ఆ పెయింటింగ్ రేటు రూ.778 కోట్లు... ఏంటి దాని ప్రత్యేకత...

Claude Monet's Painting : అంతర్జాతీయ వేలంలో అత్యధిక ధర పలికిన తొమ్మిదో పెయింటింగ్ ఇది.

Krishna Kumar N | news18-telugu
Updated: May 16, 2019, 9:15 AM IST
ఆ పెయింటింగ్ రేటు రూ.778 కోట్లు... ఏంటి దాని ప్రత్యేకత...
క్లాడ్ మానెట్ పెయింటింగ్ (Image :Courtesy Sotheby’s via AP)
  • Share this:
సాధారణంగా ఫేమస్ పెయింటర్లు వేసే పెయింటింగ్స్... మ్యూజియంలలో, ఆర్ట్ ఎగ్జిబిషన్‌లలో కనిపిస్తుంటాయి. ఫ్రాన్స్‌కి చెందిన పెయింటర్ క్లాడ్ మానెట్ వేసిన పెయింటింగ్స్ మాత్రం చాలావరకూ మ్యూజియంలకు వెళ్లక ముందే ఎవరో ఒకరు కొనేస్తూ ఉంటారు. ఇప్పటివరకూ అలా 7 కళాఖండాలు అమ్ముడైపోగా... ఇప్పుడు మరో అద్భుత పెయింటింగ్... అత్యధిక ధర పలికింది. మ్యూల్స్ పేరుతో క్లాడ్ మానెట్ 1890లో వేసిన పెయింటింగ్‌ని సోథెబీ సంస్థ వేలం వేసింది. వేలంలో అది ఏకంగా రూ.778 కోట్లు పలికింది. మానెట్ వేసిన పెయింటింగ్స్‌లో అత్యధిక ధర పలికింది ఇదే. ఇంప్రెషనిస్ట్ ఆర్ట్ వర్క్‌లో $100 మిలియన్ల ధర దాటిన మొదటి ఆర్ట్ ఇదేనట. అంతర్జాతీయ వేలంలో అత్యధిక ధర పలికిన తొమ్మిదో పెయింటింగ్ ఇది. ఇంతకు ముందు 1986లో ఇదే పెయింటింగ్‌ను రూ.17 కోట్లకు కొన్నారు గత ఓనర్.

Claude Monet, art, work, exhibition, sotheby, art paint, painting, aution, best paint, great art, పెయింటింగ్, వేలం, సోథెబీ, బెస్ట్ పెయింటింగ్, కళాఖండం, ఆర్ట్ ఎగ్జిబిషన్, వేలం, వైరల్ న్యూస్,
క్లాడ్ మానెట్ పెయింటింగ్ (Image :Courtesy Sotheby’s via AP)


వేలంలో ఈ కళాఖండాన్ని దక్కించుకునేందుకు ఆరుగురు పోటీ పడ్డారు. ఐతే... దీన్ని ఎవరు దక్కించుకున్నారో సోథెబీ వెల్లడించలేదు. క్లాడ్ మానెట్ వేసిన మరికొన్ని చిత్రాలు... న్యూయార్క్ ఆర్ట్ మ్యూజియం, చికాగోలోని ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్, ప్యారిస్‌లోని మ్యూస్డ్ ఓర్సేలో ఉన్నాయి. ఇంతకీ దీని ప్రత్యేకత చెప్పలేదు కదూ. 1890, 1891లో దాదాపు ఏడాదిపాటూ ఇదే పెయింటింగ్‌ను వేశాడు క్లా్డ్ మానెట్. ఇందుకోసం ఆయన ఒకే ప్రదేశానికి వేర్వేరు కాలాల్లో నాలుగైదుసార్లు వెళ్లాడు. అందువల్ల వెళ్లిన ప్రతిసారీ ఆయన వేయాలనుకున్న ప్రదేశం రకరకాల రంగులతో కొత్తగా కనిపించింది. అందువల్ల ఆయన వేసిన పెయింటింగ్ కూడా సరికొత్తగా అనిపిస్తూ ఆకట్టుకుంటోంది.

 ఇవి కూడా చదవండి :

రైల్లో పోర్న్ ఆడియో... ఆ అరుపులతో షాకైన వందల మంది ప్రయాణికులు...

ఏపీ ప్రభుత్వ ఖజానా ఖాళీ... దెబ్బేసిన కేంద్రం... నిధుల కోసం వేల కోట్ల అప్పులు...వైఎస్ వివేకానందరెడ్డిని వాళ్లే చంపారా..? ముగ్గురిపై పోలీసుల అనుమానాలు...

టీడీపీ, వైసీపీ... రెండు పార్టీలకూ 100కు పైనే... నకిలీ సర్వేలపై ప్రజల ఆగ్రహం...
First published: May 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>