Home /News /international /

A GROUP OF RUSSIANS DANCED IN PUNJABI TO THE POPULAR SONG GOES VIDEO VIRAL VB

Viral Video: ఎల్లలు దాటిన భారతీయ సంగీత కళ.. స్టెప్పులతో అదరగొట్టిన రష్యన్ బృందం..

పంజాబీ పాటకు డ్యాన్స్ వేస్తున్న రష్యన్ బృందం

పంజాబీ పాటకు డ్యాన్స్ వేస్తున్న రష్యన్ బృందం

Punjabi Music: భారతీయ సంగీతానికి ఓ రష్యన్ బృందం అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్ వేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అయింది. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ ఫిదా అవుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.

    సంగీతానికి భాష అంటూ ఉండదు. అందులో నుంచి వచ్చే శబ్ధం అలాంటిది మరి. ఇలా కళకు సరిహద్దులు, భాషా బేధం అనేది ఉండదు. భారతీయ సంగీతానికి ఓ మాయాజలం ఉంది. ఎవరైనా సరే భారతీయ పాటల బీట్స్ కు కాలు కదపాల్సిందే. అలా చెవులకు కనుల పండువగా ఉంటుంది భారతీయ సంగీతం. అయితే తాజాగా ఓ రష్యన్‌ల బృందం పంజాబీలో ‘‘ముండియన్‌ తు బాచ్‌ కే’’ అనే ప్రసిద్థ పాటకు అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. డ్యాన్స్‌ గ్రూపులోని పురుషులు, మహిళలు భారతీయ వేషధారణలో ఉన్నారు. మహిళలు ఎరుపు లెహోంగా-చోలి ధరించగా.. పురుషులు కుర్తా-పైజామా ధరించి, సరియైన భావ వ్యక్తీకరణలతో నృత్యం చేస్తున్నారు.




    కాగా, ఈ వీడియోను చూసిన నెటిజన్లు వారి నాట్యానికి, నటనకు ఫిదా అవుతున్నారు. దీనిని రెండు రోజుల క్రితం పోస్ట్ చేయగా తాజాగా నెట్టింట్లో వైరల్ గా మారింది.
    Published by:Veera Babu
    First published:

    Tags: Music, Punjab, Russia

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు