హోమ్ /వార్తలు /international /

90 పైసల ఈ డొక్కు స్పూన్ రూ. 2 లక్షలకు అమ్ముడయింది.. ఇంతకు ఏంటి దీని ప్రత్యేకత?

90 పైసల ఈ డొక్కు స్పూన్ రూ. 2 లక్షలకు అమ్ముడయింది.. ఇంతకు ఏంటి దీని ప్రత్యేకత?

చివరకు ఓ వ్యక్తి రూ.1,97,000కు వేలంలో ఆ చెంచాను దక్కించుకున్నాడు. టాక్స్, ఇతర చార్జీలు కలిపి దాదాపు రూ.2లక్షలు చెల్లించి.. దానిని దక్కించుకున్నాడు. ఈ విషయం తెలిసి స్పూన్‌ను వేలంలో పెట్టిన వ్యక్తి ఉబ్బితబ్బిపోయాడు.

    మనం భోజనం చేసేటప్పుడు ఉపపయోగించే స్పూన్ ధర ఎంతుంటుంది? మహా అయితే 10 రూపాయలు. పెద్ద పెద్ద మాల్స్‌లో కొన్నా 100 రూపాయలు మించదు. కానీ 90 పైసలకు కొన్న ఓ డొక్కు చెంచా ఏకంగా రూ. 2లక్షలకు అమ్ముడుపోయింది. ఆన్‌లైన్లో నిర్వహించిన వేలంలో ఓ వ్యక్తి రికార్డు ధరకు దానిని కొనుగోలు చేశాడు. అదేదో బంగారంతో చేసిన చెంచా కూడా కాదు. చాలా పాత కాలం నాటిది. మొత్తం వంగిపోయింది. చూడడానికి కూడా అంత బాగాలేదు. ఐానా భారీ మొత్తం వెచ్చించి దానిని సొంతం చేసుకున్నాడు. లండన్‌కు చెందిన ఓ వ్యక్తి వారాంతపు సంతలో ఓ పాత స్పూన్ కొన్నాడు. భారత కరెన్సీలో కేవలం 90 పైసలు పెట్టి దాన్ని కొన్నాడు. కానీ అదే చెంచాను ఆన్‌లైన్ వేలం పెట్టి రూ.2లక్షలకు అమ్ముకున్నాడు. దాని అసలు ధర కంటే ఏకంగా 12వేల రెట్ల అధిక ధర పలికింది.

    మార్కెట్లో 90పైసలకు స్పూన్‌ను కొనుగోలు చేసిన వ్యక్తి.. సోమర్‌సెట్‌లోని లారెన్సెస్ ఆక్షనీర్స్ సంస్థను సంప్రదించి ఆ చెంచాను ఆన్‌లైన్‌లో వేలం వేసేందుకు నమోదు చేసుకున్నాడు. అనంతరం స్పూన్‌ను కంపెనీ వారికి ఇచ్చేశాడు. 5 ఇంచుల పొడవున్న చెంచాను లారెన్సెస్ ఆక్షనీర్‌కు చెందిన సిల్వర్ ఎక్స్‌పర్ట్ అలెక్స్ బచర్ పరిశీలించాడు. అది స్టీల్‌తో చేసినది కాదని.. వెండితో తయారు చేసినట్లు గుర్తించాడు. అంతేకాదు ఆ చెంచా 13వ శతాబ్ధానికి చెందిన అరుదైన వస్తువుగా తెలిసింది. అనంతరం రూ.51,712 కనీస ధరకు వేలంలో పెట్టారు. దాని ప్రత్యేకతలను వెబ్‌సైట్లో వివరించారు. వెబ్‌సైట్లో ఈ పాత కాలం నాటి చెంచాను చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. దాని ప్రత్యేకతల గురించి తెలుసుకొని వేలంలో పోటీపడ్డారు. అలా దాని ధర అమాంతం పెరుగుతూ వచ్చింది.

    చివరకు ఓ వ్యక్తి రూ.1,97,000కు వేలంలో ఆ చెంచాను దక్కించుకున్నాడు. టాక్స్, ఇతర చార్జీలు కలిపి దాదాపు రూ.2లక్షలు చెల్లించి.. దానిని దక్కించుకున్నాడు. ఈ విషయం తెలిసి స్పూన్‌ను వేలంలో పెట్టిన వ్యక్తి ఉబ్బితబ్బిపోయాడు. ఆనందం పట్టలేకపోయాడు. ఎందుకంటే.. అతడు అనుకోకుండానే లండన్ మార్కెట్‌లో 90 పైసలకు దానిని కొన్నాడు. ఆ తర్వాత అదృష్టం పరీక్షించుకుందామని ఆన్‌లైన్లో వేలానికి పెట్టాడు. ఆన్‌లైన్‌లో వేలం జరుగుతున్న తీరును వీక్షిస్తూ అతడితో పాటు కుటుంబ సభ్యులు కూడా షాక్ తిన్నారు. ఏంటి అంత చిన్న స్పూన్‌కు వేలంలో ఇంత డిమాండ్ ఉందా? అని నోరెళ్ల బెట్టారు. చివరకు రూ. 2లక్షలకు అమ్ముడవంతో అతడి ఆనందానికి అవధులు లేకుండాపోయింది. 90 పైసలకు కొన్న తనకు లక్షలు తెచ్చిపెట్టిందని సంతోషం వ్యక్తం చేశారు.

    ఇవి కూడా చదవండి:

    Video: వామ్మో.. విమానంలో సిగరెట్ వెలిగించుకొని నిద్రపోయాడు

    'ఆదిత్య 369' లాగే ఇతడు భవిష్యత్‌లోకి వెళ్లాడట..5000లో ప్రపంచం మటాష్..

    First published:

    ఉత్తమ కథలు