ఘోర రోడ్డు ప్రమాదం...రెండు బస్సులు ఢీకొని 60 మృతి

ఘనాలో రోడ్డు ప్రమాద ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. రోడ్డుప్రమాదాల్లో రోజుకు సగటున ఆరుగురు చనిపోతున్నారు. 2016లో కింటాంపోలో పబ్లిక్ బస్సు, ట్రక్కు ఢీకొని 61 మంది చనిపోయారు.

news18-telugu
Updated: March 22, 2019, 9:02 PM IST
ఘోర రోడ్డు ప్రమాదం...రెండు బస్సులు ఢీకొని 60 మృతి
ఘనా రోడ్డుప్రమాదం
  • Share this:
ఆఫ్రికా దేశం ఘనాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అతివేగంతో ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొని 60 మంది చనిపోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బోనో తూర్పు ప్రాంతంలోని అంపోమా పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది.

రెండు బస్సుల్లో కలిపి సుమారు 100 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఓ బస్సులో మంటలు చెలరేగడంతో కొందరు సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో గాయపడిన 28 మంది సమీప ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. ప్రమాదంపై ఘనా అధ్యక్షుడు నానా అకుఫో అడ్డో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కాగా, ఘనాలో రోడ్డు ప్రమాద ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. రోడ్డుప్రమాదాల్లో రోజుకు సగటున ఆరుగురు చనిపోతున్నారు. 2016లో కింటాంపోలో పబ్లిక్ బస్సు, ట్రక్కు ఢీకొని 61 మంది చనిపోయారు.
Published by: Shiva Kumar Addula
First published: March 22, 2019, 9:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading