US Elections 2020: ట్రంప్‌కు షాక్ ఇవ్వనున్న భారతీయ అమెరికన్లు..బిడెన్ వైపే మెజారిటీ మొగ్గు..

గత ఎన్నికల్లో కూడా భారతీయ అమెరికన్లు డెమోక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు 77 శాతం మంది ఓట్లు వేయగా.. ట్రంప్‌కు కేవలం 16 శాతం మంది మాత్రమే ఓట్లు వేశారని 2016లో నేషనల్‌ ఏసియన్‌ అమెరికన్‌ సర్వే నివేదికలో తెలిపింది.

news18-telugu
Updated: October 15, 2020, 12:14 AM IST
US Elections 2020: ట్రంప్‌కు షాక్ ఇవ్వనున్న భారతీయ అమెరికన్లు..బిడెన్ వైపే మెజారిటీ మొగ్గు..
డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్
  • Share this:
2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం పూర్తి స్థాయిలో ఊపందుకుంది ఉంది. రిపబ్లికన్, డెమొక్రాట్ పార్టీ అధ్యక్ష మరియు ఉపాధ్యక్ష అభ్యర్థులు తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. అటు సర్వేలు కూడా ఉత్కంఠను రేపుతున్నాయి. తాజాగా ఓ సర్వేలో భారత అమెరికన్ ఓటర్లు డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారని వెల్లడించింది. ఇండియన్ అమెరికన్ యాటిట్యూడ్ సర్వే (ఐఎఎఎస్) ప్రకారం, అధ్యక్ష ఎన్నికల్లో బిడెన్కు ఓటు వేసేందుకు భారతీయ అమెరికన్లలో 72 శాతం మంది మొగ్గు చూపగా. అదే సమయంలో, భారతీయ అమెరికన్లలో 22 శాతం మంది మాత్రమే డోనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేసేందుకు మొగ్గుచూపారని తేల్చింది.

936 మంది భారతీయ అమెరికన్లతో సంభాషణల ఆధారంగా ఈ సర్వే జరిగింది. సెప్టెంబర్ మాసం మొదటి 20 రోజుల్లో, ఈ వ్యక్తులు ఆన్‌లైన్ ద్వారా సంభాషించారు. ఓటు బ్యాంకులో భారతీయ అమెరికన్లు డెమొక్రాట్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతుగా భారతీయ అమెరికన్ సమాజం నిలిచి ఉన్నట్లు సర్వే వెల్లడించింది. సర్వే ప్రకారం.. 72 శాతం మంది జోబిడెన్‌కు ఓటు వేస్తామని వెల్లడించగా, 22 శాతం మంది ట్రంప్‌కు ఓటు వేయనున్నట్లు ప్రకటించారు. గత ఎన్నికల్లో కూడా భారతీయ అమెరికన్లు డెమోక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు 77 శాతం మంది ఓట్లు వేయగా.. ట్రంప్‌కు కేవలం 16 శాతం మంది మాత్రమే ఓట్లు వేశారని 2016లో నేషనల్‌ ఏసియన్‌ అమెరికన్‌ సర్వే నివేదికలో తెలిపింది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, భారతీయ అమెరికన్లు ఎన్నికలలో ఓటు వేయడానికి భారత-అమెరికా సంబంధాలను పెద్దగా పట్టించుకోవడం లేదని ఈ సర్వేలో వెల్లడైంది. నిజానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రసంగాల్లో ప్రధాని నరేంద్ర మోడీతో స్నేహాన్ని పదే పదే గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో, భారతదేశానికి ఆయన మద్దతు తెలుపుతున్నారు. కానీ భారతీయ సంతతికి చెందిన చాలా మంది అమెరికన్లు అమెరికా తమకు ఉద్యోగాలు చేసుకోవడానికి, సౌకర్యంగా నివసించడానికి అనుకూలంగా ఉండాలని భావిస్తున్నట్లు మెజారిటీ భారతీయ అమెరికన్లు భావించారు. రిపబ్లికన్ల కంటే అమెరికా -భారత్‌ల మధ్య సంబంధాలను డెమోక్రాట్లు సమర్థవంతంగా నిర్వహిస్తారని అధిక శాతం మంది ఆశిస్తున్నట్లు సర్వే స్పష్టం చేసింది.

ఫలిస్తున్న కమలా హారిస్ అభ్యర్థిత్వం

ఇక డెమెక్రాట్ల వైపు భారతీయ అమెరికన్లు మొగ్గు చూపడం పట్ల కమలా హారిస్‌కు పాత్ర ఉంది. ఆమె తన ప్రసంగాల్లో తల్లి గురించి అలాగే భారతీయ ఆహారాన్నిగురించి ప్రస్తావిస్తున్నారు. డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్, భారతీయ-అమెరికన్ల వైపు మొగ్గు చూపడంలో పెద్ద పాత్ర పోషించారని సర్వే పేర్కొంది. ఇదిలా ఉంటే 2018 నాటికి అమెరికాలో సుమారు 4.16 మిలియన్ల భారతీయ సంతతికి చెందిన వారు ఉండగా, వారిలో 2.62 మిలియన్లు అమెరికా పౌరసత్వం పొందారు. వారిలో 1.9 మిలియన్ల పౌరులు వచ్చే ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హతను కలిగి ఉన్నారు. అంటే మొత్తం జనాభాలో వీరు 0.82 శాతంగా ఓటింగ్‌కు అర్హులుగా ఉన్నారు.
Published by: Krishna Adithya
First published: October 15, 2020, 12:14 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading