హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

సోమాలియాలో బాంబు పేలుడు... 73 మంది మృతి

సోమాలియాలో బాంబు పేలుడు... 73 మంది మృతి

సోమాలియాలో కారు బాంబు పేలుడు

సోమాలియాలో కారు బాంబు పేలుడు

మొగదిషులో ఎంతో రద్దీగా ఉండే సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్ద ఈ పేలుడు జరిగింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆఫ్రికా దేశం సోమాలియాలో భారీ పేలుడు చోటుచేసుకుంది. సోమాలియా రాజధాని మొగదిషులో కారు బాంబు పేలింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 73 మంది చనిపోయారు. 73 మంది మృతదేహాలను గుర్తించినట్లు మేయర్‌ ఒమర్‌ మహమూద్‌ తెలిపారు. మృతుల్లో చాలా మంది స్థానిక యూనివర్శిటీకి చెందిన విద్యార్థులేనని చెప్పారు. మరో వంద మంది వరకు గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో అనేకమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొగదిషులో ఎంతో రద్దీగా ఉండే సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్ద ఈ పేలుడు జరిగింది. ఇక్కడి పన్ను వసూలు కేంద్రం లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. మరోవైపు ఉగ్రదాడిని సోమాలియ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అమాయక ప్రజలపై ఉగ్రవాదులు ఇలాంటి దాడులు చేయడం సరికాదంటున్నారు.


First published:

Tags: Bomb blast, Terror attack, Terrorists

ఉత్తమ కథలు