హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Facebook: ఫేస్‌బుక్ డేటా చౌర్యం.. ఆ వెబ్‌సైట్స్ నుంచి ప్రజల ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్న సంస్థ

Facebook: ఫేస్‌బుక్ డేటా చౌర్యం.. ఆ వెబ్‌సైట్స్ నుంచి ప్రజల ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్న సంస్థ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆదాయ పన్నులను ఫైల్ చేయడానికి సాయం చేసే ఆన్‌లైన్ వెబ్‌సైట్స్, తమ కస్టమర్ల డేటాను ఫేస్‌బుక్‌కు పంపిస్తున్నాయని ఈ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ వెల్లడించింది. వెబ్‌సైట్లు కస్టమర్ల ఆర్థిక సంబంధ సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో పంచుకుంటున్నట్లు మార్కప్ ఎన్జీవో పరిశోధనల?

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

సోషల్ మీడియా రాకతో ప్రజలకు సంబంధించిన అన్ని వివరాలు ప్రపంచానికి తెలుస్తున్నాయి. ఇప్పుడు ప్రజల పర్సనల్, ప్రొఫెషనల్ డేటాకు సెక్యూరిటీ లేకుండా పోతోందనేది నమ్మలేని నిజం. ఈ విషయం మరోసారి నిరూపితమైంది. ఆన్‌లైన్‌లో ప్రైవేట్ వెబ్‌సైట్లలో(Websites) ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లెక్కించే వారి డేటా, సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్‌కు(Facebook) చేరుతోందని ఒక లేటెస్ట్ రిపోర్ట్ పేర్కొంది. ఆదాయ పన్నులను ఫైల్ చేయడానికి సాయం చేసే ఈ ఆన్‌లైన్ వెబ్‌సైట్స్, తమ కస్టమర్ల డేటాను ఫేస్‌బుక్‌కు పంపిస్తున్నాయని ఈ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ వెల్లడించింది.

ట్యాక్స్ ఫైలింగ్‌కు(Tax Filing) సాయం చేసే అనేక థర్డ్ పార్టీ వెబ్‌సైట్లు, కస్టమర్ల ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్‌ను సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌తో పంచుకుంటున్నాయని ‘ది మార్కప్’ (The Markup) చేసిన పరిశోధనలో తేలింది. కనీసం మూడు ట్యాక్స్ ప్రిపరేషన్ వెబ్‌సైట్లు కస్టమర్ల ఆర్థిక సంబంధ సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో పంచుకుంటున్నట్లు మార్కప్ ఎన్జీవో ఇన్వెస్టిగేషన్‌లో వెల్లడైంది.

* ట్యాక్స్ ఫైలింగ్‌కు సాయం

కొన్ని లక్షల మంది అమెరికన్లు తమ ఆదాయ పన్నులను దాఖలు చేయడానికి ఆన్‌లైన్ ట్యాక్స్ ప్రిపరేషన్ సాఫ్ట్‌వేర్‌పై ఆధారపడతారు. ఈ కంపెనీలు, కస్టమర్ల ట్యాక్స్ క్యాలిక్యులేషన్‌ను సులభతరం చేస్తాయి. తద్వారా ఆన్‌లైన్‌లో ఈజీగా ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. అయితే అమెరికాలోని H&R బ్లాక్, టాక్స్‌యాక్ట్, టాక్స్‌స్లేయర్ వంటి ట్యాక్స్ ఫైలింగ్ వెబ్‌సైట్లు ఇలాంటి సున్నితమైన ఆర్థిక సమాచారాన్ని ఫేస్‌బుక్‌కు పంపుతున్నట్లు నివేదిక పేర్కొంది.

ట్యాక్స్ ప్రిపరేషన్ వెబ్‌సైట్ల ద్వారా పన్ను క్యాలిక్యులేట్ చేయడానికి కస్టమర్లు తమ రాబడిని లెక్కించడానికి ఆదాయం, పెట్టుబడులు, ఇతర ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్‌తో పాటు వ్యక్తిగత సమాచారాన్ని కూడా అందించాలి. వినియోగదారుల ట్యాక్స్ ఫైలింగ్ స్టేటస్, స్థూల ఆదాయం, ట్యాక్స్ రిటర్న్స్.. వంటి సమాచారాన్ని ఈ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్‌కు పంపుతున్నట్లు తాజా ఇన్వేస్టిగేషన్‌లో తేలింది. కొన్ని వెబ్‌సైట్లు యూజర్ల ఫేస్‌బుక్ అకౌంట్స్‌తో డైరెక్ట్‌గా కనెక్ట్ చేసే ఆప్షన్ ఇచ్చి, వారి డేటాను సేకరిస్తున్నాయి. దీంతో ఈ డేటాను ఫేస్‌బుక్ అక్రమంగా సేకరిస్తోందని టెక్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

Twitter: ఇకపై ట్విట్టర్‌లో లే ఆఫ్స్​ ఉండవు.. సీఈఓ ఎలాన్ మాస్క్ కీలక ప్రకటన.. పూర్తి వివరాలివే

WhatsApp: మీ వాట్సాప్ చాట్‌ను ఎవరైనా చూస్తున్నారని అనుమానమా? ఇలా కనిపెట్టండి

ఫేస్‌బుక్ అందుకున్న ఈ డేటాను కంపెనీ తన అడ్వర్టైజింగ్ అల్గారిథమ్‌లను మెరుగుపరచడానికి ఉపయోగించుకోవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ట్యాక్స్ ఫైలింగ్ సేవలను ఉపయోగించే వ్యక్తికి ఫేస్‌బుక్‌ లేదా మెటా నిర్వహించే ఇతర ప్లాట్‌ఫామ్‌లలో అకౌంట్ ఉందా అనే దానితో సంబంధం లేకుండా ఈ డేటా చౌర్యం జరుగుతున్నట్లు ‘ది వెర్జ్’ నివేదించింది. అయితే తమ కస్టమర్ల డేటా ప్రైవసీని చాలా సీరియస్‌గా తీసుకుంటామని ఈ సైట్ల ప్రతినిధులు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వ సంస్థలు ఎలా స్పందిస్తాయో తెలియాల్సి ఉంది.

Published by:Kishore Akkaladevi
First published:

Tags: Facebook