ఆపిల్ ఎయిర్ పాడ్ మింగేసిన బుడతడు...ఏం జరిగిందంటే...

అట్లాంటాలో ఏడు సంవత్సరాల బాలుడు అనుకోకుండా ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను మింగేశాడు. దీంతో అతని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకువెళ్లి డాక్టర్లకు చూపించారు. డాక్టర్లు తీసిన ఎక్స్‌రే తీయగా, ఎయిర్‌పాడ్‌ కడుపులో ఎటు కదలకుండా ఉండటంతో పాటూ చెక్కుచెదరకుండా ఉందని తేలింది.

news18-telugu
Updated: January 4, 2020, 10:40 PM IST
ఆపిల్ ఎయిర్ పాడ్ మింగేసిన బుడతడు...ఏం జరిగిందంటే...
బాలుడి కడుపులో యాపిల్ ఎయిర్ పాడ్స్ (Facebook)
  • Share this:
క్రిస్మస్ గిఫ్ట్‌గా వచ్చిన ఎయిర్‌పాడ్‌ను ఓ ఏడేళ్ల బాలుడు మింగడం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే అమెరికాలోని అట్లాంటాలో ఏడు సంవత్సరాల బాలుడు అనుకోకుండా ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను మింగేశాడు. దీంతో అతని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకువెళ్లి డాక్టర్లకు చూపించారు. డాక్టర్లు తీసిన ఎక్స్‌రే తీయగా, ఎయిర్‌పాడ్‌ కడుపులో ఎటు కదలకుండా ఉండటంతో పాటూ చెక్కుచెదరకుండా ఉందని తేలింది. డాక్టర్లు ఎయిర్ పాడ్ దానంతట అదే బయటకు వస్తుందని తేల్చి చెప్పారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే బాలుడు ఎయిర్‌పాడ్‌ను మింగిన తర్వాత.. ఎలాంటి అనారోగ్యానికి గురికాలేదు. ప్రస్తుతం ఆ బాలుడు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ఎయిర్‌పాడ్‌ను ఓ వ్యక్తి మింగడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది కూడా తైవాన్‌కు చెందిన ఓ యువకుడు అనకోకుండా ఎయిర్‌పాడ్‌ను మింగేశాడు. అతడు కూడా ఎలాంటి ప్రమాదానికి గురికాలేదు.

First published: January 4, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు