హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Covid vaccine: ఒక్కరోజే ఏకంగా 10 కోవిడ్​ వ్యాక్సిన్లను వేయించుకున్నాడు.. విషయం తెలిసి అబ్జర్వేషన్లో పెట్టిన ఆరోగ్య శాఖ అధికారులు

Covid vaccine: ఒక్కరోజే ఏకంగా 10 కోవిడ్​ వ్యాక్సిన్లను వేయించుకున్నాడు.. విషయం తెలిసి అబ్జర్వేషన్లో పెట్టిన ఆరోగ్య శాఖ అధికారులు

దర్శనా నికి వెళ్లే ప్రయాణికులు 2 డోసుల కోవిడ్‌ టీకా వేయించుకున్న సర్టిఫికెట్‌ను గానీ లేదా దర్శ నానికి 72 గంటల్లోపు పొందిన కోవిడ్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్‌ను గానీ సమర్పించాలి. ప్రతీకాత్మక చిత్రం)

దర్శనా నికి వెళ్లే ప్రయాణికులు 2 డోసుల కోవిడ్‌ టీకా వేయించుకున్న సర్టిఫికెట్‌ను గానీ లేదా దర్శ నానికి 72 గంటల్లోపు పొందిన కోవిడ్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్‌ను గానీ సమర్పించాలి. ప్రతీకాత్మక చిత్రం)

ఒమిక్రాన్​ వచ్చి పడటంతో టీకాలు వేగవంతం చేసే పనిలో ఆయా దేశాలు పడ్డాయి. దీంతో ప్రపంచ దేశాలు తమ పౌరులకు వేగంగా టీకాలు వేయాలని పనిచేస్తున్నాయి. అయితే న్యూజిలాండ్‌కి చెందిన ఒక మహానుభావుడు మాత్రం ఏకంగా పది కరోనా వ్యాక్సిన్‌లు తీసుకున్నాడు

ఇంకా చదవండి ...

  కరోనా (Corona) మహమ్మారి నుంచి రక్షణ పొందాలంటే ఏకైక మార్గం వ్యాక్సిన్ మాత్రమే అని నిపుణులు తేల్చి చెప్పారు. కరోనాను కట్టడి చేయాలంటే వ్యాక్సినేషన్ మాత్రమే పరిష్కారం అని కూడా స్పష్టం చేశారు. దీంతో ప్రపంచంలోని అన్ని దేశాలు తమ ప్రజలకు వ్యాక్సిన్లు ఇస్తున్నాయి. పెద్దఎత్తున వ్యాక్సినేషన్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నాయి. ప్రజలందరికి రెండు డోసుల వ్యాక్సిన్లు (vaccines) ఇస్తున్నాయి. మొదటి డోసు తీసుకున్న కొన్ని వారాల తర్వాత రెండో డోసు వేస్తున్నారు. అయితే ఒక్కసారిగా ఒమిక్రాన్​ వచ్చి పడటంతో టీకాలు వేగవంతం చేసే పనిలో ఆయా దేశాలు పడ్డాయి. దీంతో ప్రపంచ దేశాలు తమ పౌరులకు వేగంగా టీకాలు వేయాలని పనిచేస్తున్నాయి. అయితే న్యూజిలాండ్‌కి (new Zealand) చెందిన ఒక మహానుభావుడు మాత్రం ఏకంగా పది కరోనా వ్యాక్సిన్‌ (ten covid vaccines)లు తీసుకున్నాడు. అది కూడా కేవలం 24 గంటల వ్యవధిలో. పూర్తి వివరాల్లోకి వెళితే.. న్యూజిలాండ్‌కు చెందిన ఒక వ్యక్తి కేవలం 24 గంటల్లో 10 సార్లు టీకా తీసుకున్నాడు. ఇది నిజమా? అబద్ధమా? అని తేల్చేందుకు న్యూజిలాండ్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగి దర్యాప్తు చేయగా ఇది నిజమేనని నిర్ధారించింది.

  విచారణలో ఆ సదరు వ్యక్తి వేర్వేరు గుర్తింపు కార్డులతో వ్యాక్సిన్లు (vaccines) తీసుకున్నాడని పేర్కొంది. కాగా న్యూజిలాండ్‌లో కరోనా కట్టడి కోసం అక్టోబర్‌ నుంచి జీరో కొవిడ్‌ స్ట్రేటజీని అమలుచేస్తున్నారు. ఇందులో భాగంగా కరోనా టీకా తీసుకునే వ్యక్తుల గుర్తింపు కార్డులపై పెద్దగా దృష్టి సారించడం లేదు. ఈక్రమంలోనే సదరు వ్యక్తి వేర్వేరు గుర్తింపు కార్డులతో 24 గంటల్లో ఏకంగా 10 సార్లు కొవిడ్‌ టీకా తీసుకున్నాడని ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికారులు (health officials) చెబుతున్నారు.

  అయితే ఇలా తీసుకోవడం వల్ల ప్రాణానికి ఎలాంటి అపాయం ఉండదని, అయితే ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, అందుకే ఆ వ్యక్తి వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. అతన్ని అబ్జర్వేషన్​లో ఉంచారు. ఇలా తప్పుడు గుర్తింపు కార్డులతో టీకాలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని హెచ్చరించారు.

  ప్రభుత్వం, వైద్యులు సూచించిన ప్రకారమే టీకాలు, మందులు తీసుకోవాలని వారు కోరారు. దాదాపు అరకోటి జనాభా ఉన్న న్యూజిలాండ్‌లో ఇప్పటివరకు 12,500 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 46 మంది వైరస్‌ కారణంగా మృత్యువాత పడ్డారు. ప్రపంచ దేశాల్లో కరోనాను సమర్థంగా కట్టడి చేసిన దేశాల్లో కివీస్ కూడా ఒకటి.

  ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా తొలి మరణం నమోదైంది. ఈ విషయాన్ని బ్రిటన్ ప్రధాని జాన్సన్ బోరిస్ సోమవారం ప్రకటించారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తుల్లో ఒకరు చనిపోయారని తెలిపారు. గత నెలలో గుర్తించిన కరోనా కొత్త ఒమిక్రాన్.. ఇప్పటివరకు ఉన్న వేరియంట్ల కంటే చాలా వేగంగా వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం దీనిపై ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తోంది. భారత్ సహా అనేక దేశాలకు కొన్ని రోజుల వ్యవధిలోనే వ్యాపించిన ఈ కొత్త వేరియంట్.. ఆయా దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు ప్రపంచంలో 63 దేశాలకు ఈ వేరియంట్ వ్యాప్తించింది. మన దేశంలో ఇప్పటివరకు 38 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారి విషయంలో అధికారులు దృష్టి పెట్టారు

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Covid vaccine, New Zealand

  ఉత్తమ కథలు