Shocking: ఈ ట్రాఫిక్ పోలీసులు మాములోళ్లు కాదు.. బంగారపు కిచెన్, బంగారపు వాష్ బేసిన్, బంగారపు టాయిలెట్లు.. బాబోయ్..!

విల్లాలో కనిపించిన దృశ్యాలు

రష్యాలో కొందరు పోలీసుల అవినీతి పరాకాష్టకు చేరింది. ఒకప్పుడు ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి ఇంట్లో టాయిలెట్‌లు కూడా బంగారంతో తయారు చేయించుకున్న సంగతి తెలిసి నోరెళ్లబెట్టాం. కానీ.. రష్యాలో కొందరు అవినీతి రుచిమరిగిన పోలీసులు వాష్ బేసిన్ దగ్గర నుంచి టాయిలెట్ల దాకా అన్నీ బంగారంతోనే చేయించుకున్నారు.

 • Share this:
  రష్యా: ‘ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం.. పోలీసు శాఖలో కొందరు లంచాలకు అలవాటు పడటం సహజం’ అన్నట్టుగా తయారైంది పరిస్థితి. భారత్‌లో కొందరు ట్రాఫిక్ పోలీసుల నుంచి ఉన్నతాధికారుల దాకా లంచాలు సర్వ సాధారణంగా మారాయి. కేవలం మన దేశంలోనే పరిస్థితి ఇలా ఉందనకుంటే పొరపాటే. రష్యాలో కొందరు పోలీసుల అవినీతి పరాకాష్టకు చేరింది. ఒకప్పుడు ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి ఇంట్లో టాయిలెట్‌లు కూడా బంగారంతో తయారు చేయించుకున్న సంగతి తెలిసి నోరెళ్లబెట్టాం. కానీ.. రష్యాలో కొందరు అవినీతి రుచిమరిగిన పోలీసులు వాష్ బేసిన్ దగ్గర నుంచి టాయిలెట్ల దాకా అన్నీ బంగారంతోనే చేయించుకున్నారు. రష్యన్ దర్యాప్తు అధికారుల రైడ్స్‌‌లో ఈ అవినీతి పోలీసుల బండారం బట్టబయలైంది. రష్యాలో అవినీతికి అలవాటు పడిన కొందరు పోలీసులు గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. ఆ అవినీతి సొమ్ముతో ఒక పెద్ద రాజ భవంతిని తలపించే భవంతిని కట్టించుకున్నారు. ఆ భవంతిలో ఎటు చూసినా బంగారమే. కొన్నేళ్లుగా లంచాల రూపంలో దోచుకున్నదంతా ఆ భవంతిలో దాచిపెట్టుకుని.. రాజభోగం అనుభవించారు. స్ట్రావ్రోపోల్‌లో కొందరు ట్రాఫిక్ పోలీసులు గ్యాంగ్‌గా ఏర్పడి ఈ ఘన కార్యం చేశారు. వ్యాపారాలకు ఫేక్ పర్మిట్లు ఇస్తూ ఈ ఏడుగురు ట్రాఫిక్ పోలీసులు లంచాలకు రుచిమరిగారు. దాదాపు కొన్నేళ్ల నుంచి వీళ్ల దందా కొనసాగింది. పోలీసు చెక్ పాయింట్ల దగ్గర పర్మిట్లు లేని వాహనాలకు అనుమతినిచ్చినందుకు ఈ పోలీసులకు లంచాలు ముట్టాయి.  ఆ వాహనాలన్నీ పెద్దపెద్ద రియల్ ఎస్టేట్ మరియు అనధికార వ్యాపార సంస్థలకు చెందినవిగా దర్యాప్తు అధికారుల విచారణలో బయటపడింది. ఈ కేసులో దర్యాప్తు అధికారులు సౌత్రన్ స్ట్రావ్రోపోల్ ప్రాంత ట్రాఫిక్ పోలీస్ హెడ్ కోల్ అలెక్సీ సఫొనోవ్‌తో పాటు మరో ఆరుగురు ట్రాఫిక్ పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. ‘ఎస్‌కె’ అనే రష్యన్ దర్యాప్తు సంస్థ మొత్తం 80 చోట్ల సోదాలు జరిపింది. ట్రాఫిక్ పోలీసు అధికారుల అవినీతికి సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో ఏకకాలంలో సోదాలు జరిపింది.

  ఈ సోదాల్లో ఈ విల్లా ఒక్కటే కాదు.. పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడింది. ఖరీదైన కార్లను అవినీతి పోలీసులు తమ విలాసాలకు కొనుగోలు చేసినట్లు తేలింది. ఆ కార్లను కూడా దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మాఫియా గ్యాంగ్‌ను తలపించిన ఈ ట్రాఫిక్ పోలీస్ గ్యాంగ్ గురించి రష్యాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ గ్యాంగ్‌కు సంబంధించిన విల్లాతో పాటు, ఆ విల్లాలోని బంగారపు కిచెన్, బంగారపు వాష్ బేసిన్, బంగారపు కిచెన్ ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.
  Published by:Sambasiva Reddy
  First published: