హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Bengaluru: వీధి కుక్కల కోసం జీవితాలనే అంకితం చేసిన జర్మన్ జంట. ఈ స్టోరీ చదివితే కన్నీళ్లు ఆగవు!

Bengaluru: వీధి కుక్కల కోసం జీవితాలనే అంకితం చేసిన జర్మన్ జంట. ఈ స్టోరీ చదివితే కన్నీళ్లు ఆగవు!

వీధి కుక్కల కోసం  జీవితాలను  అంకితం చేసిన జర్మన్ జంట. ఈ స్టోరీ చదివితే కన్నీళ్ళు ఆగవు!

వీధి కుక్కల కోసం జీవితాలను అంకితం చేసిన జర్మన్ జంట. ఈ స్టోరీ చదివితే కన్నీళ్ళు ఆగవు!

బెంగుళూరు(Bengaluru)లో నివసిస్తున్న ఒక జర్మనీ(Germany) దేశస్థుడు వీధి కుక్కలను కాపాడి మానవత్వానికి మారుపేరుగా నిలుస్తున్నారు. తల్లి చనిపోయి, ఆకలితో అలమటిస్తూ... చెత్తలో నిస్సహాయ స్థితిలో పడి ఉన్న కుక్క పిల్లను సంరక్షిస్తున్నారు.

బెంగుళూరు(Bengaluru)లో నివసిస్తున్న ఒక జర్మనీ(Germany) దేశస్థుడు వీధి కుక్కలను కాపాడి మానవత్వానికి మారుపేరుగా నిలుస్తున్నారు. తల్లి చనిపోయి, ఆకలితో అలమటిస్తూ... చెత్తలో నిస్సహాయ స్థితిలో పడి ఉన్న కుక్క పిల్లను చూసి అతను ఎంతగానో చలించిపోయారు. అనంతరం దాన్ని ఇంటికి తీసుకువచ్చారు. ఇంకొక వీధి కుక్కను కూడా చేరదీసి వాటికోసమే ఏకంగా ఒక ఆటోని కొనుగోలు చేశారు. ఇంతకీ ఆటో ఎందుకు కొనుగోలు చేశారనే కదా మీ ప్రశ్న.. అయితే 777 చార్లి లాంటి ఈ నిజమైన కథ చదవాల్సిందే.

వివరాల్లోకి వెళితే.. బీర్(Beer) తయారు చేయడంలో జర్మన్ వ్యక్తి ఆర్నే జాచ్‌ (Arne Jach) కు చాలా నైపుణ్యం ఉంది. ఈ ప్రొఫెషనల్ బ్రూవర్ క్రాఫ్ట్ బీర్, స్పెషల్ కాఫీ తయారుచేసే ఒక స్టార్టప్‌లో చేరడానికి సెప్టెంబర్ 2019లో బెంగళూరుకి వచ్చారు. అలా బెంగళూరులోనే ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. హెబ్బాల్‌లోని తన ఆఫీస్‌కి వెళ్లేందుకు జాచ్ ప్రతిరోజూ తన బైక్‌పై ప్రయాణించేవారు. అతని గర్ల్‌ఫ్రెండ్ కేటీ బోయిల్ (Katie Boyle) కూడా జనవరి 2020లో బెంగళూరుకి వచ్చేశారు.

చెత్తకుప్పలో కుక్కపిల్ల

అయితే ఒకరోజు జాచ్‌ తన ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా కోరమంగళలోని ఒక డంపింగ్ యార్డ్ వద్ద ఒక కుక్క, దాని రెండు కుక్కపిల్లలను గమనించారు. కానీ ఒక రోజు ఆ తల్లి కుక్క, దాని కుక్కపిల్ల చనిపోయి కనిపించాయి. మరొక కుక్కపిల్ల అక్కడక్కడే రోదిస్తూ తిరుగుతోంది. ఆ దృశ్యం చూసిన జాచ్‌ కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి చెత్తలో ఒంటరిగా తిరుగుతున్న ఆ కుక్కని చూసి చలించిపోయాడు. దాన్ని అక్కడే వదిలేయడానికి అతనికి మనసొప్పలేదు. అందుకే వెంటనే దానిని తన చేతుల్లోకి ఎత్తుకొని ఇంటికి సురక్షితంగా తీసుకెళ్లాడు. అప్పటికి అతను బెంగుళూరులో ఉండగా... అతని ప్రియురాలు కేటీ ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో ఉంది. ఈమె బెంగళూరులో తన ప్రియుడు కాపాడిన కుక్కపిల్లను చూసి మురిసిపోయింది. అది తన బాయ్‌ఫ్రెండ్ ఇంటికి రావడాన్ని వీడియో కాల్ ద్వారా ఆమె చూసింది. ఒక డంప్ నుంచి దీన్ని రక్షించినందున ఈ జంట ఆ కుక్కపిల్లకు బ్రస్కార్ (ఐరిష్‌లో చెత్త అని అర్ధం) అని పేరు పెట్టారు. రెండు వారాల తర్వాత జాచ్ బ్రస్కార్‌ని సాయంత్రం వాకింగ్‌కి తీసుకెళ్లినప్పుడు మరొక కుక్క వారిని ఫాలో అయింది. ఆ కుక్క వయసు కూడా చిన్నదే. దీంతో అతను దాన్ని కూడా ఇంటికి తెచ్చుకున్నాడు. అనంతరం దానికి రెక్స్‌ అని పేరు పెట్టాడు. 2020 జనవరిలో బెంగళూరుకి వచ్చిన కేటీ ఆ రెండు వీధి కుక్కలను అక్కున చేర్చుకున్నారు.

ఇదీ చదవండి:  147 years of BSE: మర్రి చెట్టుకింద ప్రారంభమైన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్.. చరిత్ర చదివితే మీరే ఆశ్చర్యపోతారు..!


కుక్కలకు ఆడుకునేందుకు ఎక్కువ స్థలం ఉండేలా వారు ఒక కొత్త ఇంటికి మకాం మార్చారు. కోరమంగళలోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివసించే వీరు.. కుక్కల కోసమే హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లోని ఒక కొత్త ఇంటికి మారారు. అక్కడ తమ పెంపుడు కుక్కలు పరిగెత్తడానికి, ఆడుకోవడానికి మరింత స్థలం ఉందని కేటీ చెప్పుకొచ్చారు.

ఆటో కొనాలని నిర్ణయించుకుంది ఈ ఘటన వల్లే

2020 డిసెంబర్ సాయంత్రం, కేటీ బోయిల్, ఆమె పార్ట్‌నర్ ఆర్నే జాచ్ వర్క్ నుంచి ఇంటికి తిరిగి రాగానే వారికి ఒక షాకింగ్ దృశ్యం కనిపించింది. వారి పెంపుడు జంతువు రెక్స్ తమ మెడిసిన్ అలమరా నుంచి కొన్ని పెయిన్ కిల్లర్స్ మందులను సరదాగా నమిలినట్లు వారికి తెలిసింది. కుక్కకి ఏమైనా అవుతుందోమోనని ఆందోళన పడ్డారు ఆ దంపతులు. అనంతరం ఆ కుక్కను వెటర్నరీ ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించారు. కానీ ఏ ఆటోరిక్షా లేదా క్యాబ్ డ్రైవర్ కుక్కను తీసుకెళ్లడానికి అంగీకరించలేదు. చివరగా, ఒక గంట తర్వాత వారు ఒక వాహనం డ్రైవర్ ని ఒప్పించగలిగారు. ఆ డ్రైవర్ దయవల్ల రెక్స్‌కి సకాలంలో చికిత్స చేయించగలిగారు.

ఆ సాయంత్రమే ఈ ఐరిష్-జర్మన్ జంట తమ కుక్కల కోసమే ఆటోరిక్షా కొనాలని నిర్ణయించుకున్నారు. ఈ జంట ఆన్‌లైన్‌లో... ఆఫ్‌లైన్‌లో నెలల తరబడి ఆటో కోసం వెతికారు. అలా వెతకగా వెతకగా చివరిగా 2021 అక్టోబరులో వారికి ఒక ఆటోరిక్షా దొరికింది. మరొక జర్మన్ వ్యక్తి స్వస్థలానికి వెళుతూ ఈ దంపతులకు ఆటోని అమ్మేశారు. అప్పటినుంచి తాము ప్రేమగా పెంచుకుంటున్న కుక్కలను వెటర్నరీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లడానికి, నగరం చుట్టూ తిరిగేందుకు ఆటోని వాడుతున్నారు. "జంతువులు చనిపోయే పరిస్థితుల్లో ఉన్నా కూడా చాలామంది క్యాబ్‌ లేదా ఆటో డ్రైవర్లు వాహనంలో ఎక్కించుకునేందుకు ఏమాత్రం కనికరం చూపించడం లేదు. ఈ విషయం నాకు చాలా బాధ కలిగించింది. అందువల్ల, రెక్స్, బ్రస్కార్‌ కోసం ఆటోను కొనుగోలు చేశాం,” అని జాచ్ చెప్పారు. వీధి కుక్కలకు (Stray Dogs) ఒక మంచి జీవితం అందించి వారి ఆలనాపాలనా చూసుకుంటున్న ఈ జంటను స్థానికులందరూ పొగుడుతున్నారు.

First published:

Tags: Bengaluru, Germany, Stray dogs, Tollywood heroines dogs

ఉత్తమ కథలు