నదిలో 65 అడుగుల వింత జీవి... వైరల్ వీడియో...

Three Gorges Water Monster : అదేంటో ఎవరికీ అర్థం కాలేదు. కొంతమంది దాన్ని వీడియో తీశారు. ఎక్కువ మంది దాన్ని త్రీగార్జెస్ నీటి రాక్షసి అని పిలిచారు.

Krishna Kumar N | news18-telugu
Updated: September 20, 2019, 1:08 PM IST
నదిలో 65 అడుగుల వింత జీవి... వైరల్ వీడియో...
నదిలో 65 అడుగుల వింత జీవి... వైరల్ వీడియో... (Credit - weibo.com)
  • Share this:
చైనా లోని.... యాంగ్జే నదిలో... ఇటీవల ఓ వింత జీవి కనిపించింది. బ్లాక్ కలర్‌లో ఉన్న ఆ జీవిని కొందరు వీడియో తీసి... తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు. చైనాలో అది వైరల్ అయ్యింది. కొంతమంది దాన్ని స్కాట్లాండ్‌లో కనిపించే... లోచ్ నెస్ నదీ రాక్షసితో పోల్చారు. ఎందుకంటే... ఆ రాక్షసి లాగే... ఇది కూడా 65 అడుగుల పొడవు ఉంది. కానీ... వీడియోని చూస్తే... ఓ పొడవైన బ్లాక్ కలర్ పాము లాగా కనిపించింది. దీనిపై ఎవరికి తోచింది వాళ్లు చెప్పారు. రకరకాల కథలు ప్రచారంలోకి వచ్చాయి. ఎక్కువ మంది దాన్ని త్రీగార్జెస్ నదీ రాక్షసి అనే పేరుతో పిలిచారు. ఎందుకంటే అది హ్యూబీ ప్రావిన్స్‌లోని త్రీగార్జెస్ డ్యామ్ దగ్గర్లో కనిపించింది.


కొంతమంది అది నదిలో చెత్త అని అన్నారు. మరికొందరు అదో పురాణ రాక్షసి అని భావించారు. సైంటిస్టులు ఈ కహానీలను కొట్టిపారేశారు. అది భారీ పాము అయ్యి ఉండొచ్చన్నారు. ఇలా దానిపై వారం నుంచీ పెద్ద చర్చే జరిగింది.
తాజాగా అది ఏ రాక్షసీ కాదనీ... అది 65 అడుగుల ఇండస్ట్రియల్ ఎయిర్ బ్యాగ్ అని తేల్చారు. తాజాగా ఫెర్రీ పైయర్ దగ్గరున్న చేపల కోసం వల వేశారు. అందులో 65 అడుగుల ఎయిర్ బ్యాగ్ తగిలింది. అది ఓ షిప్‌యార్డ్ నుంచీ నదిలోకి కొట్టుకొచ్చినట్లు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్‌లో షేర్ అయ్యాయి. మొత్తానికి అది రాక్షసి కాదని తేలిపోయింది.

నదిలో దొరికిన ఇండస్ట్రియల్ ఎయిర్ బ్యాగ్ (Credit : Shanghai.ist)
First published: September 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>