వణికిన అమెరికా....అలస్కాలో వరుస భూకంపాలు

అలస్కాలోని యాంకరేజ్ సిటీకి 11 కిలోమీటర్ల దూరంలో భూమికి 21 మైళ్లలోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు అధికారులు.

news18-telugu
Updated: December 1, 2018, 8:12 AM IST
వణికిన అమెరికా....అలస్కాలో వరుస భూకంపాలు
అలస్కాలో వరుస భూకంపాలు
  • Share this:
నిన్నమొన్నటివరకు వరుస తుఫానులతో వణికిన అమెరికా... ఇప్పుడు భూకంపాలతో బెంబేలెత్తుతుంది. తాజగా అగ్రరాజ్యంలోని అలస్కాలో రెండు భారీ భూకంపాలు సంభవించాయి. శుక్రవారం ఉదయం అలస్కాలో వరుసగా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయిజ
మొదటి భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ 7గా రికార్డ్ అయ్యింది. అలస్కాలోని యాంకరేజ్ సిటీకి 11 కిలోమీటర్ల దూరంలో భూమికి 21 మైళ్లలోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు అధికారులు.

మొదటి భూకంపం వచ్చిన కొద్ద నిమిషాల్లోనే... మరో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.7గా నమోదయ్యింది. ఈ వరుస భూకంప ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆస్తినష్టం మాత్రం భారీగా జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

భూకంప తీవ్రతకు చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. రోడ్లు కుంగిపోయాయి. ఎంత నష్టం సంభవించింది? అన్నదానిపై అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఎర్త్ క్వేక్ ఎఫెక్ట్‌తో ఆందోళన చెందిన అధికారులు మొదట సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసిన మళ్లీ కాసేపటికే వాటిని ఉపసంహరించుకున్నారు.
Published by: Sulthana Begum Shaik
First published: December 1, 2018, 8:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading