బెంబేలెత్తించిన బుడతడు.. పేలుడుతో ఉలిక్కిపడిన జనం

అప్పుడప్పుడు చిన్నపిల్లల అల్లరి పనులు.. తెగ టెన్షన్ పెడుతుంటాయి. తాజాగా ఓ బుడ్డోడు చేసిన పని.. జనాలు తెగ భయపెట్టేసింది. ఒక్కసారిగా గుండెలాగినంత పనైపోయింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా?


Updated: February 5, 2019, 8:41 PM IST
బెంబేలెత్తించిన బుడతడు.. పేలుడుతో ఉలిక్కిపడిన జనం
చైనా బాలుడు

Updated: February 5, 2019, 8:41 PM IST
చైనాలో ఇటీవల కొత్త సంవత్సరం వేడుకలు అట్టహాసంగా జరిగాయి. జనాలంతా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ వేడుకల్లో భాగంగా.. చీఫెంగ్‌కు చెందిన ఓ బుడతడు రెండు చేతుల్లో కాకరపుల్లలు పట్టుకుని ఎంజాయ్ చేశాడు. చేస్తే చేశాడు.. కానీ వెలుగుతున్న కాకరపుల్లల్ని తీసుకెళ్లి అక్కడే ఉన్న ఓ మ్యాన్ హోల్‌లో పడేశాడు. దీంతో తారాజువ్వల్లా మిరుగులు పైకి రావడం ప్రారంభించాయి. ఆ వెంటనే భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. దీంతో భయపడి పోయిన బుడతడు అక్కణ్నుంచి పరుగులుపెట్టాడు. పేలుడుతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. పేలుడు దాటికి మ్యాన్ హోల్ ధ్వంసమై.. ఇటుకలన్నీ ఎగిరి పక్కనే పార్కింగ్ చేయబడిన వాహనాలపై పడ్డాయి.

పేలుడు శబ్దానికి పరిసరప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు పరుగుపరుగున బయటకు వచ్చారు. అయితే, పేలుడు దాటికి ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోవడం గమనించి.. ఏదో పెను ప్రమాదం జరిగి ఉంటుందని భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

బుడతడు మ్యాన్‌లో క్రాకర్స్ వేసిన ద‌ృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొన్ని లక్షల వ్యూస్ వచ్చేశాయి. దీంతో దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అసలు మ్యాన్ హోల్ ఎందుకు పేలిపోయిందనే విషయమై పెద్ద చర్చే జరుగుతోంది. అయితే, అసలు కారణాన్ని తెలుసుకునేందుకు స్థానిక పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

 వీడియో వీక్షించండి:

First published: February 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...