హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Restaurant Tip: ఆ వ్యక్తి బిల్లు కంటే టిప్పును అధికంగా ఇచ్చాడు.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..

Restaurant Tip: ఆ వ్యక్తి బిల్లు కంటే టిప్పును అధికంగా ఇచ్చాడు.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Restaurant Tip: అమెరికాలోని ఓ వ్యక్తి హోటల్ కి వెల్లి తనకు వచ్చిన బిల్లు కంటే టిప్పు 400 రెట్లు అధికంగా ఇచ్చి ఆశ్చ్యర్య పరిచాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మనం హోటల్ కి కానీ.. రెస్టారెంట్ కి కానీ వెళ్లినప్పడు అక్కడ సర్వర్ కి టిప్పు అనేది ఇస్తూ ఉంటాం. మనకు ఎంత బిల్లు అయిందో చూసి తర్వాత మన దగ్గర ఎమైనా డబ్బులు మిగిలితే ఎంతో కొంత అతడికి ఇస్తాం. మరికొందరు అసలేం ఇవ్వకుండా బయటకు వస్తుంటారు. ఇలా కొంతమంది ఎక్కవగాను.. మరికొంత మంది తక్కువగా సర్వర్ కు టిప్పు ఇస్తుంటారు. అయితే అమెరికాలో ఓ సంఘటన ఆశ్చర్యానికి గురిచేసింది. అతడు హోటల్ కు వచ్చి చేసిన బిల్లు కంటే 400 రెట్లు సర్వర్ కి ఇచ్చి అక్కడ ఉన్న ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. దీంతో ఆ హోటల్ యజమాని ఆ అమౌంట్ ను అందరికీ పంచాడు. అతడు ఇచ్చిన టిప్పుకు సంబంధించిన విషయాన్ని ఒకతను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ పోస్ట్ ను చదివిన ప్రతీ ఒక్కరు అతడిని పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సంఘటన జూన్ 12 న జరగ్గా.. ఆ వ్యక్తి సోషల్ మీడియాలో జూన్ 21 న పోస్ట్ చేశారు. దీంతో ఆ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అమెరికాలోని న్యూ హాంప్‌షైర్‌లోని స్టంబుల్‌ ఇన్‌ బార్ అండ్‌ రెస్టారెంటుకు ఇటీవలనే ఓ కస్టమర్‌ వచ్చాడు. ఓ పానీయం, మరికొన్ని ఆహార పదార్థాలను ఆర్డర్‌ చేశాడు. వాటికి బిల్లు కేవలం 37 డాలర్లు (సుమారు రూ.2700) మాత్రమే అయ్యింది. ఈ బిల్లు రసీదును రెస్టారెంటులో వెయిటర్‌గా పని చేస్తున్న ఓ మహిళ అయనకు ఇచ్చింది.

దానిపై ఆ కస్టమర్‌ టిప్పుగా 16 వేల డాలర్లు (సుమారు రూ.11 లక్షలు) ఇస్తున్నట్లు రాశాడు. అయితే.. తానిచ్చిన నగదును అంతా ఒకే చోట ఖర్చు చేయకు అంటూ.. ఆయన చెప్పడంతో ఆ మహిళ అతను రాసిచ్చిన రసీదును చూసింది. ఆ రసీదును రెస్టారెంట్ యజమానికి చూపించింది. దీంతో ఆనందపడిన ఆ యజమాని ఆ టిప్పును తన సిబ్బంది అందరికీ పంచాడు.

Published by:Veera Babu
First published:

Tags: America, Tips For Women

ఉత్తమ కథలు