆత్మహత్యా సదృశ్యమని చాలా మంది ఎంపీలకు తెలుసు. రాబోయే రెండేళ్లలో ప్రజల ఆగ్రహం తగ్గుతుందని భావిస్తున్నారు.

మాజీ ఆర్మీ కమాండర్‌ ఫీల్డ్‌ మార్షల్‌ పోటీ

మాజీ ఆర్మీ కమాండర్ ఫీల్డ్ మార్షల్ శరత్ ఫోన్సెకా కూడా SLPP, SJB ఎంపీలు తనకు సపోర్ట్‌ ఇస్తారనే ఆశతో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. కానీ, 2009లో ముగిసిన ఈలం యుద్ధం చివరి దశల్లో రాజపక్స వంశంతో పాటు మారణహోమానికి ఆయనను బాధ్యులుగా భావిస్తుండటంతో, అతను ఏ మైనారిటీ ఎంపీల మద్దతును పొందే అవకాశం లేదు. పార్లమెంటులో రణిల్, సజిత్ రెండు శక్తివంతమైన వర్గాలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది. విక్రమసింఘే మేనమామ జూనియస్ రిచర్డ్ జయవర్ధనే ఆధ్వర్యంలో 1978లో ఫ్రెంచ్ గాలిస్ట్ ప్రెసిడెంట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్రీలంక రెండోసారి మధ్యంతర అధ్యక్ష ఎన్నికలను నిర్వహిస్తోంది.

1993లో, మే డే రోజున అనుమానిత LTTE ఆత్మాహుతి దాడిలో సాజిత్ తండ్రి రణసింఘే ప్రేమదాస మరణించారు. అప్పటి ప్రధాని డీబీ విజేతుంగేను రాష్ట్రపతి పదవికి ఎన్నుకున్నారు. తక్కువ ప్రొఫైల్ ఉన్న విజేతుంగే ననామమాత్ర ప్రెసిడెంట్‌ కాగా, రణిల్ విక్రమసింఘే మొదటిసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. కలిసొచ్చిన సమీకరణాలతో రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత విజేతుంగే.. షేక్స్పియర్ ట్వెల్త్‌ నైట్‌ నవల లోని అంశాలను గుర్తు చేస్తూ మాట్లాడారు. కొందరు గొప్పగా పుడతారు, కొందరు గొప్పతనాన్ని సాధిస్తారు, మరికొందరిపై గొప్పతనాన్ని మోపుతారు అని ఆయన చెప్పారు. ఆయన తనకు అర్హతకు మించిన పదవి దక్కిందని అంగీకరించారు. కానీ రణిల్ లేదా సజిత్ అంగీకరించలేదు. ఎందుకంటే తాము గొప్పవాళ్లమని నమ్ముతారు.

First published:

Tags: Gotabaya Rajapaksa, Inflation, Petrol prices, Srilanka

ఉత్తమ కథలు