కుక్క పిల్ల, చికెన్ ముక్క, బంగారు పళ్లు...ఉబెర్ క్యాబ్‌లో మర్చిపోయిన వస్తువులట..

క్యాబ్ సర్వీసుల్లో ప్రయాణికులు మర్చిపోయే వస్తువులకు సంబంధించి లాస్ట్ అండ్ ఫౌండ్ ఇండెక్స్ (కోల్పోయిన, కనుగొనడిన వస్తువుల జాబితా)ను ఇటీవల ఉబెర్ సంస్థ వెల్లడించింది. ఈ లిస్ట్‌లో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

news18-telugu
Updated: March 7, 2019, 7:54 PM IST
కుక్క పిల్ల, చికెన్ ముక్క, బంగారు పళ్లు...ఉబెర్ క్యాబ్‌లో మర్చిపోయిన వస్తువులట..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నగరాల్లో నివసించే ప్రజలు క్యాబ్ సర్వీసెస్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. ట్రాఫిక్‌లో బైక్‌లపై వెళ్లేలేక, కిక్కిరిసిన బస్సుల్లో ప్రయాణించ లేక ఏసీ కార్లలో ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, షాపింగ్‌కు వెళ్లే మహిళలు ఎక్కువగా ఉబెర్, ఓలా వంటి క్యాబ్‌ సర్వీసులను ఆశ్రయిస్తున్నారు. ఐతే తొందరగా చేరుకోవాలన్న ఆతురతలో ఒక్కోసారి హడావిడిగా దిగేస్తుంటాం. ఆ క్రమంలో విలువైన వస్తువులను కారులోనే మరిచిపోతుంటాం. ఆ తర్వాత ఆలస్యంగా మేల్కొని క్యాబ్ డ్రైవర్‌కు కాల్‌చేసి వస్తువుల కోసం రిక్వెస్ట్‌లు పెడుతుంటారు. ఇలాంటి అనుభవం చాలా మందికి ఎదురై ఉంటుంది. ఐతే తమ క్యాబ్ సర్వీసుల్లో ప్రయాణికులు మర్చిపోయే వస్తువులకు సంబంధించి లాస్ట్ అండ్ ఫౌండ్ ఇండెక్స్ (కోల్పోయిన, కనుగొనడిన వస్తువుల జాబితా)ను ఇటీవల ఉబెర్ సంస్థ వెల్లడించింది. ఈ లిస్ట్‌లో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

ఉబెర్ క్యాబ్ ప్రయాణికులు ఎక్కువగా మర్చిపోయే వస్తువులు ఇవే:

1. మొబైల్ ఫోన్
2. కెమెరా
3. వ్యాలెట్
4. తాళం చెవులు
5. దుస్తులు6. కళ్లద్దాలు
7. హెడ్‌ఫోన్స్
8. ఐడీ కార్డులు
9. బ్యాగ్స్
10. ఎలక్ట్రానిక్ సిగరెట్లు

ప్రయాణికులు మర్చిపోయిన వెరైటీ వస్తువులు:
కుక్కపిల్ల, చేప ముక్క, బంగారు పళ్ల సెట్టు, బర్త్ సర్టిఫికెట్, సోషల్ సెక్యూరిటీ కార్డ్, హెడ్ బ్యాండ్, గుడ్ల ట్రే, రెజ్లింగ్ బెల్ట్, బ్రెస్ట్ మిల్క్ పంప్, బాడీ లోషన్, క్యాట్ పప్పెట్, వెడ్డింగ్ బ్యాండ్, మెక్‌డొనాల్డ్స్ ఫ్రైస్, హ్యారీపోటర్ దండం, పక్షి, పిజ్జా, వైట్ వెడ్డింగ్ కేక్, ఫాగ్ మెషీన్, మాండోలిన్, గూచి చెప్పులు, పంది మాంసం, కిమ్ కర్దాషియన్ ఫోన్ కేస్, వెల్డింగ్ హెల్మెట్, ఉతకని దుస్తులు. ఇవే కాదు ఉబెర్ లిస్టులో మరెన్నో వస్తువులు ఉన్నాయి.  అమెరికాలో ఉబెర్ క్యాబ్ సర్వీసెస్ డేటా ఆధారంగా ఈ లిస్ట్‌ను వెల్లడించారు.

ఏ రోజుల్లో ఏఏ వస్తువులు మర్చిపోతుంటారు?
సోమవారం-వాచీలు
మంగళవారం-హెడ్‌ఫోన్స్
బుధవారం- లాప్‌టాప్స్
గురువారం-పుస్తకాలు
శుక్రవారం-పాస్‌పోర్టులు
శనివారం-మొబైల్ ఫోన్స్
ఆదివారం-కేకులు

కారులో మర్చిపోయిన వస్తువులను ఎలా పొందాలి?
ఉబెర్ క్యాబ్‌లో వస్తువులను మర్చిపోతే..వెంటనే యాప్ ఓపెన్ చేసి మెనూలో 'Your Trips' ఆప్షన్ క్లిక్ చేయాలి.

మీరు ఏ ట్రిప్‌లో వస్తువును పోగొట్టుకున్నారో ఆ ట్రిప్ సెలెక్ట్ చేసి 'Report an issue with this trip' క్లిక్ చేయాలి.

అనంతరం 'I lost an item' ఆప్షన్ ఎంచుకుంటే 'Contact my driver about a lost item' ఆప్షన్ కనిపిస్తుంది.

ఆ ఆప్షన్ క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేయాలి. అనంతరం మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్‌మిట్ చేయాలి. ఒకవేళ మీ ఫోన్ పోతే... కుటుంబ సభ్యుడు లేదా మిత్రుడి ఫోన్ నెంబర్‌ని పేర్కొనాల్సి ఉంటుంది.

సబ్‌మిట్ చేసిన తర్వాత ఆ నెంబర్‌కు ఉబెర్ కస్టమర్ కేర్ కాల్‌చేసి డ్రైవర్‌తో మాట్లాడిస్తుంది. మీరు నిజంగానే వస్తువులు మర్చిపోయి ఉంటే డ్రైవర్ తీసుకొచ్చి అందజేస్తారు.

 
First published: March 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading