హోమ్ /వార్తలు /international /

మసాజ్ కోసం వెళ్లి బట్టలు విప్పాడు..అమ్మాయి చేయి తగలగానే చనిపోయాడు.. ఏం జరిగింది?

మసాజ్ కోసం వెళ్లి బట్టలు విప్పాడు..అమ్మాయి చేయి తగలగానే చనిపోయాడు.. ఏం జరిగింది?

Thailand massage death: ఓ లేడీ మసాజర్ వెళ్లి అతడికి మసాజ్ చేసింది. వెల్లకిలా తిరగండని ఆమె కోరగా.. అతడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఎంత పలిచినా ఉలుకూ పలుకూ లేదు

Thailand massage death: ఓ లేడీ మసాజర్ వెళ్లి అతడికి మసాజ్ చేసింది. వెల్లకిలా తిరగండని ఆమె కోరగా.. అతడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఎంత పలిచినా ఉలుకూ పలుకూ లేదు

Thailand massage death: ఓ లేడీ మసాజర్ వెళ్లి అతడికి మసాజ్ చేసింది. వెల్లకిలా తిరగండని ఆమె కోరగా.. అతడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఎంత పలిచినా ఉలుకూ పలుకూ లేదు

    పర్యాటక పరంగా ప్రసిద్ధి చెందిన దేశాల్లో థాయ్‌లాండ్ (Thailand) కూడా ఒకటి. ఇక్కడి బీచ్‌లు, ప్రకృతి సోయగాలతో పాటు నైట్ లైఫ్‌ను ఎంజాయ్ చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా పురుషులకు ఈ దేశం చాలా నచ్చుతుంది. చాలా మంది పురుషులు.. తమ భార్యాపిల్లలను వదిలిపెట్టి, ఇక్కడ సరదాగా గడిపేందుకు ఇష్టపడతారు. కొన్ని రోజుల పాటు ఎంజాయ్ చేసిన తర్వాత తిరిగి తమ దేశం వెళ్లిపోతారు. థాయ్‌లాండ్‌లో అడల్ట్ స్టైల్ నైట్ లైఫ్ (Adult style nightlife) గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. థాయ్‌లాండ్‌కు వెళ్లి బాడీ మసాజ్‌ను ఆస్వాదించకపోతే అది ట్రిప్పే కాదని భావిస్తారు. మసాజ్‌ పార్లర్‌కు వెళ్లకుండా.. మరి అంత దూరం వెళ్లి ఏ చూశావు? ఏం చేశావు? అని సెటైర్లు వేసేవారు చాలా మందే ఉంటారు. అక్కడ థాయ్ మసాజ్ అంత ఫేమస్ మరి..! ఇతే ఇలానే థాయ్ మసాజ్‌ (Thai Massage) చేయించుకునేందుకు వెళ్లిన ఓ వ్యక్తి కుప్పకూలాడు. మసాజ్‌ చేస్తుండగా చనిపోయాడు.

    Elon Musk : ఆయనో తోలుబొమ్మ..బైడెన్ పై టెస్లా సీఈవో సంచలన వ్యాఖ్యలు

    థాయ్‌లాండ్ మీడియా కథనం ప్రకారం.. బ్రిటన్‌ (Britain)కు చెందిన 70 ఏళ్ల వ‌ద్ధుడు హాలీ డేస్‌ను ఎంజాయ్ చేసేందుకు థాయ్‌లాండ్ వెళ్లాడు. కొన్ని రోజులు క్రితం పట్టాయా (Pattaya City)కు వెళ్లి.. అక్కడి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఓ మసాజ్ పార్లర్‌కు వెళ్లి మసాజ్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం హ్యాపీ ఎండింగ్ అనే మసాజ్ పార్లర్‌లో మసాజ్ థెరపీ సేవలను బుక్ చేసుకున్నాడు. అక్కడికి వెళ్లిన తర్వాత బట్టలు విప్పి టేబుల్‌పై బోర్లా పడుకోమని చెప్పారు. అతను ఇలానే చేశారు. కాసేపటి తర్వాత ఓ లేడీ మసాజర్ వెళ్లి అతడికి మసాజ్ చేసింది. ఇప్పుడు వెల్లకిలా తిరగండని ఆమె కోరగా.. అతడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఎంత పలిచినా ఉలుకూ పలుకూ లేదు. శ్వాస కూడా ఆడడం లేదు. అప్పటికే అతడు మరణించాడు.

    ఆ వ్యక్తికి మసాజ్ చేసిన మహిళ పేరు మిస్ ఒరయా. మొదట్లో అతడు బాగానే ఉన్నాడు. మీకు కంఫర్ట్‌గానే ఉందా? అని అడిగితే.. బాగానే ఉందని సమాధానం చెప్పాడు. ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. వెల్లకిలా పడుకోండని ఆమె కోరితే.. అతడి నుంచి స్పందన లేదు. ఆమె భయపడిపోయి వెంటనే కేకలు వేసింది. సిబ్బంది హుటాహుటిన వచ్చి పరిశీలించారు. అక్కడి వైద్య బృందం సీపీఆర్ అందించినా ఫలితం దక్కలేదు. అతడు చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు.

    Viral Video: వామ్మో! వట్టి చేతులతో భారీ కింగ్ కోబ్రాను వంచేశాడు.. దయచేసి ఇలా చేయకండి

    సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని టవల్‌తో కప్పి..పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఐతే అతడు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. ఆ వ్యక్తి వద్ద ఎలాంటి ఐడీ కార్డు లభించలేదు. మొదటి సారిగా ఆ పార్లర్‌కు రావడంతో.. అతడెవరో వారికి కూడా తెలియదు. విదేశీయుడని మాత్రమే తెలుసు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఐడీ కార్డు కూడా లేకపోవడంతో.. అతడి వివరాలు తెలుసుకోవడం పోలీసులకు కష్టంగా మారింది. అంతేకాదు అసలు ఆ వ్యక్తి ఎలా మరణించాడో అంతు చిక్కడం లేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత దీనిపై క్లారిటీ వస్తుంది. ఆ రిపోర్టు కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు.

    First published:

    ఉత్తమ కథలు