Husband Kills Wife: పండగ రోజు భార్యతో అతడు సెక్స్ చేయాలనుకున్నాడు. అందుకోసం వయాగ్రా మాత్ర వేసుకున్నాడు. కానీ శృంగారానికి భార్య ఒప్పుకోలేదు. అంతే.. అతడికి చిర్రెత్తుకొచ్చింది
సమాజంలో నిత్యం ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతుంటాయి. దాడులు, అత్యాచారాలు, హత్యలు.. ఇలా ఎన్నో దారుణాలు చూస్తూనే ఉన్నాం. కానీ కొన్ని ఘటనలు చాలా విచిత్రంగా ఉంటాయి. చిన్న కారణానికే ప్రాణాలు తీసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. తాజాగా ఇటలీలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. 80 ఏళ్లు వృద్ధుడు వయాగ్రా తీసుకొని భార్యతో శృంగారం చేయాలనుకున్నాడు. కానీ ఆమె నిరాకరించింది. అంతే అతడికి చిర్రెత్తుకొచ్చింది. బెడ్‌పైనే భార్యను హత్య చేశాడు. కత్తితో కసిదీరా పొడిచి..ఆమెను దారుణంగా హత్య చేశాడు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. 80 ఏళ్ల విటో కాంగిని, 61 ఏళ్ల నటాలియా కిరిచోక్ భార్యా భర్తలు. విటో కాంగిని ఇటలీకి చెందిన వ్యక్తి కాగా.. నటాలియా స్వదేశం ఉబ్జెకిస్థాన్. వీరిద్దరు పెళ్లి చేసుకొని ఇటలీలోని ఫనోని గ్రడారాలో ఉంటున్నారు. భార్య కంటే భర్త వయసు 20 ఎక్కువగా ఉన్నా.. వీరి దాంపత్య జీవితం అన్యోన్యంగానే సాగింది. కానీ డిసెంబరు 25న ఘోరం జరిగింది. క్రిస్మస్ సందర్భంగా అందరిలానే వీరిద్దరు ఫెస్టివల్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ రోజు మరింత మధురంగా ఉండాలనే ఉద్దేశంతో భార్యతో సెక్స్ చేయాలనుకున్నాడు విటో కాంగిని. అందుకు నటాలియా కూడా ఒప్పుకుంది. వెంటనే అతడు వయాగ్రా వేసుకున్నాడు. అనంతరం కాసేపటి తర్వాత భార్య దగ్గరకు వెళ్లాడు. కానీ ఆమె మనసు మార్చుకుంది. సెక్స్ చేసేందుకు నిరాకరించింది. విటో కాంగిని ఎన్నోసార్లు బతిమాలాడు. ఐనా ఆమె వినలేదు. దాంతో విటోకాంగినికి చిర్రెత్తుకొచ్చి.. భార్యను కత్తితో పొడిచాడు. ఎదలపై బలమైన పోట్లు పొడవడంతో ఆమె స్పాట్లోనే మరణించిది.
అనంతరం డెడ్‌బాడీని నేలపై విసిరేసి.. రాత్రి మంచంపై ప్రశాంతంగా పడుకున్నాడు విటో కాంగిని. ఆ మరుసటి రోజు ఉదయం.. ఏమీ జరగనట్లుగా ఉన్నాడు. ఉదయం, మధ్యాహ్నం రెండు సార్లు కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లాడు. అనంతరం పక్కింట్లో ఉండే వ్యక్తికి జరిగిన విషయాన్ని చెప్పాడు. పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరాడు. కానీ వారు భయపడిపోయారు. అనవసర విషయంలో జోక్యమెందుకు..? అని పట్టించుకోలేదు. ఆ రోజు సాయంత్రం ఓ మహిళ నటాలియా కోసం వచ్చింది. ఒకసారి నటాలియాను బయటకు పిలుస్తారా? అని అడగడంతో.. ఆమె రాదు చనిపోయింది. నేనే చంపేశాను అని విటో కాంగిని చెప్పాడు. దాంతో ఆ మహిళ కూడా భయపడిపోయి.. అక్కడి నుంచి పరుగులు తీసింది.
చివరకు ఆ రోజు రాత్రి.. నటాలియా గతంలో చెఫ్‌గా పనిచేసిన రెస్టారెంట్‌కు కాల్ చేసి జరిగిన విషయాన్ని వివరించాడు విటో కాంగిని. ఆ హోటల్ యజమానితో నటాలియాకు వివాహేతర సంబంధం ఉందని అతడికి అనుమానం ఉంది. అందుకే తనతో సెక్స్ చేసేందుకు ఆమె నిరాకరిస్తోందని భావిస్తున్నాడు. ఆ క్రమంలో నేరుగా అతడికి కాల్ చేసి జరిగిన విషయం చెప్పాడు. మీ ప్రియురాలు చనిపోయింది..ఇకపై మీరిద్దరు కలవలేరని చెప్పి ..ఫోన్ కట్ చేశాడు. ఆ వ్యక్తి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. పోలీసులు రంగంలోకి దిగి.. ఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడే ఉన్న విటో కాంగినిని అరెస్ట్ చేశారు. మీ భార్యను ఎందుకు చంపావు అని పోలీసులు అడగడంతో.. వయాగ్రా మాత్ర తీసుకున్నాక, సెక్స్‌కు నిరాకరిచిందని.. అందుకే చంపేశానని నేరాన్ని అంగీకరించాడు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.