Home /News /international /

6TH LAUNCH IN 2022 NORTH KOREA FIRES ANOHER 2 SUSPECTED MISSILES PVN

Missiles Test : తగ్గేదే లే అంటున్న కిమ్..మరోసారి క్షిపణి ప్రయోగాలు..ఈ నెలలోనే ఆరోసారి

కిమ్ జోంగ్ ఉన్(ఫైల్ ఫొటో)

కిమ్ జోంగ్ ఉన్(ఫైల్ ఫొటో)

Kim jong un : ఉద్రిక్తతలకు ఆజ్యం పోసేలా ఉత్తర కొరియా మరోసారి క్షిపణి ప్రయోగాలు చేపట్టింది. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఆ దేశం జరిపిన ఆదో పరీక్ష కావడం గమనార్హం.

North Korea Missiles Test : అమెరికాతో దౌత్యానికి బ్రేక్ పడటంతో ఉత్తర కొరియా (North Korea)ఆయుధ పరీక్షలను విస్తృతం చేసింది. యూఎస్‌ను తిరిగి చర్చలకు ఒప్పించేందుకు వరుసగా క్షిపణి ప్రయోగాలను చేపడుతూ అందరినీ భయాందోళనలకు గురి చేస్తోంది. అమెరికా హెచ్చరికలను కూడా పట్టించుకోకుండా ఉద్రిక్తతలకు ఆజ్యం పోసేలా ఉత్తర కొరియా మరోసారి క్షిపణి ప్రయోగాలు చేపట్టింది. గురువారం ఉత్తరకొరియా రెండు బాలిస్టిక్ క్షిపణులను జపాన్ సముద్రంలోకి ప్రయోగించిందని దక్షిణ కొరియా సైనికాధికారులు తెలిపారు. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఆ దేశం జరిపిన ఆదో పరీక్ష కావడం గమనార్హం. తాజా క్షిపణులను జపాన్ సముద్రంలోకి ప్రయోగించారని దక్షిణ కొరియా అధికారులు తెలిపారు. అవి ఎంతదూరం ప్రయాణించాయనేది తెలియలేదని చెప్పారు. స్వల్పశ్రేణి క్షిపణులను ఉపయోగించినట్లు అధికారులు భావిస్తున్నారు. తాజా పరిణామాలపై దక్షిణ కొరియా, అమెరికా నిఘా అధికారులు విశ్లేషణ జరుపుతున్నారు.

ఇక,కరోనా వైరస్ వ్యాప్తితో సరిహద్దులను మూసివేయడం, అమెరికా ఆంక్షలతో ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో అణ్వస్త్ర అంశంపై అమెరికాతో నిలిచిపోయిన చర్చలను పునఃప్రారంభించాలని ఆ దేశం భావిస్తోంది. ఈ విషయంలో బైడెన్‌ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వరుస క్షిపణి ప్రయోగాలు నిర్వహిస్తోందనే విశ్లేషణలు కొనసాగుతున్నాయి. అణ్వస్త్రాలు, అమెరికాను కూడా లక్ష్యంగా చేసుకోగల దీర్ఘశ్రేణి క్షిపణులను పరీక్షిస్తామని కూడా ఉత్తర కొరియా ఇటీవలే హెచ్చరించింది. 2018లో అమెరికాతో దౌత్యం మొదలయ్యాక ఈ తరహా ఆయుధాల పరీక్షలను ఆ దేశం నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, 2017 తర్వాత ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు, అణ్వాయుధ క్షిపణులను ఆ దేశం ప్రయోగించలేదు.

ALSO READ Upside down house : ఆ ఇంట్లో కొద్దిసేపు గడిపేందుకు ఎగబడుతున్న జనం..అంత ప్రత్యేకత ఏంటంటే.

ఇక,ఈ నెలలోనే హైపర్​సోనిక్ మిసైల్ పరీక్షలు నిర్వహించింది. రైలు నుంచి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.తమ దేశాన్ని అమెరికా శత్రుస్వభావంతో చూస్తోందని, ఈ నేపథ్యంలో.. అణు పరీక్షలు ముమ్మరం చేస్తామని ఉత్తర కొరియా ఇటీవల ప్రకటించింది. ఫిబ్రవరిలో చైనాలో శీతాకాల ఒలింపిక్స్‌ ముగిశాక మరిన్ని క్షిపణి పరీక్షలకు ఉత్తర కొరియా దిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక, ఉత్తర కొరియా దుందుడుకు చర్యలపై అమెరికా చర్యలకు దిగింది. క్షిపణి పరీక్షలు నిర్వహించేందుకు సాంకేతిక సాయం అందిస్తున్న ఐదు సంస్థలపై ఇప్పటికే చర్యలు చేపట్టింది. వీటితోపాటు ఆ దేశంపై కొత్త ఆంక్షలు విధించాలని ఐక్యరాజ్యసమితిని కూడా కోరతామని తెలిపింది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Kim jong un, Missile, North Korea

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు