Surgical Strike 3.0 | భారత ఆర్మీ మెరుపు దాడుల్లో 6-10 మంది పాక్ సైనికులు హతం

కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుతూ పాకిస్తాన్ చేసిన పనికి భారత్ గట్టి బదులిచ్చిందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రకటించారు.

news18-telugu
Updated: October 20, 2019, 7:11 PM IST
Surgical Strike 3.0 | భారత ఆర్మీ మెరుపు దాడుల్లో 6-10 మంది పాక్ సైనికులు హతం
బిపిన్ రావత్
news18-telugu
Updated: October 20, 2019, 7:11 PM IST
కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుతూ పాకిస్తాన్ చేసిన పనికి భారత్ గట్టి బదులిచ్చిందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రకటించారు. ‘టెర్రరిస్టులు భారత భూభాగంలోకి చొచ్చుకు రావడానికి సిద్ధంగా క్యాంప్‌ల్లో ఉన్నారనే సమాచారం మాకు వచ్చింది. గత నెల రోజుల కాలంలో చాలా చోట్ల ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలను గుర్తించాం.’ అని బిపిన్ రావత్ అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్‌ల మీద భారత ఆర్మీ మెరుపుదాడులు చేసింది. ఈ దాడుల్లో ఆరు నుంచి 10 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నట్టు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ప్రకటించారు. తాంగ్‌ధర్ వద్ద జరిగిన దాడుల్లో ఇద్దరు భారత సైనికులు అమరులయ్యారు, ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. ‘నిన్న రాత్రి తాంగ్‌ధర్ ప్రాంతంలో చొరబాటుకు టెర్రరిస్టులు ప్రయత్నించారు. ఆ సమయంలో భారత ఆర్మీ స్థావరాలపై పాకిస్తాన్ కాల్పులు జరిపింది. దీన్ని మేం తిప్పికొట్టాం. చొరబాట్లను అడ్డుకున్నాం.’ అని రావత్ తెలిపారు.

ప్రధాని మోదీతో బాలీవుడ్ ప్రముఖుల సమావేశం



First published: October 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...