Woman Aviator: అమెజాన్ వ్యవస్థాపకుడితో కలిసి అంతరిక్షానికి వెళ్లనున్న 82 ఏళ్ల వృద్ధురాలు.. ఆమె ఎవరంటే..

జెఫ్ బెజోస్, వాలీ ఫంక్

వెస్ట్రన్ టెక్సాస్ నుంచి ప్రారంభమయ్యే వీరి ప్రయాణం పది నిమిషాల పాటు ఉండనుంది. భూమి బోర్డర్ లైన్ గా చెప్పే కర్మన్ లైన్ పైన వరకు వీరి ప్రయాణం సాగనుంది. అంతరిక్షంలో కొద్ది సేపు ఫ్రీ ఫ్లోట్ అనుభూతిని ఎక్స్ పీరియన్స్ చేసిన తర్వాత తిరిగి ఈ క్యాప్సూల్ భూమికి రానుంది.

  • Share this:
కొన్ని సార్లు జీవితంలో మనం కోల్పోయినవన్నీ తిరిగి మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. దీనికి ఎన్నో సంఘటనలు తార్కాణంగా నిలిచాయి. తాజాగా వాలీ ఫంక్ అనే వృద్ధురాలు అంతరిక్షంలోకి వెళ్లే సంఘటన దీన్ని మరోసారి నిరూపిస్తోంది. 82 సంవత్సరాల వాలీ ఫంక్.. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌తో కలిసి అంతరిక్షంలోకి ప్రయాణం చేయనుంది. ఆయన సంస్థ బ్లూ ఆరిజిన్ ఈ మేరకు ప్రకటన చేసింది. ఫంక్‌కి ఇది అంతరిక్షంలో మొదటి యాత్ర. అయితే ఇది అరవై సంవత్సరాల కిందే ఆమె చేయాల్సింది కానీ కొద్దిలో తప్పిపోయింది. అరవైయేళ్ల క్రితం మెర్కురీ 13 ద్వారా అంతరిక్షంలోకి వెళ్లేందుకు వ్యోమగాములకు శిక్షణ అందించారు. అందులో స్థానం సంపాదించుకున్న మొదటి మహిళ వాలీ ఫంక్. 1960-1961లో దీనికి గాను ఆమె శిక్షణ కూడా పొందారు. కానీ ఆఖరి నిమిషంలో మహిళ అనే కారణం చూపి ఆమెను పక్కన పెట్టేశారు.

జులై 20న ఆమె అంతరిక్షంలోకి అడుగుపెట్టేందుకు జెఫ్ బెజోస్ సంస్థ ఏర్పాటు చేసిన న్యూ షెఫర్డ్ లాంఛ్ వెహికిల్‌లో ప్రయాణించనుంది. ఇందులో జెఫ్ బెజోస్‌తో పాటు అతడి సోదరుడు మార్క్, మరో వ్యక్తి ప్రయాణించనున్నారు. ఆ వ్యక్తి జెఫ్ నిర్వహించిన వేలంలో పాల్గొని ఈ సీటు కోసం 28 మిలియన్ల డాలర్లు చెల్లించారు. తాజాగా ఈ ముగ్గురితో కలిసి నేషనల్ ట్రాన్స్ పోర్ట్ సేఫ్టీ బోర్డ్ లో మొదటి మహిళ ఇన్ స్పెక్టర్, గుడ్ విల్ అంబాసిడర్ అయిన ఫంక్ కూడా చేరారు. దీని గురించి మాట్లాడుతూ.. నేను అస్సలు ఆగలేకపోతున్నా చాలా ఎక్సైటింగ్‌గా ఉంది అంటూ వివరించారు ఫంక్. దీనికి సంబంధించిన వీడియోను జెఫ్ బెజోస్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో కూడా పోస్ట్ చేశారు.

ఈ వీడియోలో భాగంగా తమ ట్రిప్ గురించి ఆమెకు వివరించిన జెఫ్ అక్కడ ల్యాండ్ అయ్యాక మీరు చెప్పే మొదటి మాట ఏంటి? అని అడిగారు. ''ఇది నా జీవితంలోనే గొప్ప సంఘటన అని చెబుతా అని ఆమె సమాధానం ఇచ్చారు. మెర్కురీ 13 గురించి కూడా చెబుతూ ఇది అన్ అఫిషియల్, ప్రైవేట్ ఫండెడ్ ప్రోగ్రాం. నాకు శిక్షణ ఇచ్చేటప్పుడు మగవారితో సమానంగా అన్ని నేర్పించారు. నేను బాగా, వారి కంటే వేగంగా చేస్తున్నానని చెప్పారు. ఆ తర్వాత ఆపేశారు. నాసా కోసం నాలుగు సార్లు అప్లై చేశాను. కానీ రాలేదు. నేను మహిళను కాబట్టి ఇది చేయలేనని చాలామంది చెప్పేవారు. మనం చేయాలనుకుంటే ఏదైనా చేయవచ్చని నేను చెప్పేదాన్ని.'' అని ఆమె వెల్లడించారు.

వెస్ట్రన్ టెక్సాస్ నుంచి ప్రారంభమయ్యే వీరి ప్రయాణం పది నిమిషాల పాటు ఉండనుంది. భూమి బోర్డర్ లైన్ గా చెప్పే కర్మన్ లైన్ పైన వరకు వీరి ప్రయాణం సాగనుంది. అంతరిక్షంలో కొద్ది సేపు ఫ్రీ ఫ్లోట్ అనుభూతిని ఎక్స్ పీరియన్స్ చేసిన తర్వాత తిరిగి ఈ క్యాప్సూల్ భూమికి రానుంది.
Published by:Shiva Kumar Addula
First published: