హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Maldives Fire Mishap: మాల్దీవుల్లో 9 మంది భారతీయ కార్మికులు సజీవ దహనం..

Maldives Fire Mishap: మాల్దీవుల్లో 9 మంది భారతీయ కార్మికులు సజీవ దహనం..

ప్రతీకాత్మక  చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Maldives Fire Accident: భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న వెహికల్ రిపేర్ గ్యారేజీలో మొదట మంటలు చెలరేగాయి. ఆ తర్వాత క్రమంగా పెరిగి.. మిగతా అంతస్థులకు వ్యాపించాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

పర్యాటకుల స్వర్గధామమైన మాల్దీవుల్లో ఘోర అగ్నిప్రమాదం (Maldives Fire Accident) జరిగింది. ఆ దేశ రాజధాని మాలె (Male Fire accident)లో జరిగిన అగ్రి ప్రమాద ఘటనలో 10 మంది విదేశీ కార్మికులు మరణించారు. మృతుల్లో 9 మంది భారతీయులే ఉన్నారు. ఒకరు బంగ్లాదేశ్‌ (Bangladesh)కు చెందిన కార్మికుడిగా అక్కడి అధికారులు గుర్తించారు. మాలెలో విదేశీ కార్మికులు నివాసముంటే భవనంలో గురువారం తెల్లవారుఝామున ఈ ఘటన  చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే.. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 10 మంది మృతదేహాలు లభ్యమయినట్లు అధికారులు వెల్లడించారు.

భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న వెహికల్ రిపేర్ గ్యారేజీలో మొదట మంటలు చెలరేగాయి. ఆ తర్వాత క్రమంగా పెరిగి.. మిగతా అంతస్థులకు వ్యాపించాయి. గాఢ నిద్రలో ఉన్న సమయంలో మంటలు వ్యాపించడంతో.. అక్కడున్న వారు తప్పించుకునే అవకాశం లేకపోయింది. షార్ట్ సర్క్కూట్ వల్లే ప్రమాదం జరిగినట్లుగా అధికారులు భావిస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు వారికి దాదాపు 4 గంటల సమయం పట్టింది. ఈ ఘటనపై మాల్దీవుల్లోని భారత హైకమిషన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అగ్నిప్రమాదంలో భారతీయులు మరణించారన్న వార్త తమను కలిచివేసిందని.. ఈ ఘటనపై మాల్దీవులు అధికారులతో మాట్లాడుతున్నామని పేర్కొంది. మరింత సమాచారం కోసం హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది.

మాలెలో విదేశీ కార్మికులు ఎక్కువగా ఉన్నారు. మాలె మొత్తం జనాభా రెండున్నర లక్షలు. ఐతే ఇందులో సగం జనాభా విదేశాల నుంచి వచ్చిన వారే కావడ గమనార్హం. అందులోనూ ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక నుంచి వచ్చిన వారే ఉన్నారు. విదేశాల నుంచి వచ్చిన కార్మికులు అక్కడ దుర్భర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు. కరోనా సమయంలో స్థానికుల కంటే.. విదేశీ కార్మికుల్లోనే మూడు రెట్లు అధికంగా కరోనా వ్యాప్తించింది. అప్పటి నుంచి విదేశీ కార్మికులపై ప్రత్యేక దృష్టించాలని ప్రభుత్వంపై విపక్షాలు ఒత్తిడి తెస్తున్నాయి.

First published:

Tags: Fire Accident, Maldives

ఉత్తమ కథలు