పాక్‌లో పేలుళ్లు...130 మంది మృతి

మరో రెండు వారాల్లో పాక్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న తరుణంలో జంట పేలుళ్లతో బలూచిస్థాన్ దద్ధరిల్లింది.

news18-telugu
Updated: July 14, 2018, 12:42 AM IST
పాక్‌లో పేలుళ్లు...130 మంది మృతి
పాక్‌లోని బలూచిస్థాన్‌లో సంభవించిన జంట పేలుళ్లలో మ‌ృతదేహం వద్ద విలపిస్తున్న బంధువు
  • Share this:
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ రెండు వేర్వేరు బాంబు పేలుడు ఘటనలతో దద్ధరిల్లింది. బలూచిస్థాన్‌ ఆవామీ పార్టీ (బీఏపీ) ఏర్పాటుచేసిన ఎన్నికల ర్యాలీని లక్ష్యంగా చేసుకుని పేలుళ్లు జరిగాయి. జంట పేలుళ్ల ఘటనలో 130 మంది మృతి చెందగా...150 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో నేషనలిస్ట్ బలూచిస్థాన్ అవామీ పార్టీ అగ్రనేత కూడా ఉన్నారు. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి ఈ నెల 25న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పేలుడు ఘటనలు చోటుచేసుకున్నాయి.

బలూచిస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి నవాబ్‌ అస్లామ్‌ రైసాని సోదరుడు, బీఏపీ అగ్రనేత నవాబ్‌జదా సిరాజ్‌ రైసాని లక్ష్యంగా ఓ బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో దాదాపు 140 మందికి పైగా మృతి చెందగా...పలువురు గాయపడ్డారు. ఈ పేలుడులో తీవ్రంగా గాయపడిన రైసానిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందినట్లు జిల్లా పోలీసు అధికారి తెలిపారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఇది ఆత్మాహుతి దాడులుగా బాంబు డిస్పోసబుల్ స్క్వాడ్ నిర్ధారించింది. సుమారు 16-20 కేజీల పేలుడు పదార్థాలను దాడిలో వినియోగించి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఇమ్రాన్ ఖాన్‌పై పోటీ చేస్తున్న అక్రమ్ ఖాన్ దురాని లక్ష్యంగా మరో బాంబు పేలుడు జరగ్గా...ఐదుగురు మృతి చెందారు. మరో 37 మంది గాయపడ్డారు. ఈ పేలుడులో అక్రమ్ ఖాన్ తృటిలో తప్పించుకున్నారు. ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన ఆయన...బాంబు పేలుళ్లకు బెదిరేది లేదని, ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తానని చెప్పారు. ఈ జంట పేలుళ్లకు ఇప్పటి వరకు ఈ సంస్థ బాధ్యత స్వీకరిస్తున్నట్లు ప్రకటించలేదు.

పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మార్యమ్ లండన్‌ నుంచి లాహోర్‌కు వెనుదిరిగి అవినీతి కేసులో అరెస్టైన రోజే ఈ జంట పేలుడు ఘటనలు చోటుచేసుకున్నాయి.ఇది కూడా చదవండి
First published: July 13, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>