Changes In Twitter : ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ (Elon Musk) దిగ్గజ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (Twitter) సొంతం చేసుకొని వారం రోజులు గడుస్తోంది. ఈ 7 రోజుల్లోనే మస్క్ ట్విట్టర్లో ఏడు మార్పులు తీసుకొచ్చారు. భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపు, బ్లూ టిక్ మార్క్ కోసం 8 డాలర్లు, కంటెంట్ కౌన్సిల్, అడ్వర్టైజింగ్, హోమ్ పేజీ వంటి మార్పులను ఈ కొత్త బాస్ తీసుకొచ్చారు. ఆ మార్పులపై ఇప్పుడో లుక్కేద్దాం.
8 డాలర్లు
ట్విట్టర్లో బ్లూ టిక్ వెరిఫికేషన్ కోసం 8 డాలర్లు ఛార్జ్ చేస్తానని మస్క్ ప్రకటించారు. దేశాన్ని బట్టి ఈ ఫీజు మారే అవకాశం ఉంది. ఈ బ్లూ టిక్ పెయిడ్ ఫీచర్‌తో అకౌంట్లకు రిప్లై, సెర్చ్, మెన్షన్ వంటి ఫీచర్లలో ప్రాధాన్యత లభిస్తుంది. అలానే లాంగ్ వీడియోలు, ఆడియోలను కూడా పోస్ట్ చేసుకోవచ్చు. లాభాల్లో లేని ట్విట్టర్ ప్రాఫిట్స్ పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మస్క్ తెలిపారు.
లేఆఫ్స్
మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన మొదటి రోజే సీఈఓ పరాగ్ అగర్వాల్‌తో పాటు మిగిలిన ముగ్గురు టాప్ ఎగ్జిక్యూటివ్స్‌ను తొలగించారు. మళ్లీ నవంబర్ 4 నుంచి తన ట్విట్టర్ ఉద్యోగులను భారీ ఎత్తున తొలగించడం ప్రారంభించారు. ట్విట్టర్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల తొలగింపుకు సంబంధించి మస్క్ ఒక ట్వీట్ కూడా చేశారు. కంపెనీ రోజుకు 4 మిలియన్ల డాలర్లు కంటే ఎక్కువ నష్టపోతున్నప్పుడు ఉద్యోగులను తొలగించడం తప్ప మరో మార్గం లేదన్నారు.
అడ్వర్టైజర్లు
ట్విట్టర్ మస్క్ చేతిలోకి వచ్చాక.. కంటెంట్ మోడరేషన్‌తో సహా కంటెంట్ విషయంలో భారీ మార్పులు వచ్చాయి. దీంతో ఒత్తిడికి లోనైనా జనరల్ మోటార్స్, జనరల్ మిల్స్, ఆడి ఆఫ్ అమెరికా, ఓరియో మేకర్ మోండెలెజ్ ఇంటర్నేషనల్, ఫైజర్ ఇంక్, ఫోర్డ్ వంటి కార్పొరేట్ అడ్వర్టైజర్స్ ట్విట్టర్‌కు దూరమయ్యారు. వారు ట్విట్టర్లో ప్రకటన వ్యయాన్ని నిలిపివేశారు.
కంటెంట్ మోడరేషన్
ట్విట్టర్ అన్ని కోణాల్లో వివిధ రకాల వ్యూ పాయింట్స్‌తో 'కంటెంట్ మోడరేషన్ కౌన్సిల్'ను ఏర్పాటు చేస్తుందని మస్క్ చెప్పారు. అన్ని కంటెంట్ సంబంధిత నిర్ణయాలకు కౌన్సిల్ జవాబుదారీగా ఉంటుందని, ఆ కౌన్సిల్ సమావేశానికి ముందు ఏ ఖాతా పునరుద్ధరణ కూడా జరగదని ఆయన చెప్పారు.
పే పర్ వ్యూ
పే పర్ వ్యూ వీడియో కంటెంట్‌ను యూజర్లు పోస్ట్ చేసేలా ఒక ఆప్షన్ తీసుకురావాలని మస్క్ ఆల్రెడీ ప్లాన్ చేశారు. ఈ ఆప్షన్‌తో ఈ తరహా వీడియోలను పోస్ట్ చేసిన వారు, వాటిని వీక్షించిన వారి నుంచి ట్విట్టర్ ఫీజు వసూలు చేస్తుంది.
వైన్ రీబూట్
టిక్‌టాక్ లాంటి షార్ట్-వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ అయిన వైన్ (Vine)ను తిరిగి తీసుకురావాలని మస్క్ నిర్ణయం తీసుకున్నారు. ట్విటర్ ఇంజనీర్లను వైన్ యాప్ తిరిగి తీసుకురావాలని ఆదేశించారు. ఈ సంవత్సరంలో అది రీ లాంచ్ అవ్వచ్చు.
హోమ్‌పేజీ
ట్విట్టర్ సైట్‌ను సందర్శించే లాగవుట్ యూజర్లను హోమ్‌పేజీ ట్రెండింగ్ ట్వీట్లు, వార్తా కథనాలను చూపించే ఎక్స్ప్లోర్ పేజీకి రీడైరెక్ట్ చేసేలా మస్క్ ఇంజనీర్లను అభ్యర్థించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.