బంగ్లాదేశ్‌లో విషాదం : గ్యాస్ పైప్ లైన్ లీకై ఏడుగురి మృతి

భవనం కూలిపోయి గోడలు మీద పడటం వల్లే వారంతా చనిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

news18-telugu
Updated: November 17, 2019, 7:06 PM IST
బంగ్లాదేశ్‌లో విషాదం : గ్యాస్ పైప్ లైన్ లీకై ఏడుగురి మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఐదంతస్తుల ఓ భవనంలో గ్యాస్ పైప్‌లైన్ లీకై పేలుడు సంభవించడంతో ఏడుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒక చిన్నారి,ఇద్దరు మహిళలు ఉన్నారు. భవనం కూలిపోయి గోడలు మీద పడటం వల్లే వారంతా చనిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో గ్యాస్ లీకేజీ అయినట్టు అనుమానిస్తున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

First published: November 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...