Shocking Video : అగ్రరాజ్యంలో గన్‌కల్చర్ పెరిగిపోతుంది. వరుస కాల్పుల ఘటనలు అమెరికాలో(USA)కలకలం రేపుతున్నాయి. కాలేజీలు, స్కూళ్లు అనే తేడా లేకుండా అన్నివయసుల వాళ్లు తుపాకులతో కాల్పులకు తెగబడుతున్నారు. గతేడాది అమెరికాలో జరిగిన కాల్పుల్లో 44 వేల మందికిపైగా మరణించారు. పబ్బులు, మెట్రో స్టేషన్లు,హాస్నిటల్స్,స్కూళ్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఈ కాల్పుల సంఘటనలు జరిగాయి. ఇందులో హత్యలు, తమను తాము రక్షించుకోవడానికి కాల్పులు జరపడం, ఆత్మహత్యల వంటివి ఉన్నాయి. ఇక,తాజాగా వర్జీనియా(Virginia)లోని న్యూపోర్ట్ సిటీలోని ఎలిమెంటరీ స్కూల్లో ఆరేళ్ల విద్యార్థి టీచర్‌పై కాల్పులు జరపడం సంచలనం రేకెత్తిస్తోంది. స్కూల్‌లో చదువుతున్న ఆరేళ్లు కుర్రాడు తరగతి గదిలోనే టీచర్‌పై గన్‌తో కాల్పులు జరిపాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. గాయపడిన టీచర్‌ని హాస్పిటల్‌లో చేర్పించినట్లు పోలీసులు చెప్పారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉన్నదని స్థానిక పోలీస్ చీఫ్ స్టీవ్ డ్రూ చెప్పారు. ఈ కాల్పుల్లో ఇతర విద్యార్థులెవరూ గాయపడలేదని తెలిపారు. టీచర్ పై కాల్పులు జరిపిన బాలుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
ఇది ప్రమాదవశాత్తు జరిగిన కాల్పులు కాదని స్టీవ్ డ్రూ తెలిపారు. కాల్పులకు సంబంధించి మధ్యాహ్నం 2 గంటల సమయంలో తమకు సమాచారం అందిందని చెప్పారు. సమాచారం అందిన వెంటనే తమ బృందం సంఘటనా స్థలానికి చేరుకుందన్నారు. కాల్పులు జరిపిన విద్యార్థి గురించి పోలీసులు ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. ఈ ఘటన తన మనసుకు ఎంతో బాధ కలిగించిందని వర్జీనియా మేయర్ ఫిలిప్ జోన్స్ మీడియాకు తెలిపారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దేశంలో ఆయుధాల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గతంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే. కాగా,ఇప్పుడు కాల్పులు జరిగిన న్యూపోర్ట్ సిటీలో 185,000 కంటే ఎక్కువ జనాభా ఉంది. ఈ పట్టణం చెసాపీక్, వర్జీనియా బీచ్ నుంచి 40 మైళ్ళ దూరంలో ఉంది. ఈ నగరం యు.ఎస్ నావికాదళానికి నౌకానిర్మాణానికి కూడా ప్రసిద్ది చెందింది.
Earthquake: భారత్, ఆప్ఘనిస్తాన్‌లో భూకంపం .. ప్రకంపనలతో దెబ్బతిన్న 500పైగా ఇళ్లు
మరోవైపు,రెండు రోజుల క్రితం అమెరికాలోని ఉటాహ్ రాష్ట్రంలో ఓ ఇంట్లో జరిగిన కాల్పుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 5గురు చిన్నారులు ఉన్నారు. ఎవరు ఈ పని చేశారు? ఎందుకు చేశారు అన్న అంశాలపై విచారణ కొనసాగుతోంది. దీనిపై ప్రస్తుతానికి అధికారులు పూర్తి స్థాయి సమాచారం ఇవ్వలేదు. త్వరలోనే నిందితుడుని పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. 2023 మొదటి మూడు రోజుల్లోనే అమెరికాలో కాల్పుల్లో చనిపోయిన వారి సంఖ్య పెరిగిపోయింది. కేవలం ఈ మూడు రోజుల్లో 130 మంది చనిపోగా,300 మంది గాయపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Gun fire, USA