Earthquake : అలస్కాలో భారీ భూకంపం... సునామీ హెచ్చరిక జారీ

ఎవరు ఊహిస్తారు అంత పెద్ద భూకంపం వస్తుందని... సడెన్‌గా వచ్చింది. ఇప్పుడు సుమామీ టెన్షన్ పట్టుకుంది.

news18-telugu
Updated: July 22, 2020, 1:24 PM IST
Earthquake : అలస్కాలో భారీ భూకంపం... సునామీ హెచ్చరిక జారీ
అలస్కాలో భారీ భూకంపం... సునామీ హెచ్చరిక జారీ (credit - twitter)
  • Share this:
అమెరికా రాష్ట్రం అలస్కాలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.8గా నమోదైంది. అధికారులు వెంటనే సునామీ హెచ్చరిక జారీ చేశారు. ఈ భూకంప కేంద్రం... అలస్కాకు నైరుతీలో... 500 మైళ్ల దూరంలో ఉంది. పెర్రీవిల్లే కేంద్రంగా ఇది వచ్చినట్లు అమెరికా జియొలాజికల్ సర్వే తెలిపింది. సహజంగా రిక్టర్ స్కేలుపై 7 కంటే ఎక్కువ తీవ్రత ఉంటే... వాటిని భారీ భూకంపాలుగా చెబుతారు. ఎందుకంటే... తీవ్రత 7 కంటే ఎక్కువగా ఉంటే... ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. భారీ ప్రాణనష్టం కూడా కలిగే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుత భూకంపానికి సంబంధించి పూర్తి వివరాలు రావాల్సి ఉంది. మొత్తం 300 కిలోమీటర్లలో ప్రజలకు సునామీ హెచ్చరిక జారీ చేశారు.








మొన్ననే గూగుల్... భూకంపాల్ని ముందే గుర్తించే టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నామని చెప్పింది. ఆ టెక్నాలజీతో భూకంపం రాబోయే ముందే కనిపెట్టి... క్షణాల్లో అప్రమత్తం చెయ్యగలమని చెప్పింది. అదే టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులో ఉండి ఉంటే... అలస్కాలో భూకంపాన్ని ముందే గుర్తించేవాళ్లు.
Published by: Krishna Kumar N
First published: July 22, 2020, 1:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading