8 WEEKS PREMATURE BABY GETS WITH THICK BROWN HAIR DAY BY DAY HIS PHOTOS GO VIRAL ON SOCIAL MEDIA NK
Viral News: నెల తక్కువ బుడ్డోడు.. విపరీతంగా పెరిగిపోతున్న జుట్టు... ఎందుకంటే...
నెల తక్కువ బుడ్డోడు.. విపరీతంగా పెరిగిపోతున్న జుట్టు (Image credit - Shannon Ayres / SWNS.COM)
Viral News: నెల తక్కువ పిల్లాడంటే సర్లే అనుకోవచ్చు... కానీ జుట్టు చాలా వేగంగా పెరగడం అనేది అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ ఫొటో చూసి నెటిజన్లు షాకవుతున్నారు... అంత జుట్టు ఉందా... నిజమేనా అంటున్నారు.
Viral News: మనకు అంతగా అవగాహన లేని కొన్ని సంఘటనలు అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటాయి. వాటిని తెలుసుకున్నాక... అవునా... అలా కూడా జరుగుతుందా అనిపించడం సహజం. ఉత్తర ఐర్లాండ్‌లో జాక్సన్ జేమ్స్ అయర్స్... మిగతా పిల్లల్లా 9 నెలల కాకుండా.... 8 వారాలు ముందే పుట్టేశాడు. ప్రస్తుతం 3 నెలల వయసున్న ఆ పిల్లాడికి జుట్టు బాగా పెరిగిపోతోంది. పేరెంట్స్ ఆశ్చర్యపోతున్నారు. షాకింగ్ విషయమేంటంటే... ఆ జుట్టు తలపైనే కాదు... ఇతర శరీర భాగాల పైన కూడా వేగంగానే పెరుగుతోందట. ఎందుకంటే ఆ పిల్లాడికి అరుదైన అనారోగ్య సమస్య వచ్చింది. దాన్ని హైపెర్ ఇన్సూలినిజమ్ (Hyperinsulinism) అంటారు. దీని కారణంగా... ఆ పిల్లాడికి తరచూ డయాజోజైడ్ (Diazoxide) అనే మందు ఇస్తూ... ఆ పిల్లాడి షుగర్ లెవెల్స్ ఆరోగ్యకరంగా ఉండేలా చెయ్యాల్సి ఉంటుంది. ఇలా ఇచ్చే మందు వల్ల ఓ సైడ్ ఎఫెక్ట్ వచ్చింది. అదే జుట్టు పెరగడం. ఫలితంగా మిగతా పిల్లల కంటే ఎక్కువ వేగంగా జుట్టు పెరుగుతోంది.
అదేం సమస్య?
"హైపర్ ఇన్సూలినిజమ్ అనే అనారోగ్యం ప్రతి 30వేల మంది పిల్లల్లో ఒకరికి వస్తుంది. ఇది ఉన్న పిల్లల్లో పాంక్రియాస్ విపరీతంగా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా షుగర్ లెవెల్స్ అత్యంత తక్కువకు పడిపోతాయి. మరి షుగర్ లెవెల్స్ పెంచడం కోసం పిల్లాడికి తరచూ ఆహారం పెడుతూనే ఉండాలి. అలాగే డయాజోజైడ్ మందు ఇస్తూ ఉండాలి. ఈ మందు ఎవరు వాడినా ఈ జుట్టు పెరిగే సమస్య ఉంటుందట. పిల్లాడి తల, చేతులు, కాళ్లపై జుట్టు బాగా పెరిగిపోయింది" అని తల్లి షానన్ అయిరెస్ చెప్పినట్లు డైలీ మెయిల్ తెలిపింది.
"పిల్లాణ్ని చూసినప్పుడు... ఆ జుట్టు చూసి చాలా మంది షాకవుతున్నారు. కొందరైతే... త్వరలోనే పిల్లాణ్ని హెయిర్‌కట్ కోసం తీసుకెళ్లాలి అంటున్నారు" అని ఆమె వివరించింది. "తను పుట్టాక... తన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం మొదలుపెట్టాను. మిగతా పిల్లల తల్లిదండ్రుల లాగే... నాకూ వాణ్ని ప్రపంచానికి చూపించాలి అనిపించింది. ఐతే... వాడి ఫొటో ఇలా వైరల్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. వాడి జుట్టు వల్లే వైరల్ అయ్యాడు." అని ఆమె వివరించింది.
"సోషల్ మీడియాలో ఒక్కోసారి మంచి నుంచి కూడా చెడు ఎదురవుతుంది. కొంత మంది వాడి కను బొమ్మలపై డ్రాయింగ్ వేస్తున్నారు. అలాగే... జుట్టుకి ఫిల్టర్ ఉన్నట్లు ఫొటోషాప్ ఎడిటింగ్ చేస్తున్నారు. అవన్నీ సరదాగానే ఉంటున్నాయి. మొత్తంమ్మీద రియాక్షన్లు బాగానే ఉంటున్నాయి" అని షానన్ తెలిపారు.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.