Home /News /international /

8 DEAD SEVERAL INJURED IN CROWD SURGE AT TRAVIS SCOTT ASTROWORLD MUSIC FESTIVAL IN HOUSTON IN TEXAS IN US MKS

అమెరికాలో ఘోరం: Astroworld music festival తొక్కిసలాటలో 8 మంది దుర్మణం -రెండు విషాదాలు

హ్యూస్టన్ మ్యూజిక్ ఫెస్ట్ తోపులాటలో 8మంది మృతి

హ్యూస్టన్ మ్యూజిక్ ఫెస్ట్ తోపులాటలో 8మంది మృతి

సంగీత అభిమానులకు ఒకే రోజు రెండు షాకింగ్ వార్తలు. దక్షిణ అమెరికా గాయని మరీలియా విమాన ప్రమాదంలో దుర్మణం చెందగా, ఉత్తర అమెరికాలోని యూఎస్ఏలో ఓ మ్యూజిక్ ఫెస్ట్ లో ఊపిరాడక 8 మంది చనిపోయారు. అమెరికా చరిత్రలోనే అత్యంత విషాదకర సంఘటనల్లో ఒకటి శుక్రవారం టెక్సాస్ లో జరిగింది..

ఇంకా చదవండి ...
సంగీత అభిమానులకు ఒకే రోజు రెండు షాకింగ్ వార్తలు. దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ కు చెందిన ప్రఖ్యాత గాయని మరీలియా విమాన ప్రమాదంలో దుర్మణం చెందగా, ఉత్తర అమెరికాలోని యూఎస్ఏలో ఓ మ్యూజిక్ ఫెస్ట్ లో ఊపిరాడక 8 మంది చనిపోయారు. మ్యూజిక్ ఫెస్టివల్స్ కు సంబంధించి అమెరికా చరిత్రలోనే అత్యంత విషాదకర సంఘటనల్లో ఒకటి ఇవాళ టెక్సాస్ లో జరిగింది. భారతీయులు ఎక్కువగా నివసించే హ్యూస్టన్ సిటీలోనే ఈ ఘటన జరగడంతో మృతుల్లో ఎవరైనా భారతీయులు ఉన్నారా? అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హ్యూస్టన్ సిటీ ఫైర్ డిపార్ట్ మెంట్ చీఫ్ శామ్యూల్ పెనా, ఇతర శాఖల అధికారులు, స్థానిక మీడియా చెప్పిన వివరాలిలా ఉన్నాయి...

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఆస్ట్రో వరల్డ్ మ్యూజిక్ ఫెస్టివల్ విషాదాంతంగా ముగిసింది. టెక్సాస్ లోని హ్యూస్టన్ సిటీలో జరిగిన మ్యూజిక్ ఫెస్ట్ లో తోపులాట తలెత్తడంతో ఊపిరాడక జనం ప్రాణాలు కోల్పోయారు. హ్యూస్టన్ సిటీలోని ఎన్ఆర్జీ పార్క్ లో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. జనం ఒక్కసారిగా వేదికపైపునకు నెట్టుకుని రావడంతో తోపులాట పరిస్థితి తలెత్తిందని,. విపరీతమైన రాపిడి, కదల్లేని పరిస్థితిలో స్టేజీ ముందు భాగంలో ఉన్న వారు ఊపిరి పీల్చుకోలేకపోయారని, శ్వాస అందక ఇబ్బంది పడుతూ.. ఒక్కొక్కరుగా కుప్పకూలిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

హ్యూస్టన్ సిటీలో ఆస్ట్రోవరల్డ్ మ్యూజిక్ ఫెస్ట్ తోపులాట ఘటనలో మొత్తం 8 మంది చనిపోయారని, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారని, చికిత్స పొందుతోన్న వాళ్లలో 17 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు. అమెరికాకే చెందిన పాపులర్ గాయకుడు ట్రవిస్ స్కాట్ (Travis Scott) ఆస్ట్రోవరల్డ్ ఫెస్టివల్ ( Astroworld Festival) పేరుతో ఏటేటా మ్యూజిక్ కాన్సెర్ట్ నిర్వహిస్తుంటాడు. కరోనా కారణంగా రెండేళ్లు వాయిదా పడిన ఈ ఫెస్ట్ మళ్లీ ఈ నవంబర్ 5న మొదలైంది. తొలి రోజే తోపులాల కారణంగా 8మంది చనిపోవడంతో మ్యూజిక్ ఫెస్టివల్ రద్దయిపోయింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది..
Published by:Madhu Kota
First published:

Tags: Accident, Music, USA

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు