Home /News /international /

85 YEARS OLD GRANDMA SEARCHING FOR LOOKING FOR NEW LOVER ON A DATING SITE VB

Looking For A Lover: ప్రేమికుడి కోసం వెతుకుతున్న 85 ఏళ్ల బామ్మ.. 35 ఏళ్ల లోపు ఉన్న వాళ్లు మాత్రమే కావాలంటా..

85 ఏళ్ల బామ్మ

85 ఏళ్ల బామ్మ

Looking For A Lover: ప్రేమకు వయస్సుతో సంబంధం లేదంటూ చెబుతోంది ఓ 85 ఏళ్ల బామ్మ. అంతేకాదు.. ఇప్పుడే 39 ఏళ్ల ప్రియుడికి బ్రేకప్ చెప్పిన ఈ బామ్మ కొత్త ప్రియుడి కోసం అన్వేషిస్తోంది. పూర్తి వివరాలను తెలుసుకోండి.

    ప్రేమకు వయస్సు లేదు. ఇది ఎవరికైనా, ఎప్పుడైనా జరగవచ్చు. ఇప్పుడు చాలా డేటింగ్ సైట్లు మార్కెట్లోకి వచ్చాయి. అందులో తన జీవిత భాగస్వాముల కోసం వెతుకుతున్నారు. అలాంటిదే ఒక డేటింగ్ సైట్ (ఓల్డ్ వుమన్ ఆన్ డేటింగ్ సైట్) లో ఓ 85 ఏళ్ల బామ్మ ప్రియుడి కోసం వెతుకుతోంది. ఇటీవల ఆమె 39 ఏళ్ల ప్రియుడితో డేటింగ్ చేసి విడిపోయింది. అంతేకాదు.. ఇప్పుడే బ్రేకప్ చెప్పిన ఈ బామ్మ కొత్త ప్రియుడి కోసం అన్వేషిస్తున్నట్లు ఆమె ఓ ప్రకటన ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అమెరికాలోని న్యూ యార్క్ లో నివసిస్తున్న హట్టి రెట్రోజ్ అనే 83 ఏళ్ల బామ్మ నివసిస్తోంది. హట్టి రెట్రోజ్ అనే ఈ బామ్మ 48 ఏళ్ల వయస్సులో భర్త నుంచి విడాకులు తీసుకుంది. మొదట్లో డ్యాన్సర్ గా పనిచేసిన బామ్మ ఇప్పుడు లైఫ్ కోచ్, రచయితగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు, ముగ్గురు మనవలు ఉన్నారు. విడాకులు తీసుకున్న తర్వాత పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో అప్పటి నుంచి తనకంటే తక్కువ వయసున్న యువకులతో డేటింగ్ చేస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ వచ్చింది.

    ఇటీవల కొత్త బాయ్ ఫ్రెండ్ కోసం వెదుకుతూ.. నాకు నా లైఫ్ స్టైల్ ఎంతో నచ్చుతుంది. అందుకని నా శృంగార జీవితాన్ని తక్కువ వయసున్న యువకులతో ఎంజాయ్ చేస్తా.. వారికీ కూడా నాలో అదే నచ్చుతుంది అంటూ ఓ బోల్డ్ స్టేట్మెంట్ తో అందరికీ షాక్ ఇచ్చింది. ఇటీవల హట్టి ఇంతకు ముందు 39 ఏళ్ల వ్యక్తితో డేటింగ్ చేశాడు. వారిద్దరిలో అంతా బాగానే ఉంది కాని అబ్బాయి మరొక అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడని ఆమెకు తెలిసింది. ఇది తెలుసుకున్న హట్టి తట్టుకోలేకపోయింది. దీంతో మరో ప్రియుడి కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపింది. తాను వెతుకుతున్న వ్యక్తి వయస్సు 35 ఏళ్ల లోపు ఉండాలని తెలిపింది.

    దీంతో ఈమెతో డేటింగ్ చేయడానికి విపరీతంగా రిక్వెస్ట్ లు వస్తున్నాయి. లేటు వయస్సులో ఘాటు ప్రేమను పంచేందుకు సిద్ధంగా ఉన్నానంటూ పలు టీవీ ఛానల్స్ లో ప్రోగ్రామ్స్ ఇస్తున్న ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. హట్టి తన డేటింగ్ అనుభవం గురించి ఇలా చెప్పుకొచ్చింది. 85 సంవత్సరాల వయస్సులో కూడా తాను వ్యాయామంతో పాటు మంచి ఆహార నియమాలు పాటిస్తానని.. ప్రతీ రోజు స్విమ్మింగ్ కూడా చేస్తానని ఆమె చెప్పుకొచ్చింది. అబ్బాయిలతో డేటింగ్ చేయడమంటే తనకు చాలా ఇష్టమని ఆమె చెప్పింది.
    Published by:Veera Babu
    First published:

    Tags: Boy friend photo, Lovers, New york

    తదుపరి వార్తలు