ఒకటి ఆర్డరిస్తే మరొకటి వచ్చింది... అంతే... రచ్చరచ్చ...

Viral Video : షాపుల్లో, హోటళ్లలో పనిచేసే ఉద్యోగులు సహనంతో ఉండాలి. లేదంటే మొత్తానికీ ప్రమాదం. మెక్‌డొనాల్డ్స్‌లో అదే జరిగింది.

news18-telugu
Updated: October 26, 2019, 11:31 AM IST
ఒకటి ఆర్డరిస్తే మరొకటి వచ్చింది... అంతే... రచ్చరచ్చ...
ఒకటి ఆర్డరిస్తే మరొకటి వచ్చింది... అంతే... రచ్చరచ్చ... (credit - twitter - WLWT)
  • Share this:
Viral Video : ఇచ్చిన ఆర్డర్ విషయంలో తేడా రావడంతో... మహిళా కస్టమర్ వాదన పెట్టుకుంది. అక్కడ రెండువైపులా తేడా వచ్చింది. సహనం కోల్పోయిన మెక్ డొనాల్డ్స్ ఉద్యోగి... ఆ మహిళ ముఖంపై బ్లెండర్ విసిరేయడంతో... అల్లకల్లోలం అయిపోయింది. ఇది జరిగింది సెప్టెంబర్‌లో. అమెరికా... ఒహియో టౌన్‌లో... బాధితురాలు బ్రిటానీ ప్రైస్... మెక్‌డొనాల్డ్స్ సిగ్నేచర్ చీజ్ బర్గర్స్, హ్యాపీ మీల్స్ కోసం ఆర్డరిచ్చింది. కాసేపటికి ఆమెకు ఐటెం వచ్చింది. దాన్ని ఇంటికి తీసుకెళ్లింది. ఓపెన్ చేస్తే... అది ఆమె ఆర్డర్ ఇచ్చింది కాదని అర్థమైంది. దీనిపై ఆమె మరోసారి ఔట్‌లెట్‌కి వచ్చి... విషయం చెప్పింది. ఉద్యోగులు ఆమెను వెయిట్ చెయ్యమన్నారు. ఆమె 20 నిమిషాలు ఎదురుచూసింది. అప్పటికీ ఆమెను పట్టించుకోకపోవడంతో... తిరిగి తన కారు దగ్గరకు వెళ్లి... తనకు మొదట ఇచ్చిన ఫుడ్‌ను తీసుకొచ్చింది. దాన్ని ఉద్యోగులపై విసిరికొట్టింది.


దాంతో చిర్రెత్తుకొచ్చిన ఓ ఉద్యోగి... పిజ్జాలు తయారుచేసే బ్లెండర్‌ను కౌంటర్ నుంచీ ఆమెపై విసిరాడు. అది ఆమె ముఖంపై తగలడంతో... ఆమె ఒక్కసారిగా వెనక్కు పడిపోయింది. ఆమె వెంటనే లేవలేకపోయింది. ఆమెకు గాయాలయ్యాయనీ, ఆమె ముక్కు, బుగ్గల్లో ఎముకలు దెబ్బతిన్నాయని తెలిసింది.సంస్థ యాజమాన్యం ఆ ఉద్యోగిని తొలగించింది. అతనిపై బాధితురాలు... సివిల్ లా సూట్ ఫైల్ చేసింది.

 

Pics : క్యూట్ స్మైల్‌తో కట్టిపడేస్తున్న సుష్మరాజ్
ఇవి కూడా చదవండి :

మాన్‌హట్టన్‌పై బర్డ్ ఐ వ్యూ... అదిరిపోయిందిగా...

వామ్మో... బొద్దింకల్ని చంపడానికి బాంబు పేల్చాడు... ఆ తర్వాత

Diwali 2019 : దీపావళికి దీపాలు ఎందుకు వెలిగిస్తారు... ఇదీ పండుగ ప్రాసస్థ్యం

Diwali 2019 : దీపావళి రోజున నువ్వుల నూనెని ఇలా వాడితే మేలు...

Health Tips : డయాబెటిస్‌కి ఆవకాడోతో చెక్... ఇలా చెయ్యండి

Health Tips : జలుబు జ్వరానికి గ్రీన్ టీతో చెక్... ఇలా చెయ్యండి.
First published: October 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading