మహిళను రేప్ చేయబోయిన సేల్స్‌మేన్... చివర్లో షాక్

మన దేశంలోనే కాదు... అభివృద్ధి చెందిన దేశాల్లోనూ రేపిస్టులు రెచ్చిపోతున్నారు. ఈ కేసులో బాధితురాలు ఎలా ఉచ్చులో చిక్కుకుందో తెలుసుకుందాం.

news18-telugu
Updated: September 2, 2020, 1:28 PM IST
మహిళను రేప్ చేయబోయిన సేల్స్‌మేన్... చివర్లో షాక్
మహిళను రేప్ చేయబోయిన సేల్స్‌మేన్... చివర్లో షాక్ (credit - twitter)
  • Share this:
అది దుబాయ్. టెక్నాలజీని బాగా వాడుకునే దేశం. సంపన్నులకు కొరతే లేదక్కడ. అలాంటి చోట... అల్ బర్షాలో ఓ ఖరీదైన అపార్ట్‌మెంట్. అందులో ఓ ఫ్లాట్. అక్కడ ఏం జరిగిందన్నదే ఈ కేసు. భర్త ఇంట్లోలేని సమయంలో... ఆ 22 ఏళ్ల భార్య... ఇంట్లో పనులు పూర్తి చేసుకొని... బాత్‌రూంకి వెళ్లింది. నిమిషం తర్వాత బయటకు వచ్చింది. బాత్‌రూం నుంచి ఇంటి హాల్‌‌ లోకి వచ్చి... ఫోన్ కోసం వెతుకుతూ... పక్క రూంలోకి చూసింది. అక్కడ ఓ వ్యక్తి కనిపించాడు. బాత్‌రూంకి వెళ్లి... వెంటనే వచ్చేస్తాను కదా అని ఆమె ఇంటి డోర్ క్లోజ్ చెయ్యలేదు. అందువల్ల ఆ నిమిషం గ్యాప్‌లోనే ఆ వ్యక్తి ఇంట్లోకి వచ్చేశాడు. "హు ఆర్ యు... ఎందుకొచ్చావు" అతను ఏమీ మాట్లాడకుండా అలా చూడసాగాడు. ఆమెకు డౌట్ వచ్చి... వెంటనే తన ఫోన్ తీసుకొని... అదే అపార్ట్‌మెంట్‌లోని మరో ఫ్లాట్‌లో ఉంటున్న తన ఫ్రెండ్‌కి హెల్ప్ అని మెసేజ్ పంపింది.

మెసేజ్ పంపేస్తున్న చివరి క్షణంలో... ఆమె దగ్గరకు వచ్చిన 32 ఏళ్ల పాకిస్తాన్ వ్యక్తి... "ముద్దు కావాలి" అన్నాడు.

ఆమె షాకైంది. లోపలి భయం బయటకు కనిపించకుండా కవర్ చేసుకుంటూ... ధైర్యం చూపిస్తూ... "ఇదుగో... మర్యాదగా చెబుతున్నాను... వెళ్లిపో... లేదంటే పోలీసులకు కాల్ చేస్తా" అంది. అంతే... ఆమెను బరబరా ఈడ్చుకుంటూ బెడ్ పైకి తోశాడు. పోలీసులు వచ్చే లోపే... "నీ అంతు చూస్తా" అంటూ మీద మీదకు వస్తుంటే... సరిగ్గా అప్పుడే... 27 ఏళ్ల ఆ ఫ్రెండ్... ఆ ఇంట్లోకి ఎంటరయ్యాడు. వచ్చీ రావడంతోనే... "రేయ్... అంటూ" నిందితుడిపై కలబడ్డాడు. ఇద్దరి మధ్య తోపులాట మొదలైంది. నువ్వు నా ఫ్లాట్‌లోకి వెళ్లిపో అని ఆమెకు చెప్పిన ఫ్రెండ్... ఆ నిందితుడిపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేకపోయిన నిందితుడు... పారిపోయేందుకు యత్నించాడు. అతని చొక్కాని పట్టుకోగా... ఆ చొక్కా చిరిగిపోయింది. అయినా పర్లేదనుకుంటూ... నిందితుడు పారిపోయాడు.

అలా ఆమెను ఆమె ఫ్రెండ్ కాపాడాడు. ఆ తర్వాత భర్త వచ్చాడు. కాపాడిన ఫ్రెండ్‌కి థాంక్స్ చెప్పాడు. తర్వాత ముగ్గురూ వెళ్లి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వెంటనే అతన్ని పట్టుకున్నారు. నిందితుడు దుబాయ్‌లో సేల్స్‌మేన్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. సెప్టెంబర్ 15న కోర్టు... అతన్ని దోషిగా తేల్చి శిక్ష వేస్తారని తెలిసింది.
Published by: Krishna Kumar N
First published: September 2, 2020, 1:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading