అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అలస్కాలో సైట్ సీయింగ్ ప్లేన్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్‌తో పాటు ఐదుగురు పర్యాటకులు మరణించారు. కెచికాన్లోని మిస్టీ ఫార్డ్స్ నేషనల్ మోనుమెంట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కెచికాన్లో అందమైన ప్రకృతిని చూపించేందుకు చాలా సంస్థు సైట్ సీయింగ్ విమానాలు నడుతుపున్నాయి. ఈ క్రమంలోనే సౌత్ ఈస్ట్ ఏవియేషన్‌కు చెందిన ఓ చిన్న విమానం పర్యాటకులతో గాల్లోకి ఎగిరింది. గురువారం ఉదయం 11.30 సమయంలో విమానంలోని ఎమర్జెన్సీ అలర్ట్ బెకన్ యాక్టివేట్ అయింది. వెంటనే కోస్ట్ గార్డ్ సిబ్బంది రంగంలోకి దిగి విమానం కోసం గాలించారు. మధ్యాహ్నం 02.30 సమయంలో కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ కూలిపోయిన విమానం శకలాలను మిస్టీ ఫార్డ్స్ నేషనల్ మోనుమెంట్ సమీపంలో గుర్తించింది. హెలికాప్టర్ నుంచి ఇద్దరు స్విమ్మర్స్‌ను కిందకు దింపి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ ఎవరూ బతికి లేరని గుర్తించారు. విమాన ప్రమాదంలలో మొత్తం ఆరుగురూ మరణించారని కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు.
మృతులు హోలాండ్ అమెరికా లైన్ క్రూయిజ్ షిప్ న్యూ ఆమ్స్టర్డామ్కు చెందిన పర్యాటకులుగా గుర్తించారు. కెచికాన్ ప్రాంతం ప్రకృతి అందాలకు నిలయంగా ఉంది.మంచు కొండు, గడ్డకట్టిన సరస్సులతో అద్భుతంగా ఉంటుంది. అక్కడికి దేశవిదేశాల నుంచి పర్యాటకులు నౌకల్లో వస్తుంటారు. అనంతరం పోర్టు నుంచి సైట్ సీయింగ్ కోసం చిన్న చిన్న విమానాల్లో ప్రయాణిస్తారు. ఇలా న్యూ ఆమ్స్టర్డామ్ షిప్లో వచ్చిన కొందరు ప్రయాణికులు సౌత్ ఈస్ట్ ఏవియేషన్‌కు చెందిన ది హ్యావిలాండ్ బీవర్ విమానంలో సైట్ సీయింగ్‌కు వెళ్లారు. ఐతే ఆ సమయంలో చిరుజల్లులతో పాటు భారీగా ఈదరు గాలులు వీస్తున్నాయి. విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే కుప్పకూలింది. ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
2019లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. రెండు సైట్ సీయింగ్ విమానాలు గాల్లో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఆ ఘటనలో 16 మంది మరణించారు. తాజాగా చోటుచేసుకున్న విమాన ప్రమాదంపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు దర్యాప్తు చేయనుంది. రేపు కొందరు అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించనున్నారు. అటు ఫెడర్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) కూడా రంగంలోకి దిగింది. ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తామని వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.